Bigg Boss: కిస్ ఇస్తానన్న ప్రియ.. సంతోషంలో ముద్దు పెట్టిన సన్నీ.. సెన్సార్ లేకుంటే అది కూడా అంటూ!
ఊహకే అందని కంటెంట్‌తో ప్రసారం అవుతోన్నా.. ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందించడంతో సూపర్ డూపర్ హిట్ అయిన షో బిగ్ బాస్. అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో నడిచే దీనికి అన్ని భాషల కంటే మన దగ్గరే మంచి రెస్పాన్స్ అందుతోంది. అందుకే మన షో నేషనల్ లెవెల్‌లో సక్సెస్‌ను అందుకుంది. అందుకే ఇండియాలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఇలా ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది.
Recommended Video
ఈ క్రమంలోనే గత నెలలోనే ఐదోది కూడా ప్రారంభం అయింది. దీనికి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. గత సీజన్ల కంటే ఇందులో ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. దీంతో ఇది ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రియ కొంటెగా కవ్విస్తూ సన్నీని రెచ్చగొట్టింది. అతడు ఓ రేంజ్‌లో రెచ్చిపోయి ముద్దులు పెట్టేశాడు. ఆ వివరాలు మీకోసం!

మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా
ఇప్పటి వరకూ వచ్చిన నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులతో షో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో మరింత మజాను పంచుతూ సాగుతోంది. దీంతో భారీ రేటింగ్‌ను కూడా సంపాదించుకుంటోంది.

కెప్టెన్సీ కంటెండర్స్... లోబో రాక వల్ల
ఏడో వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం జరిగిన 'బంగారు కోడిపెట్ట' టాస్కులో ఎక్కువ గుడ్లను సేకరించిన విశ్వ, యాంకర్ రవి, సన్నీ, శ్రీరామ చంద్ర, మానస్‌ల దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉండడంతో వీళ్లే కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. ఇక, ఇంతలో రీఎంట్రీ ఇచ్చిన లోబో తన దగ్గర ఉన్న స్పెషల్ పవర్స్‌ను ఉపయోగించాడు. ఇందులో భాగంగానే నలుపు రంగు గుడ్డును శ్రీరామ చంద్రకు ఇచ్చి అతడిని కెప్టెన్సీ టాస్కు నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేశాడు. అదే సమయంలో బంగారు రంగు గుడ్డును ఆర్జే కాజల్‌కు ఇచ్చి.. కెప్టెన్సీ కోసం పోటీ పడే అవకాశాన్ని అందించాడు.

బెలూన్ కాపాడుకంటే కెప్టెన్ అంటూ
ఈ వారం కెప్టెన్సీ పోటీదారులకు బిగ్ బాస్ బెలూన్లను కాపాడుకునే టాస్క్ ఇచ్చాడు. కంటెడర్లకు ఒక్కో బెలూన్‌ను కట్టుకోవాలి. ఆ తర్వాత సమయానుగుణంగా బజర్ మోగుతుంది. అప్పుడు మిగతా కంటెస్టెంట్లు వెళ్లి సూదిని సంపాదించాలి. దాన్ని తమకు ఇష్టమైన కెప్టెన్సీ కంటెండెర్స్‌కు ఇచ్చే అవకాశం ఉంది. అలా సూది దక్కించుకున్న పోటీదారుడు.. మిగతా కెప్టెన్సీ కంటెండర్ దగ్గర ఉన్న బెలూన్‌ను పగలగొట్టాలి. అలా చివరి వరకు ఎవరి బెలూన్ ఉంటుందో వారే విజేత అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఈ గేమ్‌లో కంటెస్టెంట్లు అందరినీ భాగం చేసేలా ప్లాన్ చేశాడు.

