Bigg Boss Telugu Promo: షోలో ఫిజికల్ ఫైటింగ్.. వేలు చూపిస్తూ మీదకెళ్లిన సన్నీ.. చెంప పగడలగొడతానంటూ ఘోరంగా!

బిగ్ బాస్.. ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇండియాలోని చాలా భాషల్లో ఇది ప్రసారం అవుతోన్నా.. మన దగ్గర మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. అదే సమయంలో ఇక్కడ నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది.

ఇప్పుడు ప్రసారం అవుతోన్నా ఐదో సీజన్ కూడా ప్రేక్షకులకు మజాను పంచుతూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో ఊహించని పరిణామాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే వచ్చే ఎపిసోడ్‌లో ఇద్దరి మధ్య ఫిజికల్ ఫైట్ జరిగింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

గతంలో కంటే ఎక్కువగా ఉండడంతో

గతంలో కంటే ఎక్కువగా ఉండడంతో

తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లను పూర్త చేసుకుంది. అన్నింట్లోనూ కంటెస్టెంట్ల మధ్య ఫైటింగులు బాగానే కనిపించాయి. అయితే, ఈ సీజన్‌లో మాత్రం అవి కాస్త ఎక్కువగా జరుగుతున్నాయి. ఆరంభ వారంలో జరిగిన నామినేషన్స్ టాస్కు నుంచి మొదలుకొని తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. దీంతో షో రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతూ మజాను పంచుతూనే ఉంది.

ఏడో వారం నామినేషన్స్‌ రచ్చ రచ్చ

ఏడో వారం నామినేషన్స్‌ రచ్చ రచ్చ

ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ కూడా రచ్చ రచ్చగానే సాగింది. ఇందులో హంటర్‌గా ఉన్న సన్నీ తనకు నచ్చిన వాళ్లను సేఫ్ చేసి.. మిగిలిన వాళ్లను నామినేట్ చేస్తున్నాడన్న ఆరోపణలతో ఆ ఎపిసోడ్‌లో కొన్ని గొడవలు జరిగాయి. మరీ ముఖ్యంగా అతడు ప్రియ మీద ఉన్న కోపంతో రవిని నామినేట్ చేయడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.

బంగారు కోడిపెట్ట కూడా అదే తీరుగా

బంగారు కోడిపెట్ట కూడా అదే తీరుగా

ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కే 'బంగారు కోడిపెట్ట'. ఈ టాస్కులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న కోడి నుంచి వచ్చిన గుడ్లను కంటెస్టెంట్లు సేకరించాలి. అలాగే, పై నుంచి పడుతున్న వాటిని కూడా ఒడిసి పట్టుకోవాలి. వాటికి కంటెస్టెంట్లు తమ ఫొటోలతో ఉన్న స్టిక్కర్లను అతికించాలి. ఈ టాస్కు కూడా కొన్ని గొడవలతో రచ్చ రచ్చగా సాగింది.

ప్రియ వర్సెస్ సన్నీ.. కంటిన్యూగానే

ప్రియ వర్సెస్ సన్నీ.. కంటిన్యూగానే

బిగ్ బాస్ ఐదో సీజన్ ఆరంభం నుంచే ప్రియ, సన్నీ మధ్య ఏదో రకమైన గొడవ జరుగుతూనే ఉంది. దీంతో ఇద్దరూ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫలితంగా విభేదాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే 'బంగారు కోడిపెట్ట' టాస్కులో సన్నీ గుడ్లను ప్రియ దొంగిలిచింది. దీంతో వీళ్లిద్దరి మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగింది.

రెచ్చగొట్టిన ప్రియ... సన్నీ వార్నింగ్

రెచ్చగొట్టిన ప్రియ... సన్నీ వార్నింగ్

'బంగారు కోడిపెట్ట' టాస్క్ జరుగుతున్నంత సేపు ప్రియ తన నోటికి పని చెబుతూనే ఉంది. 'నేను గుడ్డు పట్టుకోను.. కానీ, ఎవరివైనా దొంగతనం చేస్తాను' అంటూ ముందే చెప్పిన ఆమె.. సన్నీని బాగా టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే అతడిని రెచ్చగొట్టేలా మాట్లాడింది. దీంతో అతడు పలుమార్లు ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో వీళ్ల గొడవ తారాస్థాయికి చేరిపోయింది.

చెంప పగలకొడతానని ప్రియ కోపంగా

చెంప పగలకొడతానని ప్రియ కోపంగా

బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను గత రాత్రి చూపించారు బిగ్ బాస్ నిర్వహకులు. ఇందులో ప్రియ దగ్గరకు వచ్చిన సన్నీ చైర్‌కు తగలడంతో ఆమె కింద పడిపోయింది. దీంతో సన్నీపై 'ఫిజికల్ అవుతున్నావు ఏంటి? చెంప పగిలిపోతుంది' అంటూ ఘోరంగా ఫైర్ అయింది. దీంతో కొందరు హౌస్‌మేట్స్ వచ్చి ఆమెను ఆపే ప్రయత్నం చేశారు.

ప్రియ మీదకు దూసుకెళ్లిన వీజే సన్నీ

ప్రియ మీదకు దూసుకెళ్లిన వీజే సన్నీ

చాలా రోజులుగా ప్రియపై కోపంగా ఉన్న సన్నీ.. తాజాగా జరిగిన గొడవలో ఓ రేంజ్‌లో ఫైర్ అయినట్లు ప్రోమోలో చూపించారు. ప్రియ చెంప పగులుతుంది అని అనగానే.. అతడు కూడా ఆమెకు వేలు చూపిస్తూ దూసుకెళ్లాడు. ఈ క్రమంలోనే మేల్ కంటెస్టెంట్లు అందరూ అతడిని పట్టుకుని వెనక్కి తీసుకు వస్తున్నారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ప్రియ వర్సెస్ సన్నీగా జరగబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X