Bigg Boss Winner: షణ్ముఖ్‌ ఓడిపోయాడా.. ఓడించారా? ఫాలోయింగ్ తక్కువ ఉన్నా సన్నీ ఎలా గెలిచాడు?

సుదీర్ఘ కాలంగా ఓ మూస ధోరణిలో సాగిపోతోన్న బుల్లితెరను ఒక్కసారిగా హైలైట్ చేసిన షో బిగ్ బాస్. ఇంగ్లీష్‌లో ప్రసారం అయ్యే 'బిగ్ బ్రదర్' అనే షో ద్వారా రూపొందిన ఈ రియాలిటీ షో దాదాపు పద్నాలుగేళ్ల నుంచి హిందీలో ప్రసారం అవుతోంది. అలాగే, దేశంలోని మిగిలిన భాషల్లోనూ ఇది ప్రారంభం అయింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఐదేళ్ల క్రితం మొదలైన ఈ షో.. గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఇందులో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. దీంతో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. దీంతో అతడి ఓటమిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో షన్నూ ఎందుకు ఓడిపోయాడో కారణాలు చూద్దాం పదండి!

19 మందిలో టైటిల్ ఫేవరెట్‌గా

19 మందిలో టైటిల్ ఫేవరెట్‌గా

భారీ అంచనాలతో మొదలైన ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన అతడికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండడమే.

చిన్నగా మొదలెట్టి.. ఫినాలేలోకి

చిన్నగా మొదలెట్టి.. ఫినాలేలోకి

ఐదో సీజన్‌లోకి టైటిల్ ఫేవరెట్‌గా షణ్ముఖ్ జస్వంత్ చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయినా అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, మధ్యలో తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడు. టాస్కుల్లో వందకు వంద శాతం మానసికంగా, శారీరకంగా శ్రమించాడు. తద్వారా ఫినాలేలోకి అడుగు పెట్టేశాడు.

భారీ అంచానాలు.. రన్నరప్‌గానే

భారీ అంచానాలు.. రన్నరప్‌గానే

భారీ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ జస్వంత్, టాప్‌ 5లో నిలిచి ఫినాలేలో అడుగు పెట్టడంతో అతడు గెలుస్తాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఓట్లు కూడా భారీ స్థాయిలో పోలయ్యాయి. అయితే, అతడి కంటే సన్నీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో అతడే ఈ సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కావాలనే ఓడించారంటూ ట్రోల్స్

కావాలనే ఓడించారంటూ ట్రోల్స్

ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా మిగిలిపోయాడు. దీంతో అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే సన్నీని బిగ్ బాస్ వాళ్లు గెలిపించారని.. ఈ షో స్క్రిప్ట్ ఆధారంగా నడుస్తుందని తెగ పోస్టులు చేస్తున్నారు. అంతేకాదు, ఓట్లు ఎక్కువ వచ్చినా కుట్రపూరితంగా షన్నూను గెలిపించలేదని ఆరోపిస్తున్నారు.

షణ్ముఖ్‌ను నిజంగానే ఓడించారా

షణ్ముఖ్‌ను నిజంగానే ఓడించారా

షణ్ముఖ్ జస్వంత్ ఫినాలేలో ఓటమి పాలైన తర్వాత అతడి అభిమానులు ట్రోల్స్ చేయడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న షన్నూను కాదని.. బిగ్ బాస్‌కు ముందు అసలు పరిచయమే లేని సన్నీ ఎలా గెలిచాడని చాలా మంది చర్చించుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఎన్నో రకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి.

షణ్ముఖ్ ఓటమికి కారణం అదేనా

షణ్ముఖ్ ఓటమికి కారణం అదేనా

ఐదో సీజన్‌లో వీజే సన్నీ విజేతగా అవతరించడానికి కారణం అతడు హర్డ్ వర్క్ చేయడమే అని చెప్పుకోవచ్చు. అలా అని షణ్ముఖ్ జస్వంత్ చేయలేదని కాదు.. అతడు కూడా బాగానే శ్రమించాడు. కాకపోతే సన్నీతో పోలిస్తే షన్నూ ఆట పెద్దగా కనిపించలేదు. దీనికి కారణం అతడి గేమ్ కంటే సిరితో ఉన్న బాండింగే హైలైట్ అయింది. ఇది కూడా అతడి ఓటిమికి కారణమైంది.

షన్నూ ఓడిపోయాడా.. ఓడించారా?

షన్నూ ఓడిపోయాడా.. ఓడించారా?

ఫినాలే వీక్‌లో షణ్ముఖ్ జస్వంత్‌కు సన్నీ కంటే ఓట్లు తక్కువగా రావడం వల్లే అతడు ఓటమి పాలయ్యాడని బిగ్ బాస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. షన్నూకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నా.. మిగిలిన కంటెస్టెంట్ల అభిమానులు కూడా సన్నీకి సపోర్ట్ చేశారని.. అందుకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి షన్నూ ఫ్యాన్స్ మాత్రం బాగా గుర్రుగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X