Bigg Boss 5 Telugu: మరో షాకింగ్ ఎలిమినేషన్..మొన్న రవి కాగా, ఇప్పుడు ఆ పాపులర్ కంటెస్టెంట్ !
బిగ్ బాస్ తెలుగు మేకర్స్ ఈ వారం హౌస్ నుంచి మరో షాకింగ్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు 5 నుంచి ఇంతకు ముందు ఎలిమినేషన్ అయిన యాంకర్ రవి గురించి జరిగిన విషయాలు మరువక ముందే మరో షాకింగ్ ఎలిమినేషన్ ప్లాన్ చేసారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

వేడి నీళ్లు
బిగ్ బాస్ దాదాపు చివరి దశకు చేరింది. ఎవరు ఫైనల్ కి వెళ్తారు అనే విషయం మీద బిగ్ బాస్ లో టాస్కులు పెడుతున్నారు. అయితే ఈ టాస్క్ వల్ల శ్రీరామచంద్ర గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. టాస్క్ లో ఐస్ వాటర్ లో కాళ్ళు పెట్టడం వల్ల అందరికీ కాళ్ళు అన్ని తిమ్మిరి ఎక్కి పోయాయి. ఐస్ వాటర్ నుంచి బయటకు రాగానే వేడి నీళ్లు పోయడం హానికరమని ముందే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినా వినలేదు.

కాళ్ళు బాగా తిమ్మిరెక్కి
అయితే శ్రీరామ్ ఎక్కువ సేపు ఐస్ వాటర్ లో ఉండటంతో కాళ్ళు బాగా తిమ్మిరెక్కుతాయి. దీంతో రాత్రి నిద్ర పోకుండా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న సమయంలో ప్రియాంక బాధ పడి శ్రీరామ్ కాళ్లకు అర్ధరాత్రి జండూబామ్ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్ చేసింది. దీంతో అతని కాళ్ళు వాచి నొప్పి మరింత ఎక్కువైంది. వెంటనే శ్రీరామ్‌ను మెడికల్ రూమ్‌లోకి పిలిచి మందులు రాసిచ్చారు.

శ్రీరామ చంద్ర గాయపడి
అయితే యాంకర్ రవి షాకింగ్ ఎలిమినేషన్ మరువక ముందే బిగ్ బాస్ మేకర్స్ మరో షాకింగ్ ఎలిమినేషన్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. పాపులర్ కంటెస్టెంట్ శ్రీరామ చంద్రను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ మేకర్స్ యోచిస్తున్నట్లు సమాచారం. అవును, మీరు చదివింది నిజమే. ఫైనల్ టాస్క్‌లో శ్రీరామ చంద్ర గాయపడిన సంగతి తెలిసిందే. అందరూ బిగ్ బాస్ చెప్పినట్టు చేస్తే ఆయన ఒక్కడే వేరేవాళ్లు చెప్పిన మాటలు విని తొందర పడ్డారు.

మద్దతు
దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక అభిమానులు, ప్రేక్షకులే కాకుండా శ్రీరామచంద్ర త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కొందరు సెలబ్రెటీలు కూడా శ్రీరామ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. షణ్ముఖ్ జశ్వంత్ ప్రియురాలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునయన శ్రీరామ్‌కు సపోర్ట్ గా తన సోషల్ మీడియాలో 'మోర్ పవర్ టూ యూ' అంటూ శ్రీరామ్‌కు మద్దతు ప్రకటించింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రియ, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అఖిల్ సార్థక్, దేత్తడి హారికా, నోయల్ కూడా గెట్ వెల్ సూన్ అంటూ శ్రీరామ్ కు మద్దతు ఇస్తున్నారు.
Recommended Video

రెండో షాకింగ్ ఎలిమినేషన్
ఇక వైద్యం నిమిత్తం శ్రీరామ చంద్రని ఇంటికి పంపించే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్లు తాజా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారు ఈ వారాంతంలో అతనిని ఎలిమినేట్ చేయవచ్చు అని భావిస్తున్నారు. శ్రీ రామ్ చంద్ర నిజంగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేయబడితే, అది బిగ్ బాస్ తెలుగు 5 మేకర్స్ నుంచి రెండో షాకింగ్ ఎలిమినేషన్ అవుతుంది. అయితే దీనికి మేకర్స్ నుంచి ఎలాంటి ధృవీకరణ లేదు. ఈ వారం శ్రీ రామ్ చంద్ర ఎలిమినేషన్‌కు అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











