Bigg Boss: వీజే సన్నీకి వంద కోట్ల ఆఫర్.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. రిజెక్ట్ చేసి షాకిచ్చాడుగా!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో స్పందనను అందుకుంటూ తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో దేనికీ సాధ్యం కాని విధంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఇది.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మందిని స్టార్లను కూడా చేస్తోంది. ఇక, ఇందులో గెలిచిన వాళ్లైతే వెనుదిరిగి చూసే పరిస్థితే లేకుండా దూసుకెళ్తున్నారు. వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ముగిసిన ఐదో సీజన్‌ విన్నర్ వీజే సన్నీకి అప్పుడే అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, పర్సనల్ లైఫ్‌‌లోనూ అతడికి భారీగా వంద కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

సత్తా చాటి విజేతగా నిలిచన సన్నీ

సత్తా చాటి విజేతగా నిలిచన సన్నీ

గతంలో వచ్చిన సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని భారీ బజ్‌తో మూడు నెలల క్రితమే ప్రారంభం అయింది. ఈ సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు పోటీ పడ్డారు. వీరిలో వీజే సన్నీ ఇటీవల జరిగిన ఫినాలేలో విన్నర్ అయ్యాడు.

అంచనాలు లేకుండా వచ్చి ఇలా

అంచనాలు లేకుండా వచ్చి ఇలా

ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. వారిలో వీజే సన్నీ ఒకడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అతడు.. అద్భుతమైన ఆటతో సత్తా చాటాడు. కోపంతో పలుమార్లు గొడవలు పడినప్పటికీ.. ఆ తర్వాత తన ప్రేమను చూపించి కంటెస్టెంట్లతో పాటు ఆడియెన్స్ మనసులు కూడా గెలుచుకుని సీజన్ విజేతగా నిలిచి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేశాడు.

బయటకొచ్చిన తర్వాత ఫుల్ బిజీ

బయటకొచ్చిన తర్వాత ఫుల్ బిజీ

ఈ రియాలిటీ షోలోకి కంటెస్టెంట్లుగా వచ్చిన వాళ్లకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వాళ్లు అటు బుల్లతెరపై.. ఇటు వెండితెరపై సత్తా చాటుతున్నారు. అలాంటి ఈ షోలో విజేతగా నిలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, ఇప్పుడు ఐదో సీజన్‌లో విజేతగా నిలిచిన వీజే సన్నీ ఫుల్ ఫేమస్ అయిపోయాడు. అదే సమయంలో వరుసగా ఇంటర్వ్యూలు, ఫ్యాన్స్ మీటింగులు, సోషల్ మీడియా లైవ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. దీంతో అతడి పేరు కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది కూడా.

అన్నీ చెప్పుసి.. ట్రెండింగ్‌లో సన్నీ

అన్నీ చెప్పుసి.. ట్రెండింగ్‌లో సన్నీ

బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత వీజే సన్నీ అప్పటి నుంచి హాట్ టాపిక్ అవుతున్నాడు. అందుకే అతడిని యూట్యూబ్ ఛానెళ్లు, టీవీ ఛానెళ్లు అస్సలు వదలడం లేదు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోకు సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడంతో పాటు సన్నీ పర్సనల్ విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నాలు జరుపుతున్నారు. అందుకు అనుగుణంగానే అతడు కూడా హౌస్‌లో జరిగిన విషయాలను మీడియా ముందు ఉంచుతున్నాడు. ఇందులో ప్రేక్షకులకు చూపించినవే కాకుండా.. చూపించని అంశాలు కూడా ఉండడంతో ఇంటర్వ్యూలు ట్రెండ్ అయ్యాయి.

పెళ్లిపై వీజే సన్నీ రియాక్షన్ ఇలా

పెళ్లిపై వీజే సన్నీ రియాక్షన్ ఇలా

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో విన్నర్ అయిన తర్వాత వీజే సన్నీ ఇచ్చే ఇంటర్వ్యూల్లో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావిస్తున్నాడు. ఇందులో భాగంగానే చాలా మంది అతడి పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. దీంతో సన్నీ 'నాకు కెరీర్‌ అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా నా ఫోకస్ మొత్తం దాని మీదే పెడుతున్నా. మంచి మంచి సినిమాలు చేయాలి. ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరించాలి. అలా స్థిరపడిన తర్వాతనే పెళ్లి గురించి ఆలోచిస్తా. అమ్మాయి విషయంలో మాత్రం మా కళావతితే తుది నిర్ణయం' అంటూ పలుమార్లు చెప్పుకొచ్చాడు.

వీజే సన్నీకి వంద కోట్ల ఆఫర్ రాక

వీజే సన్నీకి వంద కోట్ల ఆఫర్ రాక


బిగ్ బాస్ షోకు ఉన్నంత క్రేజ్ మరే దానికీ లేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా తెలుగు షోకు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే మన దగ్గర గెలిచిన వాళ్లకు విదేశాల్లోనూ ఫ్యాన్స్‌ ఉంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజా సీజన్ విన్నర్ వీజే సన్నీకి ఏకంగా ఒక మహిళ.. పెళ్లితో పాటు వంద కోట్లు ఆఫర్ చేసింది. అసలు ఏం జరిగిందంటే.. సన్నీకి అమెరికాకు చెందిన ఓ మహిళ వీడియో కాల్ చేశారు. అప్పుడు తన కూతురుని పెళ్లి చేసుకోమని అతడిని కోరారు. అంతేకాదు, ఇందుకోసం కట్నంగా వంద కోట్ల రూపాయాలు ఇస్తానని ఆ వీడియో కాల్‌లోనే ఆఫర్ చేసేశారు.

రిజెక్ట్ చేసి షాకిచ్చిన బీబీ విన్నర్

రిజెక్ట్ చేసి షాకిచ్చిన బీబీ విన్నర్

సదరు మహిళ మాటలను విన్న తర్వాత తనలో తాను నవ్వుకున్న వీజే సన్నీ 'రియల్ లైఫ్‌లోనూ నన్ను భరించాలంటే చాలా ఓపిక ఉండాలి. మీరు అంత పెద్ద మాట అన్నారు చాలు. చాలా థ్యాంక్స్. కానీ, నాకు కెరీరే ఇంపార్టెంట్. ఏమనుకోకండి' అంటూ రిప్లై ఇచ్చాడు. తద్వారా పెళ్లి సంబంధంతో పాటు వంద కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలా కూడా వీజే సన్నీ మరోసారి హైలైట్ అవుతున్నాడు. ఇలా ఏ బిగ్ బాస్ విన్నర్‌కు కూడా ఆఫర్ రాలేదని అతడి ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X