Bigg Boss 5 Winner: ఐదో సీజన్ విన్నర్ అతడే.. రన్నర్ విషయంలో బిగ్ ట్విస్ట్.. ఫినాలే ఊహించని విధంగా!

సరికొత్త టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, స్నేహ సంబంధాలు.. మధ్యలో ఎమోషనల్ సీన్స్.. అప్పుడప్పుడూ లవ్ ట్రాకులు, రొమాన్స్.. మొత్తంగా గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అవుతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. మన దగ్గర అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటూ వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదోది కూడా చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేలో ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిపోనుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ టైటిల్‌ను ఎవరు ముద్దాడబోతున్నారు అన్న దానిపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఐదో సీజన్ విజేత, రన్నరప్ వివరాలు లీక్ అయ్యాయి. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

టాప్ 5 నిలిచి పోటీ పడుతున్నారు

టాప్ 5 నిలిచి పోటీ పడుతున్నారు

మొదటి నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని భారీ బజ్‌తో మూడు నెలల క్రితమే ప్రారంభం అయింది. ఈ సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు మాత్రమే సీజన్‌కు విజేతగా నిలవబోతున్నారు.

గ్రాండ్ ఫినాలే కోసం భారీ ఏర్పాట్లు

గ్రాండ్ ఫినాలే కోసం భారీ ఏర్పాట్లు

ఎన్నో అంచనాలతో ప్రారంభమైన పదిహేను వారాల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఐదో సీజన్ డిసెంబర్ 19 అంటే నేటితో పూర్తి కాబోతుంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాబోతుంది. దీంతో స్పెషల్ ఎపిసోడ్‌ను ఎంతో సందడిగా జరపనున్నారు. దీని కోసం నిర్వహకులు భారీ ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. దాదాపు నాలుగు గంటల పాటు సాగనున్న ఈ ఎపిసోడ్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది రన్ కాబోతుంది.

వాళ్లందరూ రచ్చ చేయనున్నారు

వాళ్లందరూ రచ్చ చేయనున్నారు

ఇన్ని రోజుల పాటు కనువిందు చేసిన బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం నుంచి జరగబోతుంది. దీని కోసం ఈ సీజన్‌లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అలాగే, ఫినాలే కోసం సన్నద్ధం అవుతున్నామని కూడా వెల్లడిస్తూ కొన్ని వీడియోలను, ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు, వీళ్లలో చాలా మంది ఆటపాటలతో అలరించబోతున్నారని కూడా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిపోయినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

గతంలో ఎప్పుడూ చూడని గెస్టులు

గతంలో ఎప్పుడూ చూడని గెస్టులు


ఆద్యంతం అంగరంగ వైభవంగా జరగబోతున్న బిగ్ బాస్ ఐదో సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు గెస్టులుగా వచ్చేది ఎవరన్న దానిపై కూడా చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది సినీ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక, బిగ్ బాస్ వర్గాల ద్వారా అందులోన్న సమాచారం ప్రకారం.. దర్శకధీరుడు రాజమౌళి, నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్, కరణ్ జోహార్, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, జగపతి బాబుతో పాటు మరికొందరు గెస్టులుగా వచ్చి ప్రేక్షకులను అలరించబోతున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ నుంచి వాళ్లిద్దరూ అవుట్

బిగ్ బాస్ నుంచి వాళ్లిద్దరూ అవుట్

బిగ్ బాస్ ఐదో సీజన్‌ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ శనివారమే పూర్తైంది. ఇందులో మాజీ కంటెస్టెంట్లు ఆటపాటలతో అలరించారు. అదే సమయంలో ఇందులో ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారని అంటున్నారు. ఫినాలే వీక్‌లో జరిగిన ఓటింగ్‌లో ఐదో స్థానంలో నిలిచిన సిరి హన్మంత్‌ అందరి కంటే ముందు ఎలిమినేట్ అయిపోయిందట. అలాగే, నాలుగో స్థానంలో నిలిచిన మానస్ కూడా షో నుంచి బయటకు వచ్చేశాడని తెలిసింది. దీంతో ఇంక ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారని సమాచారం.

Bigg Boss 5 Finale: ఫినాలే షూటింగ్ వివరాలు లీక్.. షో నుంచి ఇద్దరు ఔట్.. ఎలా ఎలిమినేట్ అయ్యారంటే!

విజేత అతడే.. షూటింగ్ అప్పుడే

విజేత అతడే.. షూటింగ్ అప్పుడే

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి చాలా మందే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వచ్చారు. అందులో కొందరు టైటిల్ ఫేవరెట్లుగా పేరు తెచ్చుకున్నారు. కానీ, అండర్ డాగ్‌లా వచ్చి అంతకంతకూ బలపడ్డాడు వీజే సన్నీ. అందుకు క్రమంగా అతడు టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు. అందుకు అనుగుణంగానే ఫినాలేకు చేరుకున్నాడు. దీంతో అతడికి భారీ స్థాయిలో ఓట్లు కూడా పోలయ్యాయి. దీంతో ఈ సీజన్‌లో సన్నీనే విజేత అని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ వర్గాల్లో కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. దీంతో గ్రాండ్ ఫినాలేలో అతడినే విన్నర్‌గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

రన్నర్ విషయంలో మాత్రం ట్విస్ట్

రన్నర్ విషయంలో మాత్రం ట్విస్ట్

ఇప్పటికే టాప్ 5 నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. అలాగే, సన్నీ కూడా విజేతగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరో టైటిల్ ఫేవరెట్ అయిన షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. అయితే, బిగ్ బాస్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. శ్రీరామ చంద్ర గత వారం జరిగిన ఓటింగ్‌లో సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడట. దీంతో ఈరోజు జరగనున్న గ్రాండ్ ఫినాలేలో అతడు రన్నరప్‌గా నిలవబోతున్నాడని తెలుస్తోంది. అదే జరిగితే షన్నూకు భారీ షాక్ తగిలినట్లు అవుతుందనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X