Bigg Boss Voting Result: ఐదో రోజు మారిన ఓటింగ్.. సన్నీ, షన్నూకు బిగ్ షాక్.. టాప్‌లో ఎవరు ఉన్నారంటే!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా మొదలై.. చాలా తక్కువ టైంలోనే ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్‌ను అందుకుంది బిగ్ బాస్. చాలా ఏళ్ల క్రితమే వచ్చిన ఈ కార్యక్రమం.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే పరిచయమైంది. అప్పటి నుంచి హవాను చూపిస్తూ వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదోది కూడా చివరి దశకు చేరుకుంది.

మరో రెండు రోజుల్లోనే ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిపోనుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ టైటిల్‌ను ఎవరు ముద్దాడబోతున్నారు అన్న దానిపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం ఆరంభం నుంచీ ఒకే కంటెస్టెంట్ టాప్‌లో కొనసాగుతున్నట్లు తెలిసింది. అయితే, ఐదో రోజు మాత్రం ఓటింగ్ మారిపోయిందట. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

 19 మందిలో 14 మంది ఎలిమినేట్

19 మందిలో 14 మంది ఎలిమినేట్

గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా జరుగుతోన్న సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఒకేసారి వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారం ప్రియాంక సింగ్‌, పద్నాలుగో వారం కాజల్‌లు ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారం అనారోగ్యంతో వెళ్లిపోయాడు.

టాప్-5కు చేరుకున్న కంటెస్టెంట్లు

టాప్-5కు చేరుకున్న కంటెస్టెంట్లు

ఎన్నో అంచనాల నడుమ మొదలైన ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఒకేసారి అడుగు పెట్టారు. ఇందులో చాలా మంది టైటిల్ ఫేవరెట్లు ఉన్నారు. కానీ, వాళ్లలో చాలా మంది మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఈ సీజన్‌లో మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఫినాలేకు చేరుకున్నారు. వీళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కావడంతో.. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీళ్ల ఐదుగురి మధ్య పోరు ఆసక్తికరంగా సాగబోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వీళ్ల పేర్లే మారుమ్రోగిపోతున్నాయి.

ఇద్దరి మధ్యే టైటిల్ ఫైట్ అంటూ

ఇద్దరి మధ్యే టైటిల్ ఫైట్ అంటూ

ఐదో సీజన్‌లోకి వచ్చిన టైటిల్ ఫేవరెట్లలో షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. బయట భారీ ఫాలోయింగ్ ఉన్న అతడు బిగ్ బాస్ విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపించింది. అదే సమయంలో వీజే సన్నీ తనదైన ఆటతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఫలితంగా అతడు కూడా క్రమంగా రాటుదేలాడు. దీంతో టాప్ 5లో ఉన్న అందరిలోనూ వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ మధ్యనే టైటిల్ పోటీ ఉంటుందన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరికి మాత్రమే ఆరంభం నుంచే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

మొదటి నుంచీ టాప్‌లో ఉన్నాడు

మొదటి నుంచీ టాప్‌లో ఉన్నాడు

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఫినాలేకు చేరుకున్న మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఎవరికి వారే తమ సత్తాను నిరూపించుకుని ఇక్కడి వరకూ వచ్చారు. వీళ్లలో ఎవరు గెలిచినా ఫెయిర్‌గానే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఆదివారం రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవడంతో బుల్లితెర ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకుంటున్నారు. ఇక, ఈ వారం మొదటి రోజు నుంచే వీజే సన్నీ ఓటింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నాడని అంటున్నారు. దీంతో షన్నూ రెండో స్థానంలో ఉన్నాడట.

వాళ్లిద్దరూ మాత్రం ఎఫెక్ట్ చూపలే

వాళ్లిద్దరూ మాత్రం ఎఫెక్ట్ చూపలే

ప్రస్తుతం టాప్-5లో ఉన్న మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలకు వాళ్ల వాళ్ల అభిమానులు భారీ స్థాయిలో ఓట్లు వేయిస్తున్నారు. అందులో కొందరికి ఎక్కువగా.. మరికొందరికి తక్కువగా ఓట్లు పోలవుతున్నాయి. వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్‌ టాప్ ప్లేస్ కోసం హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో వివాదాలకు దూరంగా ఉంటూ ప్రతి టాస్కులో మెప్పించిన మానస్‌ మాత్రం నాలుగో స్థానంలో ఉన్నాడట. ఇక, అందరినీ దాటుకుంటూ ఫినాలేలో అడుగు పెట్టిన సిరి హన్మంత్ ఐదో స్థానంలో కొనసాగుతుందని అంటున్నారు.

5వ రోజు బాగా పుంజుకున్న శ్రీరామ్

5వ రోజు బాగా పుంజుకున్న శ్రీరామ్

ఆరంభం నుంచీ ఆకట్టుకుని ఫినాలేలో అడుగు పెట్టిన ప్రతి కంటెస్టెంట్‌కు ఓట్లు భారీగానే పోల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ప్రియులు, కంటెస్టెంట్ల అభిమానులు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంతో ఈ సారి కూడా భారీ స్థాయిలో ఓటింగ్ జరుగుతున్నట్లు బుల్లితెర వర్గాల సమాచారం. ఇక, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఐదో రోజైన గురువారం పోలింగ్ ఒక్కసారిగా మారిందని తెలిసింది. దీని ప్రకారం.. సింగర్ శ్రీరామ చంద్రకు నిన్న భారీగా ఓట్లు పెరిగాయట. దీంతో అతడు భారీ స్థాయిలో పుంజుకున్నాడని బిగ్ బాస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Vj Sunny Is Unstoppable | Bigg Boss Telugu 5 Grand Finale || Filmibeat Telugu
వాళ్లిద్దరికీ షాక్.. పోటీ ముగ్గరి మధ్య

వాళ్లిద్దరికీ షాక్.. పోటీ ముగ్గరి మధ్య

వాస్తవానికి ఈ వారం ఆరంభం నుంచే షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. కానీ, గురువారం శ్రీరామ్ వాళ్లిద్దరికీ షాకిచ్చే విధంగా ఓట్లు రాబట్టాడని తాజా సమాచారం. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న కంటెస్టెంట్ కావడంతో చాలా మంది ప్రముఖులు అతడికి మద్దతు తెలుపుతున్నారు. అలాగే, ప్రభాస్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తున్నట్లు కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి తెలిపారు. దీంతో అతడు బాగా పుంజుకున్నాడని సమాచారం. ఇదే కొనసాగితే శ్రీరామ్ టాప్ 2లో ఉండే ఛాన్స్ కూడా ఉందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X