బిగ్ బాస్ 5పై మరో షాకింగ్ రూమర్.. మొదటి కంటెస్టెంట్‌ను ఫిక్స్ చేశారట..

బిగ్ బాస్ సీజన్ 4 నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియేన్స్ ఒక మంచి కిక్కయితే ఇచ్చింది. ఎలిమినెట్ అయినా మొదటి కంటెస్టెంట్ నుంచి చివరి ఫైనలిస్ట్ వరకు అందరూ కూడా వారి స్టైల్ లో క్రేజ్ అయితే అందుకున్నారు. నాలుగవ సీజన్ లో 105రోజుల ప్రయాణాన్ని విజయవంతంగా ముగించారు. ఇప్పుడు సీజన్ 5కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి కంటెస్టెంట్ ఎవరనే విషయంలో కూడా ఓ గాసిప్ వైరల్ గా మారింది.

కాస్తా బోర్ క్కొట్టించినా కూడా..

కాస్తా బోర్ క్కొట్టించినా కూడా..

నిజానికి బిగ్ బాస్ 4షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ సెలక్షన్స్ విషయంలో పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. బిగ్ బాస్ మధ్యలో కూడా కొంత వరకు బోర్ కొట్టిచింది. ఊహించని విధంగా కొన్నిసార్లు సీరియల్స్ కంటే దారుణమైన రేటింగ్స్ ను కూడా అందుకున్నాయి. ఒకసారైతే స్టార్ మా టాప్ ప్రోగ్రామ్ లిస్టులో బిగ్ బాస్ 4, 5వ స్థానానికి పడిపోయింది. ఇక ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో షో మళ్ళీ గాడిలో పడింది.

ఊహించిందే నిజమయ్యింది

ఊహించిందే నిజమయ్యింది

గడిచిన సీజన్స్ విన్నర్ విషయంలో తుది వరకు కూడా సస్పెన్స్ గా నడిచింది. కానీ నాలుగవ సీజన్ లో అందరూ ఉహించినట్లుగానే అభిజిత్ గెలిచేశాడు. షో మొదలైన రెండు నెలలకే అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అని దాదాపు అందరు పసిగట్టేశారు. మిగతా వాళ్ళు చేసిన పొరపాట్లే అతనికి బాగా కలిసొచ్చాయి. అభిజిత్ నిజానికి కొంతమంది మంది పడిన కష్టంలో కొంచెం కూడా పడలేదు. వీలైనంత వరకు పొరపాట్లు చేయకుండా తన గేమ్ తన స్టైల్ లో ఆడుతూ వచ్చాడు.

సీజన్ 5 స్టార్ట్ అయ్యేది ఎప్పుడు?

సీజన్ 5 స్టార్ట్ అయ్యేది ఎప్పుడు?

ఇక సీజన్ 5 కోసం కూడా బిగ్ బాస్ నిర్వాహకులు అప్పుడే ఏర్పాట్లను షురూ చేసినట్లు సమాచారం. ఏప్రిల్ చివరి వారంలో లేక ఆ తరువాత జూన్ మొదటి వారంలో షోను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. సీజన్ 5లో గత సీజన్ కంటే గ్రాండ్ గా నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్స్ గట్టిగానే వేస్తున్నట్లు సమాచారం. హోస్ట్ గా అయితే మళ్ళీ నాగార్జుననే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

సోహెల్ వస్తున్నాడా

సోహెల్ వస్తున్నాడా

ఇక 5వ సీజన్ కోసం కంటెస్టెంట్స్ విషయంలో భారీ స్థాయిలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఇక సీజన్ 5లో సోహెల్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ను ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Recommended Video

KGF Chapter 2 : Yash & Prashant Neel Plans For a Powerful Climax
మొదటి కంటెస్టెంట్ అతడేనా

మొదటి కంటెస్టెంట్ అతడేనా

బిగ్ బాస్ 5 రూమర్స్ స్టార్ట్ కాబోతోంది అంటూ రూమర్స్ రావడమే కాకుండా కంటెస్టెంట్ లిస్ట్ పై కూడా ఊహాగానాలు రావడం మరో షాకింగ్ న్యూస్. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' తో పాటు అంతకుముందు యూ ట్యూబ్ కంటెంట్ తో ఎంతగానో క్రేజ్ అందుకున్న షణ్ముక్ సీజన్ 5 మొదటి కంటెస్టెంట్ అంటూ పుకార్లు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజుకు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X