For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఆ కంటెస్టెంట్లకు భారీ షాకిచ్చిన బిగ్ బాస్.. వాళ్లను ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటన

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. ఇండియా వ్యాప్తంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. అసలే మాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి తెలుగు ప్రేక్షకుల ఒకింత ఎక్కువ రెస్పాన్స్‌నే అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ షోగా మారిపోయింది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లు ప్రారంభిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక, ఇటీవలే మొదలైన ఐదో సీజన్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో సరికొత్త టాస్కులు మరింత మజాను పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆ సంగతులు మీకోసం!

  ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కుతో రచ్చ

  ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కుతో రచ్చ

  ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో బ్లూ టీమ్‌లో సభ్యులుగా మానస్‌, సన్నీ, యానీ మాస్టర్‌.. ఎల్లో టీమ్‌ సభ్యులుగా షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ.. రెడ్‌ టీమ్‌ సభ్యులుగా విశ్వ, శ్రీరామ్‌, ప్రియ.. గ్రీన్‌ టీమ్‌ సభ్యులుగా రవి, లోబో, శ్వేతలను విభజించారు. ఇక, సిరి హన్మంత్, కాజల్‌ను సంచాలకులుగా చేశారు.

  హాట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ అందాల ఆరబోత: ఎద భాగం మొత్తం కనిపించేలా.. మరీ ఇంత దారుణమా!

   నాలుగు టీమ్‌ల మధ్య పోటీ.. వాళ్లు టాప్

  నాలుగు టీమ్‌ల మధ్య పోటీ.. వాళ్లు టాప్

  ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కు రెండు రోజులుగా పోటాపోటీగా జరుగుతోంది. ప్రతి టీమ్ సభ్యులూ తమ దగ్గర ఉన్న మెటీరియల్‌తో బొమ్మలను తయారు చేస్తున్నారు. అయితే, అందులో కొన్ని బొమ్మలు సరిగా లేవని సంచాలకులు కమ్ మేనేజర్లు సిరి, కాజల్ రిజెక్ట్ చేశారు. ఇక, ఈ టాస్కులో రవి టీమ్‌కు స్పెషల్ పవర్స్ లభించాయి. దీంతో వాళ్లు మానస్ టీమ్‌ బొమ్మలు తీసుకున్నారు.

  ఇద్దరు అమ్మాయిల అతి.. గొడవ పడుతూ

  ఇద్దరు అమ్మాయిల అతి.. గొడవ పడుతూ

  ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కులో సంచాలకులుగా చేస్తున్న సిరి హన్మంత్, కాజల్ అతి చేస్తున్నారు. మేము చెప్పిందే వినాలి.. మాకు నచ్చినట్లు ఉండాలి అంటూ వీళ్లిద్దరూ అన్ని టీమ్‌లపై అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్లకు నచ్చినట్లుగా కొన్ని రూల్స్‌ను కూడా పెట్టారు. దీంతో వాళ్లను వ్యతిరేకిస్తూ పలువురు సభ్యులు గొడవలకు దిగారు.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  ఓకే చేసినవి సరిగా కాపాడుకోలేదని అలా

  ఓకే చేసినవి సరిగా కాపాడుకోలేదని అలా

  బజర్ మోగే సమయానికి ఏ టీమ్ దగ్గర ఎన్ని బొమ్మలు కరెక్ట్‌గా ఉన్నాయో సంచాలకులు నిర్ణయిస్తారు. అయితే, తాజాగా విడుదలైన ప్రోమోలో ఇప్పుడు ఓకే చేసిన బొమ్మలను మళ్లీ చెక్ చేస్తానని కాజల్ చెప్పింది. ఆ సమయంలో మీరు వాటిని సరిగా దాచుకోలేదంటూ కొన్నింటిని రిజెక్ట్ చేసింది. దీంతో రవి టీమ్‌తో ఆమెకు పెద్ద గొడవ జరిగింది. ఇది పెద్ద రచ్చగా అయినట్లు కనిపించింది.

  రూల్ బ్రేక్ చేసిన సభ్యులు.. భారీ షాకిస్తూ

  రూల్ బ్రేక్ చేసిన సభ్యులు.. భారీ షాకిస్తూ

  ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కులో భాగంగా కొందరు సభ్యులు రూల్స్‌ను బ్రేక్ చేశారంటూ తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ చెప్పాడు. అంతేకాదు, ఆయా సభ్యులను కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు నుంచి ఎలిమినేట్ (అనర్హులుగా) చేస్తున్నట్లు కూడా ప్రకటించాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ షాకై నోరెళ్లబెట్టేశారు. అయితే, రూల్ బ్రేక్ చేసింది ఎవరో సస్పెన్స్‌గా ఉంచాడు.

  హాట్ షో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్: గతంలో ఎన్నడూ చూడనంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  ఆమెను ఎత్తుకుని డ్యాన్స్ చేసేసిన సన్నీ

  ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కులో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా బిగ్ బాస్ కొందరిని అనర్హులుగా ప్రకటించడంతో బ్లూ టీమ్‌కు చెందిన వీజే సన్నీ ఫుల్ ఖుషీ అయ్యాడు. ఆ వెంటనే తన టీమ్ సభ్యురాలు ఆనీ మాస్టర్‌ను ఎత్తుకుని మరీ డ్యాన్స్ చేశాడు. దీంతో మిగిలిన వాళ్లంతా ధీనంగా వాళ్ల వైపు చూడడం కనిపించింది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుంది.

  Bigg Boss 5 Telugu Beauty Hamida Exclusive Interview
  ఎలిమినేట్ అయిన సభ్యులు వీళ్లేనంటూ

  ఎలిమినేట్ అయిన సభ్యులు వీళ్లేనంటూ

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్కులో హౌస్‌లోని పిల్లోలు కట్ చేసి కాటన్ తీసుకున్న యాంకర్ రవి టీమ్‌ సభ్యులను అనర్హులుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అలాగే, సంచాలకులుగా పూర్తిగా విఫలం అయిన సిరి హన్మంత్, ఆర్జే కాజల్‌ను కూడా ఈ టాస్కు నుంచి తప్పించారని అంటున్నారు. దీంతో మిగిలిన వాళ్లే కెప్టెన్‌గా పోటీ పడనున్నారు.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Recently Started 5th Season. In Upcoming Episode.. Bigg Boss disqualify Siri Hanmanth and RJ Kajal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X