Bigg Boss Telugu 5: జారిపడ్డ అనీ మాస్టర్, ప్రియాంక.. అలకపాన్పుపై సిరి.. సారీ సారీ అంటూ షణ్ముఖ్

బిగ్ బాస్ సీజన్ 5లో ఏడూ వారాలు పూర్తి అయ్యాయి. ఇక ఈ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ బిగ్ బాస్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం గొడవలు బాగా జరుగుతాయి, ఈరోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమో కూడా ఆసక్తికరంగా ఉంది. ఆ వివరాల్లోకి వెళితే

 ఠినమైన టాస్క్ లు

ఠినమైన టాస్క్ లు

కెప్టెన్ అవ్వడం కోసం ఇంటి సభ్యుల గట్టిగా పోరాడుతున్నారు. ప్రతి సారి లాగే కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కఠినమైన టాస్క్ లు ఇచ్చారు. ముందుగా ఇంటి సభ్యుల్లో లోబో, షణ్ముఖ్‌ లకు ఆవుపేడలో ముత్యాలు ఏరే టాస్క్ ఇచ్చారు. సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు ఏరే టాస్క్ ఇచ్చాడు. మానస్‌, శ్రీరామచంద్రలకు బలమైన తాళ్లను ఊపే టాస్క్ ఇచ్చారు. అనీ మాస్టర్, ప్రియాంకలకి పెయింటింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

లోబో, షణ్ముఖ్ లు

లోబో, షణ్ముఖ్ లు

ఇక ముందుగా సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు ఏరే టాస్కులో సిరి గెలిచింది. మానస్‌, శ్రీరామచంద్రలు బలమైన తాళ్లను అలిసిపోయి ఆగిపోయేదాకా ఉపాల్సి ఉండగా మానస్ మధ్యలో ఆయాసంతో ఆపేసాడు. శ్రీరామ్ మాత్రం చెమటలు కక్కుతున్న తాళ్ళని ఊపుతూనే ఉన్నాడు. దీంతో శ్రీరామ్ విన్ అయ్యారు. ఇక లోబో, షణ్ముఖ్ లు కూడా గట్టిగానే ఆడారు.

పెయింట్ వల్ల

ఇక వీళ్ళిద్దరికీ పేడ కలిపిన మట్టిలో కొన్ని ముత్యాలు వేసి ఆ ముత్యాలని ఒక్కొక్కటిగా బయటకు తీయాలి అనే టాస్క్ ఇచ్చారు. ఇద్దరూ ఆ పేడలో దొర్లాడగా షన్నుని ఈ టాస్క్ లో విజేతగా ప్రకటించారు. ఇక ఆ తరువాత అనీ మాస్టర్, ప్రియాంకలకి ఒక వైట్ బోర్డు ఇచ్చి ఇద్దరికీ రెండు రంగులు ఇచ్చారు. ఆ రంగులతో బోర్డుని నింపాలి. ఎవరు ఎక్కువ డామినేట్ చేసేలా కలర్ పూస్తారో వాళ్ళు విన్ అయినట్టు లెక్క. ఇక ఈ టాస్క్ లో పెయింట్ వల్ల ఇద్దరూ జారీ పడ్డారు.

నాకేం ఫరక్ పడదు

నాకేం ఫరక్ పడదు

ఇక వాళ్ళ నడుములు విరిగినట్టు చూపారు. అలాగే మరో పక్క కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ నుంచి ఎవరు డ్రాప్‌ అవుతారనే విషయంపై ఇంటి సభ్యుల మధ్య హాట్ హాట్ గా చర్చ జరిగింది. 'ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్నవాళ్లు.. ఇంతకు ముందు కెప్టెన్‌గా చేసినవాళ్లు ఈసారి బరి నుంచి వైదొలగమని చెబుతున్నారు. ఎవరో ఒక్కరు తప్పుకోవాలి కాబట్టి.. నేనే తప్పుకుంటున్నా, నాకు ఈ వారం వరెస్ట్‌ ఫెర్ఫార్మర్‌ ఇచ్చినా నాకేం ఫరక్ పడదు' అంటూ జెస్సీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Recommended Video

KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
సిరి మీద కోప్పడ్డ షణ్ముఖ్

సిరి మీద కోప్పడ్డ షణ్ముఖ్

అంతకు ముందు సిరి జెస్సీ విషయంలో కల్పించుకోబోగా వాడు చెప్పేది వాడిని చెప్పనివ్వు అంటూ షణ్ముఖ్ కోప్పడ్డారు. ఇక జెస్సీ కోపానికి కారణమేమిటి? రంగు పడిద్దిలో ఎవరు విజేతగా నిలిచారు? ఫైనల్ గా ఎవరు ఈవారం కెప్టెన్ అయ్యారు అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ వచ్చే వరకు ఆగాల్సిందే. మరి చూడాలి ఈ వారం ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు అనేది. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా ఆసక్తికరంగా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X