Bigg Boss :సిరి, సన్నీ మధ్య పెను యుద్ధం.. హీరోవా అంటూ సిరి హేళన.. రెచ్చిపోయిన సన్నీ!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 చివరి అంకానికి చేరింది. అందుకే టాస్కులు ఎక్కువ పెట్టకుండా టాప్‌-5 ఫైనలిస్ట్‌లకు సంబంధించిన జర్నీని బిగ్‌బాస్‌ ప్రదర్శించి రోజులు గడిపే ప్రయత్నం చేశారు. అయితే జర్నీ వీడియోలు అన్నీ అయిపోవడంతో ఇప్పుడు మళ్ళీ టాస్కులు పెడుతున్నారు. ఈ టాస్క్ ల కారణంగా సన్నీ, సిరిల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

మళ్ళీ మళ్ళీ

మళ్ళీ మళ్ళీ

బిగ్‌బాస్‌ జర్నీ వీడియోలను ప్రదర్శించగా హౌస్‌లో ఉన్న తమ ప్రయాణాన్ని చూసుకుని హౌస్‌మేట్స్‌ భావోద్వేగానికి గురయ్యారు. అది పూర్తి కావడంతో ఇక ఈ సీజన్‌లో అలరించిన కొన్ని టాస్క్‌లను ఇంటి సభ్యులతో మళ్ళీ మళ్ళీ ఆడిస్తున్నారు. అందులో భాగంగా 'లేబుల్‌ లేదు మచ్చా' అంటూ టీషర్టు టాస్క్‌ ఇచ్చాడు. టీషర్టు ధరించి స్విమ్మింగ్‌ ఫూల్‌లో అటూ ఇటూ స్విమ్‌ చేయాల్సి ఉంటుంది.

కప్ప సౌండ్‌ వినిఇక ఈ టాస్క్ లో మానస్‌, షణ్ముఖ్ పాల్గొన్నారు. అది అయ్యాక ఇక ఒక సీక్వెన్స్‌లో కొన్ని శబ్దాలు ప్లే చేస్తే, వాటిని అవే వరుసలో ఇంటిసభ్యులు రాయాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఈ టాస్క్‌లో కప్ప సౌండ్‌ విని సన్నీ Frog అని రాయబోయి Forg అని రాయడం, కప్పకూ ఎలుకకు ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని సిరిని బిగ్‌బాస్‌ అడగటం ఒక ప్రోమోలో కనిపించగా ఆసక్తికరంగా ఉంది.

సన్నీ సరిగా ఆడట్లేదని

సన్నీ సరిగా ఆడట్లేదని

ఇక జిమ్ తాళ్లను కంటిన్యూగా ఆడించే టాస్క్‌లో సిరి, సన్నీ, షణ్ముఖ్‌ పాల్గొన్నారు. తాళ్లను పట్టుకుని ఆడిస్తూ ఎవరు ఎక్కువసేపు ఉంటే వారే గెలిచినట్లు లెక్క! ఈ ఆటలో సిరి ఎక్కువసేపు తాళ్లను కదపలేక ముందే అవుట్‌ అయింది. దీంతో పక్కకు వచ్చిన సిరి షణ్ను గెలవాలంటూ అతడిని ఎంకరేజ్‌ చేసింది. అక్కడిదాకా బానే ఉంది కానీ సన్నీ సరిగా ఆడట్లేదని సరదాగా మాట్లాడింది.

 మళ్ళీ రెచ్చగొట్టేలా

మళ్ళీ రెచ్చగొట్టేలా

అయితే వెనక్కు తగ్గని సన్నీ నువ్వు ఓడిపోయావ్‌ కదా అని సిరితో అన్నాడు. తాను ఆటపట్టించవచ్చు కానీ తనను ఆట పట్టిస్తే తట్టుకోలేని సిరి.. నువ్వూ ఓడిపోయావు.. షణ్ను ఒక్కడే గట్టిగా ఆడాడు అని మళ్ళీ రెచ్చగొట్టేలా మాట్లాడింది. నేను సరదాగా అన్నానని సన్నీ సర్ది చెప్పడానికి ప్రయత్నించగా ఓడిపోయావు అన్నది జోకా? అని సీరియస్‌ అయింది.

నా పై జోకులు వేయొద్దు

నా పై జోకులు వేయొద్దు

ఆ తరువాత షన్నుతో కలిసి బెడ్ మీదకు వెళ్లి ముచ్చట్లు పెట్టగా అక్కడికి వచ్చిన సన్నీ అది మజాక్‌లో అన్నానని చెప్పగా అప్పుడు జోక్‌గా అన్నాను.. ఇప్పుడు మాత్రం కాదనేసరికి.. సిరి సీరియస్ అయ్యింది. దీంతో సిరి ''నా పై జోకులు వేయొద్దు'' అని సీరియస్ అయ్యింది, నన్ను ఇమిటేట్ చేయకంటూ వేలు చూపించింది. దీంతో సన్నీ.. ''నాకు వేలు చూపించొద్దు'' అని సిరిని హెచ్చరించాడు.

వెంటనే ''ఏమనుకుంటున్నావ్ సన్నీ నువ్వు? నువ్వు హీరోవా?''సిరి ఎగతాళి చేసినట్టు మాట్లాడింది. మరి ఈ ప్రోమోలో చూసిన దాని ప్రకారం అయితే వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవ చల్లారిందా? లేదా? అన్నది ఎపిసోడ్‌లో తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X