దీప్తితో బ్రేకప్‌పై పెదవి విప్పిన షణ్ముఖ్: బ్లాక్ చేసిన మాట నిజమే.. అందుకే ఆమెను కలవలేదంటూ!

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అవుతూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో కనిపించే లవ్ ట్రాకులు, రొమాన్స్‌కు ఇంకాస్త ఎక్కువ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో అలా చేసిన కంటెస్టెంట్లు కూడా ఊహించని రీతిలో పాపులర్ అవుతున్నారు.

అయితే, ఐదో సీజన్‌లో మాత్రం షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వీళ్లు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితిని చూసి షాకయ్యారు. ఈ నేపథ్యంలో షణ్ముఖ్‌కు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పిందని ప్రచారం జరుగుతోంది. దీంతో అతడు తాజాగా స్పందించాడు. ఆ వివరాలు మీకోసం!

టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు

టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు

భారీ అంచనాలతో మొదలైన ఐదో సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం వెబ్ సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అతడికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండడమే.

హౌస్‌లో రొమాన్స్ చేసి షాకిచ్చాడు

హౌస్‌లో రొమాన్స్ చేసి షాకిచ్చాడు

షోలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే స్నేహితులు కావడంతో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశారు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయారు. దీంతో వీళ్లపై విమర్శలు వచ్చాయి.

ఫినాలేలో దెబ్బ... రన్నర్‌గా మిగిలి

ఫినాలేలో దెబ్బ... రన్నర్‌గా మిగిలి

వ్యవహార శైలితో ఎలా ఉన్నా ఆట పరంగా ఆకట్టుకోవడంతో షణ్ముఖ్ జస్వంత్, టాప్‌ 5లో నిలిచి ఫినాలేలో అడుగు పెట్టాడు. దీంతో అతడు గెలుస్తాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఓట్లు కూడా భారీ స్థాయిలో పోలయ్యాయి. అయితే, అతడి కంటే సన్నీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఐదో సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు. దీంతో షణ్ముఖ్ రన్నర్‌గా మిగిలాడు.

షణ్ముఖ్‌కు దీప్తి సునైనా బ్రేకప్ అని

షణ్ముఖ్‌కు దీప్తి సునైనా బ్రేకప్ అని

బిగ్ బాస్ హౌస్‌లో సిరి హన్మంత్‌తో రొమాన్స్ చేయడం వల్ల షణ్ముఖ్ జస్వంత్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. మరీ ముఖ్యంగా అతడు వ్యవహరించిన తీరుపై భారీ స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో అతడిపై ప్రియురాలు దీప్తి సునైనా కూడా గుర్రుగా ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆమె షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ కూడా చెప్పేసిందన్న టాక్ వినిపిస్తోంది.

బ్రేకప్ రూమర్లు.. షణ్ముఖ్ క్లారిటీతో

బ్రేకప్ రూమర్లు.. షణ్ముఖ్ క్లారిటీతో

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే షణ్ముఖ్ జస్వంత్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ నిర్వహించాడు. ఇందులో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించాడు. ఇక ఈ సెషన్‌లో అతడి అభిమానులంతా దీప్తి సునైనా గురించి, బ్రేకప్‌పై వస్తున్న వార్తల గురించి షణ్ముఖ్‌ను ప్రశ్నించాడు. దీంతో దీనిపై అతడు క్లారిటీ ఇచ్చేశాడు.

నన్ను బ్లాక్ చేసింది నిజమేనంటూ

నన్ను బ్లాక్ చేసింది నిజమేనంటూ

దీప్తి గురించి చాలా మంది నెటిజన్లు ప్రశ్నించడంతో షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ.. 'అందరూ దీపు గురించే అడుగుతున్నారు. హౌస్‌లో చాలా రచ్చ జరిగిపోయింది. దీంతో తను ప్రస్తుతం నన్ను బ్లాక్‌ చేసింది. దీంతో త్వరలోనే హైదరాబాద్‌ వెళ్లి తనని కలుస్తా. కోపంగా ఉంది కాబట్టి ఇప్పుడు తనను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే టైమ్ ఇచ్చా' అని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu Season 5 | 18th December 2021 - Promo | ఫైనలిస్ట్ లతో ఓ ఆటాడుకున్న సీనియర్స్
ఇది పోయేంత వరకూ వదలనని

ఇది పోయేంత వరకూ వదలనని

బ్రేకప్ గురించి వస్తున్న వార్తలపై షణ్ముఖ్ జస్వంత్ స్పందిస్తూ.. 'నేను బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో దీపు నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్‌ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్‌ అయితే జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను. మీరు డౌట్లతో మరింత భయపెట్టకండి' అని కోరాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X