bigg boss 5: ఇంకా దగ్గరవ్వాలని అనుకున్నా.. ఆ హక్కు నీకే ఉంది.. సన్నీపై ప్రియ ఆఖరి డైలాగ్స్

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5.మొత్తానికి పడి లేస్తూ ఏడు వారాలను పూర్తి చేసుకుంది. మధ్యలో రేటింగ్స్ కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ మళ్ళీ ప్రత్యేకమైన టాస్క్ లతో నిర్వాహకులు ప్రేక్షకుల మనసులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం అయితే బిగ్ బాస్ షో చాలా బోరింగ్ గా కొనసాగింది అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి.

ఇక 7వ వారంలో మాత్రం పరిస్థితులు చాలా వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ను క్రియేట్ చేశాయి. అయితే అందులో ఎక్కువగా హైలెట్ అయ్యింది మాత్రం సన్నీ ప్రియా మాత్రమే. ఇద్దరు కోపంతోనే కాకుండా ప్రేమతో కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. మొత్తానికి ఈ వారం ప్రియ ఎలిమినేట్ అయింది. ఇక ఆమె వెళ్ళిపోయే సమయం లో అందరి గురించి మాట్లాడింది. ఇక సన్నీ గురించి కాస్త ప్రత్యేకంగా వివరణ ఇచ్చింది.

నాగార్జున సండే ఫన్ డే..

నాగార్జున సండే ఫన్ డే..

శనివారం కాస్త నార్మల్ గానే కనిపించినా నాగార్జున ఆదివారం మాత్రం ఫుల్ జోష్ తో కనిపించారు. కంటెస్టెంట్స్ అందరితోనూ మంచి ఆటలు ఆడించడమే కాకుండా ఎలిమినేషన్ ప్రక్రియను కూడా చాలా తెలివిగా కొనసాగించారు. వివిధ రకాల గేమ్స్ పెడుతూ ఒకరి తరువాత మరొకరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా సండే ఫండే అనే ట్యాగ్ కు కూడా న్యాయం చేశారు. అందరూ కూడా ఎంతో సరదాగా పాటలు పాడుతూ డాన్స్ చేసుకుంటూ కనిపించారు. ఇక మధ్యమధ్యలో ఎలిమినేషన్ ప్రక్రియను కూడా రసవత్తరంగా కొనసాగించారు.

అనుకున్నట్లుగానే..

అనుకున్నట్లుగానే..

ఆఖరికి ప్రియ అనీ మాస్టర్ ఇద్దరు మాత్రమే మిగలడంతో ఎవరు వెళ్ళిపోతారు హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఎప్పటిలానే రెండు రోజుల ముందే ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అనే విషయం ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చేసింది. అంతేకాకుండా కొన్ని వార్తలతో కూడా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పెరి లీక్ అయింది. మొత్తానికి ప్రియా హౌస్ లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక నాగార్జున అందరి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చారు.

అందరికంటే ఎక్కువ ప్రియాంకతోనే..

అందరికంటే ఎక్కువ ప్రియాంకతోనే..

ఒక్కొక్కరికి మార్కులు వేసుకుంటూ వచ్చిన ప్రియ చాలా సున్నితంగా మాట్లాడింది. ముఖ్యంగా సన్నీ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి హైలెట్ గా నిలిచాయి. అందరికంటే ప్రియాంకకు ఎక్కువగా పదికి వంద మార్కులు ఇచ్చిన ప్రియా ఎంత ఎమోషనల్ గా మాట్లాడింది. హౌస్ లో తనతో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది అని అంటూ.. ఉదయాన్నే లేవగానే తన మొహాన్ని చూస్తూ ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన మొహం చూడని రోజు నాకు ఏదో ఒకటి జరిగేదని వివరణ ఇచ్చింది.

Recommended Video

#BiggBossTelugu5 : Vj Sunny సూపర్ పవర్ | Shannu ని దాటేస్తాడేమో || Filmibeat Telugu
సన్నీ గురించి ఆఖరి మాటలు

సన్నీ గురించి ఆఖరి మాటలు

ఇక సన్నీ గురించి మాట్లాడుతూ.. అతనికి 9 మార్కులు ఇస్తున్నాను. బిగ్ బాస్ లో గేమ్ లో భాగంగా ఎన్నో అనుకుంటాం. అవన్నీ కూడా ఆ క్షణంలోనే వదిలేయాలి. ఇప్పుడు నా ప్లేట్ లో తినే హక్కు నీకు ఉంది. నా కప్పులో టీ తాగే హక్కు కూడా నీకు ఉంది. నిజానికి ఈ వారం మరింత దగ్గర అవ్వాలని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఎలిమినేట్ కావాల్సి వస్తుందని ప్రియా సన్నీ గురించి కాస్త ఎమోషనల్ గానే డైలాగ్స్ వదిలింది. దీంతో సన్నీ కూడా కాస్త ఫీల్ అయినట్లు కనిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X