Bigg Boss Telugu 10th Week Nominations బిగ్‌బాస్‌లో తొలిసారి నలుగురికి జైలుశిక్ష.. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో పదోవారంలోకి ప్రవేశించింది. ఇక ఆట ఫార్మాట్ ప్రకారం సోమవారం నామినేషన్ ప్రక్రియ జరుగుతుందనే విషయం తెలిసిందే. అయితే పదో వారం ఎలిమినేషన్ కోసం ఇంటిలో నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ నిర్వహించగా.. ఎప్పటి మాదిరిగానే గొడవల మధ్య నామినేషన్ ప్రక్రియ ముగిసినట్టు తెలుస్తున్నది. ఇంతకు పదోవారం నామినేషన్స్‌లోకి ఎవరెవరు వచ్చారంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

బిగ్‌‌బాస్ తెలుగు 5 ఎలిమినేటెడ్ లిస్ట్

బిగ్‌‌బాస్ తెలుగు 5 ఎలిమినేటెడ్ లిస్ట్

బిగ్‌‌బాస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మంది ఇంటి నుంచి బయటకు వెళ్లారు. మొదటి వారం నుంచి ఇప్పటి వరకు సరయు రాయ్, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిలో అత్యధికంగా మహిళలే కావడం గమనార్హం.

విశ్వ ఎలిమినేషన్ షాకింగ్‌గా

విశ్వ ఎలిమినేషన్ షాకింగ్‌గా

బిగ్‌బాస్‌లో తొమ్మిదో వారం ఇంటి నుంచి విశ్వ నుంచి వెళ్లిపోవడం అభిమానులకు షాకింగ్‌గా మారింది. ఇంటిలో జరిగిన టాస్కుల్లో, ఇంటికి సంబంధించిన పనుల్లో చురుకుగా కనిపించే విశ్వ ఎలిమినేట్ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే విశ్వ ఎలిమినేట్ కావడం జీర్ణించుకోలేకపోయిన అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తక్కువ ఓట్లు వచ్చిన సిరిని కాపాడేందుకు విశ్వను బలిచేశారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 నలుగురిని జైల్లో పెట్టిన అనీ మాస్టర్

నలుగురిని జైల్లో పెట్టిన అనీ మాస్టర్

ఇక నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టిన బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు షాకిచ్చారు. కెప్టెన్ అనీ మాస్టర్‌కు సంపూర్ణ అధికారాలు ఇస్తూ... నలుగురిని ఎంచుకొని ఒకరి తర్వాత మరొకరిని జైలులోకి పంపించాలని సూచించాడు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు కాజల్, వీజే సన్నీ, మానస్, షణ్ముఖ్ జస్వంత్‌ను అనీ మాస్టర్ జైల్లో పెట్టింది.

కెప్టెన్ అనీ మాస్టర్ ఇంటి సభ్యులపై ఘాటుగా

కెప్టెన్ అనీ మాస్టర్ ఇంటి సభ్యులపై ఘాటుగా

నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కెప్టెన్ అనీ మాస్టర్ ఘాటుగా స్పందించింది. ఒకరి క్యారెక్టర్ ఆధారంగా చేసుకొని ఓటు వేయను. నా వద్ద స్ట్రేయిట్ పాయింట్ లేదు. కానీ నేను ఒకరిని నామినేట్ చేయాలి. పక్షపాతంగా వ్యవహరించి నేను ఎవరిని నామినేట్ చేయలేదు. టాస్కుల పరంగా నీ విషయంలో క్లారిటీ లేదు అంటూ అనీ మాస్టర్ చెప్పింది. దీంతో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య ఘాటుగా వాదనలు జరిగాయని తెలుస్తున్నది.

Recommended Video

Hero Sudheer Babu Interaction With His Lady Fan
 10వ వారం నామినేట్ అయింది వీరే..

10వ వారం నామినేట్ అయింది వీరే..

ఇక తాజా సమాచారం ప్రకారం.. 10వ వారానికి సంబంధించి నామినేట్ అయిన వారి జాబితా ఇలా ఉంది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న ఇంటి సభ్యుల్లో ఆర్జే కాజల్, సిరి హన్మంతు, యాంకర్ రవి, వీజే సన్నీ, మానస్ ఉన్నారు. దీంతో ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తిగా మారింది. టాప్ కంటెస్టెంట్లలో ఎవరిపై ఎలిమినేషన్ వేటు పడుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X