Bigg Boss: షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్.. కలకలం రేపుతోన్న ఇన్‌స్టా స్టోరీలు.. ఇద్దరి మధ్య ఏం జరిగింది?

ఎంతో కాలంగా సాదాసీదాగా సాగిపోతోన్న తెలుగు బుల్లితెరపై సంచలనం అవడంతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఏకైక షో బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమం తెలుగులో మొన్నటితో ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్‌లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అలాగే, టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్ మాత్రం రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. దీంతో అతడి అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో అతడి గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునైనా సోషల్ మీడియాలో చేసిన పోస్టులు కలకలం రేపుతున్నాయి. అదే సమయంలో షన్నూకు ఆమె బ్రేకప్ చెప్పేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలేంటో మీరూ చూడండి!

అందరిలో టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ

అందరిలో టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ

ఎన్నో అంచనాలతో మొదలైన ఐదో సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం వెబ్ సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అతడికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ దక్కడమే.

అలానే ఉంటూ హైలైట్ అయ్యారుగా

అలానే ఉంటూ హైలైట్ అయ్యారుగా


ఇటీవలే ముగిసిన సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన వారిలో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఉన్నారు. వీళ్లిద్దరూ అదిరిపోయే ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలిస్తూ వచ్చారు. జంటగా మారి ఎప్పుడూ కలిసే ఉండడంతో షణ్ముఖ్, సిరి తరచూ విమర్శల పాలయ్యారు. దీంతో బిగ్ బాస్ మొత్తం హైలైట్ అయిపోయారు.

హౌస్‌లో మాత్రం అలాంటి పనులతో

హౌస్‌లో మాత్రం అలాంటి పనులతో

బిగ్ బాస్‌లోకి రావడానికి ముందే స్నేహితులు కావడంతో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ హౌస్‌లో కూడా ఆరంభం నుంచే సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశారు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయారు. దీంతో వీళ్ల రిలేషన్‌పై డౌట్లు వచ్చాయి.

భారీ అంచానాలతో... ఫినాలేలో దెబ్బ

భారీ అంచానాలతో... ఫినాలేలో దెబ్బ

ఫుల్ పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్, టాప్‌ 5లో నిలిచి ఫినాలేలో అడుగు పెట్టడంతో అతడు గెలుస్తాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఓట్లు కూడా భారీ స్థాయిలో పోలయ్యాయి. అయితే, అతడి కంటే సన్నీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో అతడే ఈ సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ మాత్రం రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడతను.

Recommended Video

Bigg Boss Telugu Season 5 | 18th December 2021 - Promo | ఫైనలిస్ట్ లతో ఓ ఆటాడుకున్న సీనియర్స్
ఆమె వల్లే ఓటమి... అలుగుతుందని

ఆమె వల్లే ఓటమి... అలుగుతుందని

ఆమె వల్లే ఓటమి... అలుగుతుందని
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్.. బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో అతడు సిరితో ఉన్న రిలేషన్ వల్లే ఓడిపోయానని నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడు. కానీ, ఆమె తనకు ఫ్రెండ్ మాత్రమేనని చెప్పాడు. ఇక, ఈ విషయంలో తన గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునైనా అలుగుతుందని కూడా వెల్లడించాడు.

కలకలం రేపుతోన్న ఇన్‌స్టా స్టోరీలు

కలకలం రేపుతోన్న ఇన్‌స్టా స్టోరీలు

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు షణ్ముఖ్ జస్వంత్‌కు తెగ సపోర్ట్ చేసిన దీప్తి సునైనా.. అతడి ఓటమి తర్వాత సైలెంట్‌గా ఉండిపోయింది. అంతేకాదు, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో 'నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారినా నా జీవితాన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నా', 'కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు' అంటూ కలకలం రేపేలా స్టోరీలను పెట్టుకుంది.

ఇద్దరికీ బ్రేకప్ అయిపోయిందంటూ

ఇద్దరికీ బ్రేకప్ అయిపోయిందంటూ

దీప్తి సునైనా తన ఇన్‌స్టాలో 'ఈ సంవత్సరం నాకేమీ బాగనిపించలేదు. కానీ చాలా నేర్చుకున్నాను' అని కూడా రాసుకొచ్చింది. దీంతో ఆమె షణ్ముఖ్ జస్వంత్‌పై కోపంతోనే ఇలాంటి పోస్టులు పెడుతుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, వీళ్లిద్దరికీ బ్రేకప్ అయిపోయిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ జంట హాట్ టాపిక్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X