Bigg Boss 5 finale: అందరూ ఊహించినట్లే ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్.. పుష్ప టీమ్ రచ్చతో ఇంట్రెస్టింగ్ టాస్క్
బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో ఎవరికి వారు టైటిల్ విన్నర్ గా నిలుస్తామని నమ్మకం గా కనిపించారు. విజె సన్నీ, మానస్, శ్రీ రామచంద్ర, సిరి, షణ్ముఖ్ టాప్ ఫైవ్ లో కి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు అనే విషయంలో ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వెలువడుతున్నాయి. దాదాపు టైటిల్ విన్నర్ పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ కోసం నాగార్జున మరొక ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, రష్మీక మందన్న టాప్ 5లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ను స్టేజ్ పైకి తీసుకు వచ్చారు.

హృదయం ఎక్కడ ఉంది..
మొదట హృదయం ఎక్కడ ఉన్నది అని టాస్క్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా లవ్ సింబల్ ని తీసుకొని వారికి ఇష్టమైన ప్రదేశాల గురించి చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు చేసిన ప్రయాణం లో ఎవరికి ఏ చోటు ఎక్కువగా నచ్చింది అని ఎందుకు అంతగా ఇష్టం అనే కారణం కూడా చెప్పాల్సి ఉంటుంది అని ఇక హార్ట్ సింబల్ తీసుకువెళ్లే వారికి నచ్చిన బిగ్ బాస్ హౌస్ ప్రదేశంలో పెట్టాల్సి ఉంటుంది.

హౌస్ లో దేవి రష్మీక రచ్చ
ఆ తర్వాత టాస్క్ లో ప్రత్యేకంగా బిగ్ బాస్ హౌస్ లో అందరిని పలు రకాల ప్రశ్నలు అడిగారు. పుష్ప ప్రమోషన్లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ రష్మిక మందన్న చాలా సందడిగా కనిపించారు. పుష్ప గురించి మాట్లాడిన నాగార్జున సుకుమార్ ను బయటకు పంపించేసి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ను అలాగే రష్మిక మందన హౌస్ లోపలికి పంపించారు. అందరిని పలు రకాల ప్రశ్నలను కూడా అడిగారు.

డ్రోన్స్ తో ఎలిమినేట్..
ప్రస్తుతం టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అయితే వారిని మీరు ఆనందంగా బయటకు తీసుకురావాలి అని దేవిశ్రీప్రసాద్ రష్మిక మందన కు నాగార్జున వివరణ ఇచ్చారు. ఇక దేవిశ్రీప్రసాద్ జరగబోయే ప్రక్రియ గురించి కూడా తెలియజేశారు. ప్రత్యేకంగా ఐదు ఫొటోలు ఉన్న డ్రోన్స్ వస్తాయని అయితే వాటిలో ఒకటి హౌస్ నుంచి బయటకు వెళ్లి పోతుంది అని.. ఇక హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయినవారి దానికి ఉంటుందని అన్నారు.

సిరి ఏలిమినేట్..
అందరూ ఊహించినట్లుగానే సిరి ఎలిమినేట్ అయింది. ఇక ఆమె వెళ్ళిపోయేటప్పుడు దేవిశ్రీప్రసాద్ రష్మిక మందన కూడా పుష్ప సినిమాలోని స్వామి స్వామి అనే సాంగ్ ద్వారా బయటకు తీసుకువచ్చారు. సిరి ఏమాత్రం బాధ పడకుండా అందరిని సరదాగా పలకరిస్తూ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అలాగే రష్మికతో కూడా స్వామి స్వామి అనే డ్యాన్స్ చేసింది. ఆ తరువాత ఆమె అందరి గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ 5 తనకు ఎంతగానో నేర్పించింది అని చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.

విన్నర్ అతడే..
బిగ్ బాస్ హౌస్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఫైనల్ విన్నర్ సన్నీ అని ఇప్పటికే బయట జనాలు మాట్లాడుకుంటున్నారు. సన్నీ గెలుస్తాడు అని కూడా చెబుతున్నారు. అందరికంటే ఎక్కువగా సన్నీ అత్యధిక ఓట్లతో బిగ్ బాస్ టైటిల్ ను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