కెప్టెన్ అయిన సన్నీ.. ఎలా జరిగింది?
కెప్టెన్సీ కంటెడర్ల టాస్కులో భాగంగా.. మొదటి బజర్‌లో జెస్సీ సూదిని అందుకుని కాజల్‌కు ఇచ్చాడు. ఆమె విశ్వను టార్గెట్ చేస్తుండగా బెలూన్ పగిలిపోయింది. ఆ తర్వాత విశ్వ సూదిని అందుకుని రవికి ఇచ్చాడు. అప్పుడతను మానస్ బెలూన్‌ను పగలగొట్టేశాడు. ఇక, మూడోసారి బజర్ మోగిన సమయంలో లోబో సూదిని అందుకున్నాడు. దీన్ని రవికి ఇవ్వగా కాజల్ బెలూన్‌ను పగలగొట్టేశాడు. చివరి బజర్ మోగగానే సూదిని ఆనీ మాస్టర్ అందుకున్నారు. అప్పుడామె దాన్ని సన్నీకి ఇవ్వగా.. అతడు రవి బెలూన్ పగలగొట్టి ఇంటికి ఏడో కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.

నిన్న గొడవ.. ఈరోజు అలాంటి సైగలు
ఈ వారం నామినేషన్స్ టాస్కు నుంచి ప్రియ, సన్నీ మధ్య గొడవ మొదలైన విషయం తెలిసిందే. ఇద్దరూ తరచూ ఒకరిపైకి ఒకరు వెళ్లడం.. తిట్టుకోవడం వంటివి చేశారు. ప్రియ అయితే ఏకంగా చెంప పగలగొడతా అని కూడా వార్నింగ్ ఇచ్చింది. సన్నీ కూడా అదే దూకుడుగా ఆమె మీదకు వెళ్లాడు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మాత్రం ప్రియ పూర్తి భిన్నంగా కనిపించింది. సన్నీ తన ప్లేట్‌తో పాటు కాఫీ కప్ కూడా కడిగాడని సంతోషించింది. ఆ తర్వాత వేరే వాళ్లతో మాట్లాడుతూ 'ఈ సారి ఎప్పుడైనా సన్నీ తేడాగా చేస్తే.. కన్ను కొట్టి ముద్దు ఇస్తా' అని కొంటెగా చెప్పిందామె.

ఆమెను ముద్దుల్లో ముంచెత్తిన సన్నీ
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరిలో సన్నీ చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. అతడికి ఏ ఎమోషన్ వచ్చిన తట్టుకోలేకపోతున్నాడు. అయితే, ప్రియతో జరిగిన గొడవ సమయంలో మాత్రం చాలా హుందాగా ప్రవర్తించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక, కెప్టెన్సీ టాస్కులో విజయం సాధించిన తర్వాత అతడు ఊహించని పని చేశాడు. తనకు సూది ఇచ్చి కెప్టెన్ అయ్యేలా చేసేన ఆనీ మాస్టర్‌కు అందరి ముందే ముద్దులు పెట్టేశాడు. అంతేకాదు, 'సెన్సార్ లేకపోతే ఇంగ్లీష్ కిస్ కూడా ఇచ్చేవాడిని' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ప్రియ చేతిలో చేయి పెట్టి అలా చెప్పి
ఆరంభం నుంచే ప్రియతో తనకు ఏదో ఒక గొడవ జరుగుతుందని గుర్తించిన సన్నీ.. ఆమెతో క్లియర్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. కెప్టెన్ అయిన తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి 'మీకు ఏ పని ఇష్టం? ఏ డిపార్ట్మెంట్ ఇష్టమో కనుక్కుని అదే పని ఇవ్వాలని అనుకున్నా. ఈ ఇంట్లో మొదటగా కనెక్ట్ అయింది కూడా మీతోనే. ఇంత వరకు మన మధ్య మిస్ అండర్ స్టాండింగ్ వల్ల గొడవలు జరిగాయి. ఇకపై అర్థం చేసుకోండి. దానికి కాస్త టైం పడుతుందేమో కానీ అర్థం చేసుకోండి' అంటూ చేతిలో చేయి వేసి మరీ మాట్లాడాడు. దీనికి ప్రియ నవ్వుతూ బదులిచ్చింది.


Click it and Unblock the Notifications











