Bigg Boss Unseen మానస్‌పై ముద్దులు కురిపించిన ప్రియాంక.. నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ అంటూ..

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో కొనసాగుతున్న లవ్ స్టోరీలలో మానస్, ప్రియాంక కెమిస్ట్రీ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. వన్ సైడ్ లవ్‌ మాదిరిగా కొనసాగుతున్న ఈ ప్రేమ్ కహానీలో పింకి ఎమోషన్స్ గమ్మత్తుగా బుల్లితెర మీద ప్రొజెక్ట్ అవుతుంటాయి. మానస్ దూరం పెట్టినా తననపై ఉండే ప్రేమ, అప్యాయతలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. తాజా బిగ్‌బాస్‌లో మానస్, ప్రియాంక మధ్య జరిగిన సన్నివేశాలు ఎలా ఉన్నాయంటే...

నా కోసం నీవు చేస్తావనే నమ్మకం అంటూ మానస్

నా కోసం నీవు చేస్తావనే నమ్మకం అంటూ మానస్

బిగ్‌బాస్ ఇంటిలో కెప్టెన్‌గా కొనసాగుతున్న మానస్‌ తన టీమ్‌కు సూచనలు ఇస్తూ ఇంటి వ్యవహారాలను ఎలా నడిపించాలనే విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా లంచ్ కోసం భోజనం పనులను పింకి చేస్తుందని ఆమెను అడగకుండానే మానస్ డిసైడ్ చేశాడు. అయితే తనను అడగకుండా ఎలా చెప్పావు అంటే.. నా కోసం చేస్తావనే నమ్మకం ఉంటుందనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకొన్నానని మానస్ చెప్పాడు.

 మానస్‌కు కౌగిలింత.. ముద్దులతో ప్రియాంక

మానస్‌కు కౌగిలింత.. ముద్దులతో ప్రియాంక

బిగ్‌బాస్‌లోకి వచ్చినప్పటి నుంచి నేను కెప్టెన్ కావాలని ఒకరు బలంగా కోరుకొంటున్నారు. వాళ్ల కోసం నేను చిన్న గిఫ్టు ఇవ్వాలని కోరుకొంటున్నాను అని జేబులో నుంచి బ్లూ కలర్‌లో ఉన్న పువ్వును తీశాడు. ప్రియాంకకు ఇచ్చేందుకు సిద్దం కావడంతో మానస్ వద్దకు వెళ్లింది. ప్రియాంక మైక్ బెల్ట్‌కు పువ్వును మానస్ పిన్ చేశాడు. ఆ తర్వాత మానస్ బెల్ట్‌కు ప్రియాంక కూడా ఓ పువ్వును పిన్ చేసింది. ఆ తర్వాత మానస్‌ను గట్టిగా కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించింది. నుదుటిపై ముద్దు పెట్టుకోగా.. లిప్ లాక్ జస్ట్ మిస్ అంటూ ఇంటి సభ్యులు టీజింగ్ చేశారు.

నీవు అలా ట్రీట్ చేస్తున్నావా? అంటూ

నీవు అలా ట్రీట్ చేస్తున్నావా? అంటూ

ఇదిలా ఉంటే.. ఎప్పటి మాదిరిగానే తమ రిలేషన్ విషయంలో ప్రియాంక, మానస్ మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్ తర్వాత ముభావంగా ప్రియాంక ఉండటంతో మానస్ ఎందుకు అలా ఉన్నావని అడిగితే.. ఈ పరిస్థితుల్లో నేను మాట్లాడవచ్చో లేదో తెలియదు కానీ.. నేను మాట్లాడితే కాస్త నా మూడ్ రిలాక్స్‌గా ఉంటుందనుకొంటున్నాను. నిజంగా నువ్వు నన్ను ఫ్రెండ్‌గా ట్రీట్ చేస్తున్నావా? అని ప్రియాంక అడిగింది.

నువ్వు నన్ను అలా ఎందుకు చూశావంటూ

నువ్వు నన్ను అలా ఎందుకు చూశావంటూ

అయితే మానస్ మాటలకు ముభావంగా ఉండిపోయింది. దాంతో నీకు ఎందుకలా అనిపించింది? నీవు టాస్క్ సమయంలో ఎందుకు అలా చూశావు అని మానస్ అడిగితే.. నీవు నాకు సపోర్ట్ చేస్తావా లేదా అనే అనుమానంతో నేను అలా చూశాను అని పింకి చెప్పింది. అయితే నేను ఏదో ధ్యాసలో ఉండి అలా చూశాను అని చెప్పింది. అయితే నీవు అలా చూడటంతోనే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ మానస్ క్లారిటీ ఇచ్చారు.

