For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5 Telugu Wild Card Entry: ఎలిమినేట్ అయిన బ్యూటీకి బాస్ ఆఫర్.. షోలోకి ఆ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ!

  |

  రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. ఎన్నో ఊహించని పరిణాలు.. మతిపోగొట్టే ట్విస్టులతో సాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను తీసుకొస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోందీ రియాలిటీ షో. ఈ కారణంగానే తెలుగులో ఇది ఏకంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. గత నెలలో మొదలైన ఐదో సీజన్ కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో ప్రతివారం ఒకరు చొప్పున ఇప్పటికే ఆరుగురు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ల నుంచి ఇప్పుడు ఒకరిని షోలోకి తీసుకు వస్తున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ రీఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరు? దానికి సంబంధించిన విషయాలు మీకోసం!

  ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా

  ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా

  భారీ అంచనాల నడుమ గత నెలలో ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచి భారీ రేటింగ్‌ను అందుకుందీ సీజన్. అలా రోజు రోజుకూ మరింత ఆసక్తికరంగా సాగుతోంది.

  మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

  ఆరు వారాలు.. ఎవరెవరు వెళ్లిపోయారు

  ఆరు వారాలు.. ఎవరెవరు వెళ్లిపోయారు

  తాజా సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటి వారం సరయు రాయ్, రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి, మూడో వారంలో లహరి షారి, నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారంలో శ్వేతా వర్మ‌లు ఎలిమినేట్ అయిపోయారు.

  ఏడో సీజన్‌లో తొమ్మిది మంది సభ్యులు

  ఏడో సీజన్‌లో తొమ్మిది మంది సభ్యులు

  ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ రచ్చ రచ్చగా సాగింది. ఇందులో ఏకంగా తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. గత వారం సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లడం ద్వారా హోస్టు ద్వారా నామినేట్ అయిన లోబోతో పాటు ఆర్జే కాజల్, సిరి హన్మంత్, ఆనీ మాస్టర్, ప్రియ, యాంకర్ రవి, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్ర, జస్వంత్ పడాలలు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు.

  Bigg Boss: లహరిపై పింకీ సంచలన వ్యాఖ్యలు.. షోలో అతడితో అలాంటి పనులు.. ఇద్దరి బండారం బట్టబయలు

  బిగ్ బాస్‌లో ఊహించని సంఘటనలు

  బిగ్ బాస్‌లో ఊహించని సంఘటనలు


  బిగ్ బాస్ షో అంటేనే ఎవరూ ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. చిత్ర విచిత్రమైన టాస్కులే కాదు.. అప్పుడప్పుడూ ఎలిమినేషన్‌లో ట్విస్టులు, సీక్రెట్ రూమ్ ఎంట్రీలు, రీఎంట్రీలు ఇలా రకరకాల సర్‌ప్రైజ్‌లు కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈ రియాలిటీ షో ఎంతో ఆసక్తికరంగా మారుతూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.

  ఐదో సీజన్‌లో కంటెస్టెంట్ రీఎంట్రీతో

  ఐదో సీజన్‌లో కంటెస్టెంట్ రీఎంట్రీతో


  గతంలో వచ్చిన సీజన్లలో మహా అయితే పదహారు మంది కంటెస్టెంట్లు మాత్రమే షోలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా 19 మంది వచ్చారు. దీంతో ఇక, ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండవన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే షోలో ఎక్కువ మందిని నామినేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి.

  టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

   ఒకరికి అవకాశం కల్పించబోతున్నారు

  ఒకరికి అవకాశం కల్పించబోతున్నారు

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఇప్పటికే ఆరుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. అందులో ఏకంగా ఐదుగురు ఆడవాళ్లే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే ఓ ఫీమేల్ కంటెస్టెంట్‌తో రీఎంట్రీ ఇప్పించాలని బిగ్ బాస్ నిర్వహకులు ప్లాన్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఎవరు వస్తే బాగుంటుందని కొందరు పోల్స్ కూడా పెడుతున్నారు.

  Recommended Video

  Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
  ఆ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ ఇస్తుంది

  ఆ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ ఇస్తుంది


  తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన హాట్ బ్యూటీ లహరి షారి త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పటికే దీనికి సంబందించిన చర్చలు కూడా ముగిశాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె బిగ్ బాస్ క్వారంటైన్‌లోకి కూడా ఎంటర్ కాబోతుందని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

  English summary
  Bigg Boss is the Telugu Top Reality TV Series Recently Started 5th Season. Eliminated Contestant Lahari Shari Likely to Reentry to the Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X