శిష్యుడికి బాబా భాస్కర్ పంగనామాలు.. అందరికి షాకిచ్చినా.. మనసు గెలిచి..!

Recommended Video

Bigg Boss Telugu 3 : Episode 51 Highlights

బిగ్‌బాస్ రియాలిటీ షోలో పరిస్థితుల అనుగుణంగా ఇంటి సభ్యుల మధ్య ఈక్వేషన్స్ మారిపోవడం తరుచుగా కనిపిస్తుంటాయి. ఈ రోజు వారిద్దరూ క్లోజ్ అనుకుంటే.. మరుసటి రోజు మరొకరితో స్నేహంగా ఉంటారు. తాజా షోలో బాబా భాస్కర్, మహేష్ విట్ట మధ్య గురు, శిష్యుల అనుబంధం కొనసాగుతుంది. వారిద్దరి ఒకరి కోసం మరొకరు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సోమవారం నామినేషన్ల సందర్భంగా బాబా భాస్కర్‌ తీసుకొన్న నిర్ణయం షాక్ కలిగించినా... సరైన నిర్ణయం తీసుకొన్నారనే విషయాన్ని ఇంటి సభ్యులు అంగీకరించడం గమనార్హం. 50వ రోజు ఇంటిలో ఏం జరిగిందంటే..

నామినేషన్ ప్రక్రియ సందర్భంగా

నామినేషన్ ప్రక్రియ సందర్భంగా

నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత బిగ్‌బాస్‌ ఓ సూచన చేశారు. నామినేట్ అయిన సెలబ్రిటీల నుంచి ఒకరిని రక్షించే అవకాశం కల్పిస్తున్నా.. ఒకరిని సేఫ్ చేయండి అంటూ కెప్టెన్ బాబా భాస్కర్‌కు అవకాశం ఇచ్చారు. అయితే అందరూ తనకు ఉన్న రిలేషన్‌తో మహేష్ విట్టాను సేఫ్ చేస్తారని అనుకొన్నారు. కానీ ఊహించని విధంగా రవికృష్ణను సేఫ్ చేస్తూ షాకిచ్చారు. దాంతో మహేష్, శ్రీముఖి చిన్నబోయారు.

రవికృష్ణను ఎందుకు సేవ్ చేశానంటే

రవికృష్ణను ఎందుకు సేవ్ చేశానంటే

అయితే రవికృష్ణను ఎందుకు సేఫ్ చేశాననే విషయంపై బాబా భాస్కర్ ఇచ్చిన క్లారిటీ అందర్నీ మెప్పించింది. ఏ టాస్క్ అయినా రవికృష్ణ నిజాయితీగా ఆడుతాడు. వందశాతం ప్రతిభను చాటేందుకు ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా టాస్క్ సందర్భంగా ఎలాంటి వివాదాలకు వెళ్లడు. అందుకే నేను రవికృష్ణను సేఫ్ చేశాను అని బాబా భాస్కర్ చెప్పాడు. ఆ తర్వాత రవికృష్ణను కౌగిలించుకొని అభినందించాడు.

శ్రీముఖికి షాక్

శ్రీముఖికి షాక్

రవికృష్ణను సేఫ్ చేసిన వెంటనే శ్రీముఖిని కౌగిలించుకొని.. నీవు స్ట్రాంగ్ క్యాండిడేట్‌వి. కాబట్టే నిన్ను సేఫ్ చేయలేదు అని బాబా భాస్కర్ చెప్పాడు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన శ్రీముఖి దీర్ఘంగా ఆలోచించడం కనిపించింది. ఆ తర్వాత హిమజ, శ్రీముఖి మాట్లాడుకొంటూ.. మహేష్ విట్టాను సేఫ్ చేస్తారనుకొన్నాను. కానీ రవికృష్ణను సేఫ్ చేయడం కరెక్ట్. ఎందుకంటే టాస్క్‌ను పక్కగా ఆడుతాడు. మిగితా ఎవరిని సేఫ్ చేసినా కెప్టెన్సీ పవర్‌కు న్యాయం జరుగబోకుండా ఉండేది అని అభిప్రాయపడ్డారు.

మరోసారి సమస్యల్లో మహేష్ విట్టా

మరోసారి సమస్యల్లో మహేష్ విట్టా

ఇక మరోవారం మహేష్ విట్టా‌పై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నది. గతవారం అందరూ మహేష్ విట్టానే ఎలిమినేట్ కావొచ్చని ఊహించారు. కానీ అనూహ్యంగా అలీ రెజాను ఎలిమినేట్ కావడం అందర్నీ షాక్ గురి చేసింది. తాజాగా మహేష్‌ను సేఫ్ చేసి ఉంటే మరో వారం వరకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని, ఒకవేళ ఈ వారం మహేష్ ఎలిమినేట్ అయితే బాబా భాస్కర్ సేఫ్ చేయకపోవడం ఓ కారణం కావొచ్చనే వాదన వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X