Bigg Boss 5 Telugu: వారిద్దరూ కాదు.. మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది టాప్ 2 కంటెస్టెంటా?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరింది. ఈ రోజు జరుగుతున్న వీకెండ్ ఎపిసోడ్ తర్వాత ఫినాలే ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఉండగా ఎక్కువగా సిరి, కాజల్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ టాప్ 2లో ఉన్న కంటెస్టెంట్ ఎలిమింబెట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Photos Courtesy: Star మా and Disney+Hotstar

ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ప్రస్తుతం హౌస్ లో కాజల్, సిరి, షన్నూ, సన్నీ, మానస్ మరియు శ్రీరామ చంద్రలు ఉన్నారు. వీరిలో ఇప్పటికే శ్రీరామ్ కు టికెట్ టు ఫినాలే అవకాశం దక్కింది. కనుక అతడు ఎలిమినేషన్ లో లేడు. కాజల్, సిరి, షన్నూ, సన్నీ, మానస్ లు ఉండగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాజల్ ఎలిమినేట్
అయితే ప్రతి వారం ఆదివారం నాడు ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఆ విషయం శనివారమే లీక్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పటి దాకా ఆ లీక్ గురించి ఎలాంటి సమాచారం లేదు కానీ అందరూ మొదటి నుంచి కాజల్ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. తర్వాత సిరి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా షణ్ముఖ్ జశ్వంత్ పేరు వినిపిస్తోంది.

షణ్ముఖ్ ను ఎలిమినేట్
అయితే నిజానికి ఓట్ల పరంగా షణ్ముఖ్ జశ్వంత్ టాప్ 1, 2 ప్లేసుల్లో కొనసాగుతున్నాడని ముందు నుంచి ప్రాచారం జరుగుతోంది. అలాంటి షణ్ముఖ్ ను ఎందుకు ఎలిమినేట్ చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే రవి ఎలిమినేట్ అయ్యే సమయంలో కూడా ఓటింగ్ లో రవి మూడో స్థానంలో ఉన్నాడని టాక్ వినిపిచగా అతన్ని ఎలిమినేట్ చేసారు.

షన్ను విషయంలో కూడా
ఇప్పుడు కూడా షన్ను విషయంలో బిగ్ బాస్ అదే పని చేయబోతున్నారు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే షణ్ముఖ్ విషయంలో చాలా నెగెటివిటీ మూట కట్టుకున్నాడు. ముఖ్యంగా గత రెండు వారాలుగా అతని ప్రవర్తన న్యూట్రల్ ప్రేక్షకులు కూడా ఏవగించుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే షణ్ముఖ్ ను ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు.

షణ్ముఖ్ బ్రదర్ ఆరోపణలు
దానికి తోడు కొద్దీ రోజుల క్రితం షణ్ముఖ్ బ్రదర్ చేసిన ఆరోపణలు కూడా ఇందుకు ఊతం ఇస్తున్నాయి. షణ్ముఖ్ ను కావాలనే నెగెటివ్ చేస్తున్నారని ఆయన సోదరుడు సంపత్ వినయ్ అంటున్నాడు. ఇంత కాలం సైలంట్ గా ఉన్న వాళ్లు ఇప్పుడు మా వాడికి బిగ్ బాస్ ఏమీ సపోర్ట్ చేయట్లేదు అని అయినా మా సపోర్ట్ మాత్రం తగ్గదనే చెప్పాలి.

టాప్ 5 కి కూడా వెళ్లకుండా
కానీ టైటిల్ విన్నర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన షణ్ముఖ్ టాప్ 5 కి కూడా వెళ్లకుండా ఎలిమినేట్ అవుతాడంటే నమ్మడం కష్టమే. షణ్ముఖ్ ఎలిమినేట్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు కానీ ఖచ్చితంగా అది పుకారు మాత్రమే అని కొందరు అంటున్నారు. సిరి మరియు కాజల్ లో కాజల్ ఎలిమినేట్ అవ్వబోతుంది అని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయనేది చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