 వీజే సన్నీపై మానస్ కోపంగా

వీజే సన్నీపై మానస్ కోపంగా

ఇలా హాట్ హాట్‌గా మాట్లాడుతుంటే.. మధ్యలో వీజే సన్నీ వచ్చాడు. దాంతో ఐదు నిమిషాలు ఆగు.. మాట్లాడుకొంటున్నాం అని అంటే.. వీజే సన్నీ ఇరిటేట్ చేయడంతో నువ్వు వెళ్లకపోతే నేను వెళ్లిపోతాను అంటూ మానస్ లేచాడు. దాంతో వీజే సన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఎందుకు సన్నీ మీద కోపగించుకొంటావు? అని ప్రియాంక అంటే.. నువ్వెవరు ఆ విషయం చెప్పడానికి అంటూ మానస్ గరం అయ్యాడు.

 పాము చావకుండా.. కర్ర విరగకుండా అంటూ

పాము చావకుండా.. కర్ర విరగకుండా అంటూ

బిగ్‌బాస్‌లో మొదటి రోజు నుంచి నీతో ఎలా ఉన్నానో.. ఇప్పటికీ అలానే ఉంటూ, ఆ విధంగానే మాట్లాడుతున్నాను. నువ్వే అలా లేవు అని మానస్ అంటే.. నేను ఎలా ఉన్నాను అని ప్రియాంక అడిగింది. దాంతో నువ్వు కర్ర విరగకుండా.. పాము చావకుండా ఉంటున్నావు. నా నుంచి ఏం ఆశిస్తున్నావో సరిగా చెప్పు అని మానస్ ఇరిటేట్ అయ్యాడు. నేను నీతో భోజనం చేస్తుంటే ఎవరు దగ్గరకు రావడం లేదు అని మానస్ అంటే.. అది నా తప్పా అంటూ ప్రియాంక గట్టిగా అరిచింది. అయితే నీవు చూసే చూపు.. ప్రవర్తించే తీరు.. వడ్డించే విధానం అలా ఉంటాయి అని మానస్ చెప్పాడు.

 నేనంటే ఎందుకంత ఇష్టం అని మానస్

నేనంటే ఎందుకంత ఇష్టం అని మానస్

దాంతో మానస్ మాటలతో ప్రియాంక బాధపడుతూ ఏడ్చేసింది. నువ్వు అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నీపైన నాకు పొసెసివ్‌నెస్ అంటూ బాధలో మునిగిపోయింది. ఆ తర్వాత ప్రియాంకను ఓదార్చుతూ.. నేనంటే అంత ఇష్టం ఎందుకు పింకి.. అని మానస్ అడిగాడు. దాంతో నువ్వంటే ఇష్టం అంతే అంటూ సమాధానం చెప్పింది.

మొదటిసారి నిన్ను చూసినప్పటి నుంచి

మొదటిసారి నిన్ను చూసినప్పటి నుంచి


మానస్‌తో తన మనసులో ఉన్న విషయాన్ని బయటపెడుతూ.. మొదటిసారి నిన్ను చూసినప్పటి నుంచి ఏదో పాజిటివ్‌గా అనిపిస్తుంటుంది. అది కరెక్ట్ కాదని నాకు తెలుసు. అది నీకు అర్ధం అవుతుందని అనుకొన్నా. అందుకే చెబతున్నాను ఒక ఫ్రెండ్ మాదిరిగానే అంటూ ముభావంగా తన మనసులోని మాటచెప్పింది.

Recommended Video

'Father Knows Who The Father Is' - TMC MP Nusrat Jahan || Filmibeat Telugu
 ప్రియాంక, మానస్‌పై వీజే సన్నీ సెటైర్లు

ప్రియాంక, మానస్‌పై వీజే సన్నీ సెటైర్లు

ఇలా మానస్, ప్రియాంక మధ్యలో గరంగరంగా మాటలు కొనసాగుతుంటే.. వీజే సన్నీ వాటర్ బాటిల్‌ పట్టుకొని మధ్యలోకి వచ్చాడు. మానస్‌కు వాటర్ బాటిల్ ఇచ్చి.. ప్రియాంకను చూస్తూ.. మాట రాని మౌనమిదీ.. మౌనవీణ రాగమిది.. అంటూ తనదైన శైలిలో సన్నీ పాట పాడుకొంటూ వెళ్లిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X