Bigg Boss Winner: వీజే సన్నీ కారు ధ్వంసం.. అస్వస్థతకు గురైన విన్నర్.. ఆలస్యంగా బయటకొచ్చిన న్యూస్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ.. సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్టులను పరిచయం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోందీ కార్యక్రమం. అదే సమయంలో వరుసగా సీజన్లను కూడా పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ఐదో సీజన్ కూడా విజయవంతంగా పూర్తైంది. ఇందులో వీజే సన్నీ విజేతగా నిలిచి బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నాడు. ఇక, షో ముగిసిన తర్వాత అతడి కోసం అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అందులో ఊహించని సంఘటన జరిగినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

ఎంతో గ్రాండ్‌గా జరిగిన గ్రాండ్ ఫినాలే

ఎంతో గ్రాండ్‌గా జరిగిన గ్రాండ్ ఫినాలే

పదిహేను వారాల పాటు తెలుగు ప్రేక్షకులకు మజాను పంచిన బిగ్ బాస్ ఐదో సీజన్ ఆదివారంతో ముగిసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ తారల తళుకుబెళుకుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. ఇందులో గతంలో ఎన్నడూ చూడనంత మంది గెస్టులు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, మాజీ కంటెస్టెంట్లు డ్యాన్సులతో మెప్పించారు. నాగార్జున అదిరిపోయే హోస్టింగ్‌ చేశారు.

ఐదో సీజన్ విజేతగా నిలిచిన వీజే సన్నీ

ఐదో సీజన్ విజేతగా నిలిచిన వీజే సన్నీ

ఈ సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు పోటీ పడ్డారు. వీరిలో వీజే సన్నీ ఆదివారం జరిగిన ఫినాలేలో విన్నర్‌ అయ్యాడు.

ఆటలో అదుర్స్ అనిపించి గెలిచాడు

ఆటలో అదుర్స్ అనిపించి గెలిచాడు

ఏమాత్రం అంచనాలు లేకుండానే వీజే సన్నీ బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో విమర్శలను ఎదుర్కొన్న అతడు.. క్రమంగా చక్కగా ఆడుతూ, నిజాయితీగా ఉంటూ రాటుదేలాడు. ఈ క్రమంలోనే వ్యక్తిత్వంలోనూ మన్ననలు పొంది స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారాడు. దీంతో కొన్ని లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకుని విజేతగా నిలిచాడు.

ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. సెలెబ్రిటీలు కూడా

ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. సెలెబ్రిటీలు కూడా

మచ్చా మచ్చా అంటూ అందరికీ ఆప్తుడిలా మారిపోయిన వీజే సన్నీ.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో విజేతగా నిలవడం అతడి అభిమానులను ఫుల్ ఖుషీ చేసేసింది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో చాలా మంది సెలెబ్రిటీలు సైతం సన్నీని అభినందిస్తున్నారు. దీంతో అతడి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతోంది.

ఫ్యాన్స్ ర్యాలీ.. అర్ధరాత్రి వరకూ రచ్చ

ఫ్యాన్స్ ర్యాలీ.. అర్ధరాత్రి వరకూ రచ్చ

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో విజయం సాధించిన తర్వాత వీజే సన్నీ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. స్టేజ్ పైనే తన ఆనందాన్ని మాటల రూపంలో చూపించుకున్న అతడు.. విజయదరహాసంతో ట్రోఫీని పట్టుకుని బయటకు వచ్చాడు. ఇక, అన్నపూర్ణ స్టూడియో బయట ఉన్న వేలాది మంది అభిమానులు అర్ధరాత్రి వరకూ ర్యాలీ చేయగా.. అతడు వాళ్లందరితో పాటే ఇంటికి చేరుకున్నాడు.

సన్నీ ర్యాలీలో ఊహించని సంఘటన

సన్నీ ర్యాలీలో ఊహించని సంఘటన

వీజే సన్నీ విజయం సాధించిన తర్వాత ర్యాలీ నిర్వహించగా.. అందులో ఊహించని సంఘటనలు జరిగినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. కారు ఎక్కిన సన్నీని బయటకు రానిచ్చే వీలు కూడా లేకుండా ఫ్యాన్స్ చుట్టుముట్టారు. అలా కొద్దిసేపటికి అతడు కనిపించి వాళ్లకు రిక్వెస్ట్ చేశాడు. ఇక, చివర్లో అతడు ప్రయాణం చేసిన కారు చాలా వరకు ధ్వంసమై కనిపించింది.

వీజే సన్నీకి అస్వస్థత.. మీటింగ్ రద్దు

వీజే సన్నీకి అస్వస్థత.. మీటింగ్ రద్దు

ఆదివారం రాత్రి జరిగిన ర్యాలీ, ఆ తర్వాత ఇంటి దగ్గర అందరూ చుట్టుముట్టడంతో సన్నీ అస్వస్థతకు గురయ్యాడని కూడా ఓ న్యూస్ తెలిసింది. దీంతో వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయిన అతడు.. విశ్రాంతి తీసుకున్నాడట. ఈ కారణంగానే సోమవారం ఉదయం నిర్వహించాలనుకున్న ఫ్యాన్స్ మీట్‌ను వాయిదా వేశాడని కూడా అంటున్నారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X