Bigg Boss 5: ఎలిమినేట్ అయినా వెనక్కి తగ్గని కాజల్.. అతన్ని గెలిపించేందుకు ఓట్లు అడుక్కుంటూ..
బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన రెండు మూడు వారాలలో కూడా ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అనే విషయంలో అనేక రకాల సందేహాలు నెలకొన్నాయి. ఇక కాజల్ ఎలిమినేషన్ పై మాత్రం కొంత సందిగ్ధత అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫైనల్ గా 14వ వారం లో ఎలిమినేట్ అయిన కాజల్ బయటకు వచ్చినా కూడా ఒక వ్యక్తిని గెలిపించేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తుందని అర్థమవుతుంది.

ముందే పట్టు సాధించింది..
రేడియో జాకీగా కాజల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం యాంకర్ గా కూడా అవకాశాలు అందుకుంటోంది. అయితే బిగ్ బాస్ లోకి వచ్చే ముందు ఆమె ఎలాగైనా టైటిల్ విన్నర్ గా నిలవాలని అనుకుంది. మొదటి సీజన్ నుంచి కూడా బిగ్ బాస్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన కాజల్ ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్ ను ఇంటర్వ్యూ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా తనదైన శైలిలో రివ్యూలు కూడా ఇచ్చింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ పై తెలియకుండానే పట్టు సాధించింది.

శత్రువుల సంఖ్య కూడా..
ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ గెలవాలని అనుకున్న కాజల్ ఇంట్లో ఉన్నన్ని రోజుల్లో కూడా చాలా స్ట్రాటజీని ప్లే చేసినట్లు అర్థమైంది. ప్రతి ఫ్రేమ్లో కనిపించాలని కాజల్ కష్టపడింది. గొడవపడింది. అయితే కొన్నిసార్లు ఆమె పెట్టుకున్న గొడవలలో నెగిటివిటీని క్రియేట్ చేశాయి. అంతే కాకుండా అతి కారణంగా ఆమెకు బిగ్ బాస్ హౌస్ లో శత్రువుల సంఖ్య కూడా పెరిగింది. ప్రతి విషయంలోనూ సంబంధం లేకపోయినా కూడా కాజల్ ఇన్వాల్వ్ అవుతోందనే విమర్శలు చాలానే వచ్చాయి.

ఎన్ని విమర్శలు చేసినా
ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా కూడా కాజల్ మాత్రం తన గేమ్ తను ఆడుకుంటూనే వెళ్ళింది. మధ్యలో ఆమె మానస్ కు సన్నికి చాలా దగ్గర అయ్యింది. ముఖ్యంగా సన్నీ విషయంలో కాజల్ ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సన్నీ కోసం ఆమె ఏవిక్షన్ పాస్ కూడా గెలిచి ఇచ్చింది. అంతేకాకుండా నాగార్జున ఒక విషయంలో సన్నీని విబేధించినప్పటికీ కూడా ఆ సమయంలో కాజల్ అతనికి మద్దతుగా నిలవడం గొప్ప విషయం అని చెప్పాలి. ఏదేమైనా కూడా స్నేహం విషయంలో కాజల్ చాలా నిజాయితీగా నడుచుకుందనే కామెంట్స్ వచ్చాయి.
Recommended Video

సన్నీ కోసం స్ట్రాటజీ..
అయితే బయటకు వెళ్లిన తర్వాత కూడా కాజల్ సన్నీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేలా ప్రణాళికలు రచించే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఆమె హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫాలోవర్స్ ఆమెకు భారీ స్థాయిలో వెల్ కమ్ చెప్పారు. అయితే అందరు కూడా ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న తరుణంలో సన్నికి ఓటెయ్యండి అంటూ ప్రచారాలు మొదలుపెట్టింది. మొదట్లోనే సన్నీ గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. ఇక ప్రస్తుతం ఆట మరింత ఆసక్తికరంగా మారడంతో ఓటు అనేది కూడా చాలా కీలకంగా మారాయి. కాబట్టి కాజల్ బయట కూడా తన స్ట్రాటజీని ఏ విధంగా ఉపయోగిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











