బిగ్ బాస్ 5: వైరల్ అవుతున్న మరికొన్ని పేర్లు.. టిక్ టాక్ స్టార్స్ కూడా?
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు తెలుగులో ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు వచ్చిన నాలుగు సీజన్లతో నిర్వాహకులు మంచి ఆదాయాన్ని రాబట్టారు. ఇక సీజన్ 5కోసం కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. కంటెస్టెంట్స్ లిస్ట్ ను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని పేర్లు అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

పెద్దగా కష్టపడిందేమి లేదు
నాగార్జున హోస్ట్ గా సీజన్ 4 కాస్త ఆలస్యంగా మొదలైన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా లేటుగా మొదలైనప్పటికి మంచి రేటింగ్ అందుకుంది. అయితే కంటెస్టెంట్స్ విషయంలో కూడా బిగ్ బాస్ నిర్వాహకులు పెద్దగా కష్టపడింది లేదు. తక్కువ రేంజ్ ఉన్న వారిని సెలెక్ట్ చేసుకోవడం పట్ల షో పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

సరికొత్త ప్లాన్
అయితే ఈ సారి కాస్త హై రేంజ్ లో ఆలోచించాలని బిగ్ బాస్ నిర్వాహకులు సరికొత్త ప్లాన్ వేశారు. బిగ్ బాస్ సీజన్ 5కోసం విభిన్నమైన సెలబ్రెటీలను తీసుకురానున్నారట. ఆడియెన్స్ అందరికి కనెక్ట్ అయ్యే వారిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టిక్ టాక్ స్టార్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

యూ ట్యూబ్ స్టార్
బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన కంటెస్టెంట్ లిస్ట్ ఇదే అంటూ గత కొన్ని వారాలుగా ఒక గాసిప్ అయితే వైరల్ అవుతుంది. ముఖ్యంగా యూ ట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ తప్పకుండా వస్తాడని అంటున్నారు. అసలైతే గత ఏడాదే అతనికి ఆఫర్ వచ్చిందట. కానీ బిజీగా ఉండడం వల్ల వెళ్లలేకపోయినట్లు తోటి నటీనటులు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

టిక్ టాక్ స్టార్స్ కూడా
ఇక ఈ సారి షణ్ముక్ రావడం పక్కా అనే కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ప్రముఖ యాంకర్ రవి కూడా రావచ్చు అని ఒక టాక్ అయితే వస్తోంది. ఇక జబర్దస్త్ నుంచి హైపర్ ఆది కూడా రావచ్చని అంటున్నారు. టిక్‌టాక్ స్టార్ దుర్గా రావు పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది.

మొదలయ్యేది ఎప్పుడంటే
మొత్తంగా 30 మందికి పైగా పేర్లను ఫైనల్ చేశారట. ఇక అందులో 16మందిని కంటెస్టెంట్స్ గా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక షోను షోను జూన్ తుది వారంలో లేదా జూన్ మొదటి వారంలో మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి మాత్రం బిగ్ బాస్ నెవర్ బిఫోర్ అనేలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











