twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss 5: సన్నీని మళ్ళీ రెచ్చగొడుతున్న ప్రియ.. షన్నుని కాదని సైడ్ చేంజ్ చేసిన సిరి!

    |

    బిగ్ బాస్ ప్రతి వారం కూడా కెప్టెన్సీ టాస్క్ విషయంలో సరికొత్త గేమ్ ను తీసుకొస్తున్నారు. ఇక ఈ సారి బంగారు కోడిపెట్ట అనే గేమ్ కూడా చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మళ్ళీ మరోసారి సన్నీ వర్సెస్ ప్రియా అనేలా గేమ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సిరి కూడా మళ్లీ సైడ్ చేంజ్ చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె చాలా క్లోజ్ గా షన్నుతో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సడన్ గా ఆమె పార్టీ చేంజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ చాలా అప్సెట్ అయినట్లుగా అర్థం అవుతోంది. ఈ వారం ఆ విషయంలో కూడా అనేక రకాల మార్పులు జరగబోతున్నట్లు క్లారిటీ వస్తోంది.

    Recommended Video

    Bigg Boss Telugu 5: షన్నుతో కాకుండా శ్రీరామ్‌ తో సిరి | VJ Sunny VS Priya వెకిలినవ్వుతో
    మానస్ నెత్తిపై గుడ్డు

    మానస్ నెత్తిపై గుడ్డు


    కెప్టెన్ టాస్క్ లో భాగంగా బంగారు కోడిపెట్ట దగ్గరనుంచి గుడ్లను సేకరించాల్సి ఉంటుంది. ఇక యాంకర్ రవి మేడం ఒక రెండు గుడ్లు ఇవ్వండి అంటూ చాలా సరదాగా అడుగుతూ కనిపించాడు. ఇక మరొకటి సడన్ గా ఆకాశం నుంచి మానస్ నెత్తిపై పడింది. దాన్ని చాలామంది పట్టుకోడానికి ప్రయత్నం చేశారు. గుడ్లను దొంగతనం చేసే ప్రక్రియ కూడా ఈ కేసులో హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది.

    నా జోలికి వస్తే వదిలిపెట్టను

    నా జోలికి వస్తే వదిలిపెట్టను

    ఎవరైనా నా జోలికి వస్తే వదిలిపెట్టను అని సన్నీ తనలో తాను అనుకుంటూ ఉండగా నేను మాత్రం అందరి జోలికి వస్తాను అంటూ ప్రియ మరో వైపు నుంచి కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అని హెచ్చరిక కూడా చేసింది. నా జోలికి వస్తే ఊరుకోను అని చెప్పాను కదా చేతకాని వారిలాగా ఆడకు అని ఆడకు అనడంతో ఇక గత వారం వివాదాన్ని గుర్తుచేస్తూ బొమ్మలు దొంగతనం చేసి నేను తియ్యలే అని కొందరు అంటారు. అది చేతకాని ఆట అని ప్రియ మరింత రెచ్చగొట్టింది.

    ప్రియ vs సన్నీ

    తప్పకుండా విశ్వారూపం వస్తుంది. తప్పకుండా దాన్ని చూపిస్తాను అని సన్నీ మళ్ళీ కౌంటర్ ఇవ్వడంతో ఇలాంటివి చాలా చూశాను అంటూ ప్రియా కామెడీగా చెప్పింది. అంతే కాకుండా తన వెకిలినవ్వుతో సన్నీని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇక మానస్ కూడా చివరికి ప్రియ దగ్గరకు వెళ్లి గుడ్లను షేర్ చేసుకుంటూ ఉండడం సన్నీకి ఏమాత్రం నచ్చలేదు. నేను చాలా ట్రస్ట్ చేశాను అని అన్నాడు. ఇక వాళ్లకు రేపు ఉంటది చూడు అని సన్నీ హెచ్చరిక చేశాడు.

     షన్నుతో కాకుండా మరొక వ్యక్తితో సిరి..

    షన్నుతో కాకుండా మరొక వ్యక్తితో సిరి..

    ఇక్కడ ఆట మధ్యలో సిరి ఒక్కసారిగా సైడ్ చేంజ్ చేసినట్లు అనిపించింది. ఆమె శ్రీరామ్ తో కాస్త రొమాంటిక్ యాంగిల్ లో కూడా వెళుతున్నట్లు అనిపిస్తుంది. దీంతో మరోసారి వీళ్లిద్దరు మళ్లీ మొదలు పెట్టారు అని జెస్సితో తో షన్ను చెప్పాడు. ఇక ఇది ఎప్పటినుంచి అని జెస్సి కూడా షాక్ అయ్యాడు. దీంతో మరి ఎందుకు ఇక్కడ చిరాకుతో ఉన్నాను అని వివరణ ఇచ్చాడు. ఇక చివరికి మళ్లీ మాట్లాడేందుకు వచ్చిన సిరి ఏంటి అని ప్రశ్నించింది. నీకు అలా అనిపిస్తే అది నా తప్పా అని వివరణ ఇచ్చింది. కానీ నేను చాలా మందిని చూశాను కదా అని చెప్పిన షన్ను నాకు అలా అనిపిస్తుంది అని మరో ఆన్సర్ ఇచ్చాడు. మరి వీరి బంధం ఏ విధంగా యు టర్న్ తీసుకుంటుందో చూడాలి.

    English summary
    Bigg boss 5 telugu sunny vs priya cold war and siri side change,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X