twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss: సన్నీని బుక్ చేసిన ప్రియ ఫ్యాన్స్.. గొడవ జరగడానికి అతడే కారణం.. ఆ ఫొటోలు బయట పెట్టడంతో!

    |

    బుల్లితెరపై కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుని సూపర్ డూపర్ హిట్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు తీసుకు రావడంతో పాటు ఫైటింగ్స్, గొడవలు, రొమాన్స్, ప్రేమ కహానీలు ఇలా రకరకాల ఆసక్తికరమైన సంఘటనలను చూపిస్తూ షోను మరింత రంజుగా నడిపిస్తున్నారు నిర్వహకులు.

    దీంతో ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఇందులో ప్రియ, సన్నీ మధ్య జరిగిన గొడవ హైలైట్ అయింది. దీంతో షోకు రేటింగ్ రావడంతో పాటు ఆ ఇద్దరు కంటెస్టెంట్లపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తప్పు సన్నీదే అంటూ ప్రియ ఫ్యాన్స్ కొన్ని ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఆ సంగతులు మీకోసం!

    గతంలో కంటే ఎక్కువ గొడవలతో

    గతంలో కంటే ఎక్కువ గొడవలతో

    ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లను పూర్త చేసుకుంది. అన్నింట్లోనూ కంటెస్టెంట్ల మధ్య ఫైటింగులు బాగానే కనిపించాయి. అయితే, ఈ సీజన్‌లో మాత్రం అవి కాస్త ఎక్కువగా జరుగుతున్నాయి. ఆరంభ వారంలో జరిగిన నామినేషన్స్ టాస్కు నుంచి మొదలుకొని తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. నిన్న మొన్నటి వరకూ ఇదే కంటిన్యూ అవుతూ వస్తోంది.

    అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

    నామినేషన్స్‌ నుంచి టాస్క్ వరకు

    నామినేషన్స్‌ నుంచి టాస్క్ వరకు

    ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ రచ్చగానే సాగింది. ఇందులో హంటర్‌గా ఉన్న సన్నీ.. ప్రియ మీద ఉన్న కోపంతో రవిని నామినేట్ చేయడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. అప్పుడు వీళ్లకు గొడవ జరిగింది. ఇక, ఇదే టాస్కులోనూ కనిపించింది. మరీ ముఖ్యంగా హౌస్‌లో సన్నీ వర్సెస్ ప్రియ అన్నట్లుగా గ్రూపులు కూడా ఏర్పడ్డట్లు కనిపిస్తోంది

    ఆరంభం నుంచీ... కొనసాగిస్తూనే

    ఆరంభం నుంచీ... కొనసాగిస్తూనే

    ఐదో సీజన్ మొదలైనప్పటి నుంచే ప్రియ, సన్నీ మధ్య ఏదో రకమైన గొడవ జరుగుతూనే ఉంది. దీంతో ఇద్దరూ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫలితంగా విభేదాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే 'బంగారు కోడిపెట్ట' టాస్కులో సన్నీ గుడ్లను ప్రియ దొంగిలిచింది. దీంతో వీళ్లిద్దరి మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కూడా నడిచింది.

    Bigg Boss: బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి.. టాప్‌ 5లో ఉండే కంటెస్టెంట్లు ఎవరో చెప్పేశాడుగా!Bigg Boss: బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి.. టాప్‌ 5లో ఉండే కంటెస్టెంట్లు ఎవరో చెప్పేశాడుగా!

    మళ్లీ టాస్కులో రచ్చ.. అలా స్టార్ట్

    మళ్లీ టాస్కులో రచ్చ.. అలా స్టార్ట్

    ఈ వారం 'బంగారు కోడిపెట్ట' టాస్క్ జరుగుతున్నంత సేపు ప్రియ తన నోటికి పని చెబుతూనే ఉంది. 'నేను గుడ్డు పట్టుకోను.. కానీ, ఎవరివైనా దొంగతనం చేస్తాను' అంటూ ముందే చెప్పిన ఆమె.. సన్నీని బాగా టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే అతడిని రెచ్చగొట్టేలా మాట్లాడింది. దీంతో అతడు పలుమార్లు ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో వీళ్ల గొడవ మళ్లీ మొదలైంది.

    చెంప పగలకొడతా.. దమ్ముందా?

    చెంప పగలకొడతా.. దమ్ముందా?

    బుధవారం రాత్రి ప్రసారం అయిన ఎపిసోడ్‌లో సన్నీ, ప్రియ మధ్య గొడవ ఓ రేంజ్‌లో జరిగింది. ఇందులో ప్రియ దగ్గరకు వచ్చిన సన్నీ చైర్‌కు తగలడంతో ఆమె కింద పడిపోయింది. దీంతో సన్నీపై 'ఫిజికల్ అవుతున్నావు ఏంటి? చెంప పగిలిపోతుంది' అంటూ ఫైర్ అయింది. అప్పుడు అతడు కూడా ఆమెకు వేలు చూపిస్తూ దూసుకెళ్లాడు. దీంతో యుద్ధ వాతావరణం కనిపించింది.

    మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురుమితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

    సన్నీని బుక్ చేసిన ప్రియ ఫ్యాన్స్

    సన్నీని బుక్ చేసిన ప్రియ ఫ్యాన్స్

    సన్నీ వర్సెస్ ప్రియ గొడవ తర్వాత దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇందులో ఎవరిది తప్పు అన్న దానిపై పలువురు పలు రకాలుగా స్పందించారు. మొత్తనికి ఇందులో ప్రియదే తప్పు అంటూ చాలా మంది వ్యాఖ్యానించారు. ఆమె రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగిందని, అయినా సన్నీ కామ్‌గా ఉన్నాడని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రియ ఫ్యాన్స్ సన్నీని అడ్డంగా బుక్ చేసేశారు.

    Recommended Video

    Santosh Sobhan Vs Director Maruthi Truth Or Dare | Manchi Rojulochaie
    ఆ ఫొటోలు వదిలి నిజం చెప్పారు

    ఆ ఫొటోలు వదిలి నిజం చెప్పారు

    ప్రియ అభిమానులు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేస్తున్నారు. అందులో సన్నీ ముందుగా ఆమె కాలును తొక్కినట్లు కనిపిస్తుంది. అలా ఆమెను హర్ట్ చేయడం వల్లే అంతలా రియాక్ట్ అయిందని వాళ్లు చెబుతున్నారు. ఈ విషయం తెలియని వాళ్లంతా ప్రియను తప్పుబడుతున్నారని పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సన్నీ పొరపాటు వల్లే గొడవ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది.

    English summary
    Bigg Boss 5th Season Running Successfully. In Recent Episode.. Priya and VJ Sunny Fighted in The Task. Now Priya Fans Troll Sunny with Photos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X