Bigg Boss Winner: ముగిసిన ఫినాలే పోలింగ్.. ఓట్లలో ఒకరు కాల్స్‌లో మరొకరు టాప్.. ఈ సారి విన్నర్ అతడే!

ఐదేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయమైనా.. ఆరంభం నుంచే హవాను చూపిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటూ వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదోది కూడా చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేలో ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిపోనుంది.

దీంతో ఈ సారి బిగ్ బాస్ టైటిల్‌ను ఎవరు ముద్దాడబోతున్నారు అన్న దానిపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం ఆరంభం నుంచీ ఒకే కంటెస్టెంట్ టాప్‌లో కొనసాగుతున్నట్లు తెలిసింది. శుక్రవారంతో పోలింగ్ ముగియడంతో అసలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారన్న దానిపై ఓ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

వాళ్లంతా బయటకు వెళ్లిపోయారు

వాళ్లంతా బయటకు వెళ్లిపోయారు

తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో తాజాగా జరుగుతోన్న సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఒకేసారి వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారం ప్రియాంక సింగ్‌, పద్నాలుగో వారం కాజల్‌లు ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారం అనారోగ్యంతో హౌస్‌ను వీడాడు.

ఫినాలేకు చేరిన కంటెస్టెంట్లు వీళ్లే

ఫినాలేకు చేరిన కంటెస్టెంట్లు వీళ్లే

భారీ అంచనాల నడుమ మొదలైన ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఒకేసారి అడుగు పెట్టారు. ఇందులో చాలా మంది టైటిల్ ఫేవరెట్లు ఉన్నారు. కానీ, వాళ్లలో చాలా మంది మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఈ సీజన్‌లో మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఫినాలేకు చేరుకున్నారు. వీళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కావడంతో.. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీళ్ల ఐదుగురి మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. దీంతో వీళ్లంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయారు.

టాప్ - 2లో నిలిచేది వాళ్లిద్దరే అని

టాప్ - 2లో నిలిచేది వాళ్లిద్దరే అని

తాజాగా జరుగుతోన్న సీజన్‌లో వచ్చిన టైటిల్ ఫేవరెట్లలో షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. బయట భారీ ఫాలోయింగ్ ఉన్న అతడు బిగ్ బాస్ విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపించింది. అదే సమయంలో వీజే సన్నీ తనదైన ఆటతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఫలితంగా అతడు కూడా క్రమంగా రాటుదేలాడు. దీంతో టాప్ 5లో ఉన్న అందరిలోనూ వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ మధ్యనే టైటిల్ పోటీ ఉంటుందన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరికి మాత్రమే ఆరంభం నుంచే ఎక్కువ ఆదరణ దక్కుతూ వచ్చింది.

హవాను చూపించిన కంటెస్టెంట్

హవాను చూపించిన కంటెస్టెంట్

ఐదో సీజన్‌లో ఫినాలేకు చేరుకున్న మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఎవరికి వారే తమ సత్తాను నిరూపించుకుని ఇక్కడి వరకూ వచ్చారు. వీళ్లలో ఎవరు గెలిచినా అశ్చర్యం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఆదివారం రాత్రి నుంచే శుక్రవారం రాత్రి వరకూ బుల్లితెర ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేసుకున్నారు. ఇక, ఈ వారం మొదటి రోజు నుంచే వీజే సన్నీ ఓటింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నాడని అంటున్నారు. దీంతో షన్నూ రెండో స్థానానికే పరిమితం అవ్వాల్సి వచ్చిందని టాక్.

 వాళ్లిద్దరూ చివర్లోనే ఉండడంతో

వాళ్లిద్దరూ చివర్లోనే ఉండడంతో

టాప్-5లో నిలిచి ఫినాలేలో ఉన్న మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలకు వాళ్ల వాళ్ల అభిమానులు భారీ స్థాయిలో ఓట్లు వేయించారు. అందులో కొందరికి ఎక్కువగా.. మరికొందరికి తక్కువగా ఓట్లు పోలయ్యాయి. వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్‌ టాప్ ప్లేస్ కోసం హోరాహోరీగా పోరాటం చేశారు. అదే సమయంలో వివాదాలకు దూరంగా ఉంటూ ప్రతి టాస్కులో మెప్పించిన మానస్‌ మాత్రం నాలుగో స్థానంలో ఉన్నాడట. అలాగే, ఫినాలేలో అడుగు పెట్టిన ఏకైక లేడీ కంటెస్టెంట్ సిరి హన్మంత్ ఐదో స్థానంలోనే ఉందని తాజాగా తెలిసింది.

వీళ్లిద్దరికీ బాగా పోటీ ఇచ్చాడుగా

వీళ్లిద్దరికీ బాగా పోటీ ఇచ్చాడుగా

ఫినాలేకు చేరుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు టాప్ ప్లేస్‌ కోసం పోటీ పడగా.. వీళ్లిద్దరికీ మరో కంటెస్టెంట్ నుంచి పోటీ ఎదురైందట. అతడే సింగర్ శ్రీరామ చంద్ర. ఆరంభం నుంచే తనదైన ఆటతో ఆకట్టుకున్న అతడు.. ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ ఫినాలేకు చేరుకున్నాడు. దీంతో అతడి అభిమానులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. తాజా సమాచారం ప్రకారం.. శ్రీరామ చంద్రకు మిస్‌డ్ కాల్స్ ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. అలాగే, హాట్‌స్టార్‌లోనూ మంచిగానే పోటీ ఇచ్చాడట. ఫలితంగా అతడు టాప్ 2లో నిలిచే ఛాన్స్ కూడా ఉందట.

Recommended Video

Vj Sunny Is Unstoppable | Bigg Boss Telugu 5 Grand Finale || Filmibeat Telugu
 ఐదో సీజన్ విన్నర్ తేలిపోయింది

ఐదో సీజన్ విన్నర్ తేలిపోయింది

ఆదివారం నుంచి శుక్రవారం వరకూ జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఐదో సీజన్‌లో వీజే సన్నీనే విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. హాట్‌స్టార్, మిస్‌డ్ కాల్స్‌లో అతడికి మంచిగానే ఓట్లు పోలయ్యాయట. దీంతో ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేలో అతడినే విన్నర్‌గా ప్రకటిస్తారని అంటున్నారు. అయితే, రెండో స్థానం విషయంలో మాత్రం షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ చంద్ర మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉందని తెలుస్తోంది. హాట్‌స్టార్‌లో ఒకరు.. మిస్‌డ్ కాల్స్‌లో ఒకరు టాప్‌లో ఉండడం వల్ల టాప్ 2 పొజిషన్‌పై స్పష్టత రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X