బిగ్‌బాస్ నుంచి సామ్రాట్ బయటకు.. ఎలిమినేషన్ నుంచి ఆ ఇద్దరు సేఫ్.. రోల్ నీ ర్యాప్ నస చాలూ..

By Rajababu

బిగ్‌బాస్ రియాలిటీ షోలో 55వ రోజు చాలా సరదాగా గడిచిపోయింది. గతవారం సభ్యుల ప్రతిభ, సామర్థ్యాలపై నాని విశ్లేషించడంతోనే సరిపోయింది. శనివారం ఏదో ఆసక్తికరంగా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు నాని నసతోనే సరిపోయింది. నామినేషన్ ప్రక్రియలో టెన్షన్ లేకుండా బిగ్‌బాస్ ఇద్దరు ఇంటెస్టంట్లను సేఫ్ చేయడంతో రేపటి ఎపిసోడ్‌పై ఉత్కంఠ తొలిగిపోయింది. శనివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో అనే విషయాన్ని తెలుసుకోవడానికి వివరాల్లకి వెళ్దాం పదండి..

బిగ్‌బాస్ నుంచి సామ్రాట్ బయటకు

బిగ్‌బాస్ నుంచి సామ్రాట్ బయటకు

శనివారం ఎపిసోడ్‌ ఆరంభంలోనే టైటిల్స్ పడకముందే బిగ్‌బాస్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. సామ్రాట్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిపించి నీకు కోర్టు నోటీసులు వచ్చాయి బయటకు వెళ్లాల్సి ఉంది అని చెప్పాడు. అంతేకాకుండా బయటకు వెళ్లే విషయాన్ని ఇంటి సభ్యులతో పంచుకోవద్దని సూచించాడు.

 ఎప్పుడు వెళ్తాడో

ఎప్పుడు వెళ్తాడో

కోర్టు నోటీసుల నేపథ్యంలో సామ్రాట్ ఎప్పుడు బయటకు వెళ్తాడో.. వెళ్లి లోపలికి వచ్చాడా అనే విషయంపై క్లారిటీ లేదు. బహుశా సోమవారం ఉదయం బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఎంత సేపు వెళ్తాడు.. ఎప్పుడు వస్తాడు అనే అంశాలను గుంభనంగా ఉంచారు.

గణేష్ ఫ్లోర్ మూమెంట్

గణేష్ ఫ్లోర్ మూమెంట్

డీజే టాస్క్‌లో ఫ్లోర్ మూమెంట్ చేసిన గణేష్‌ను అభినందించాడు. తన కోసం మరోసారి చేయాలని కోరగా.. మీటింగ్ హాలులోనే ఫ్లోర్ మూమెంట్ చేసి చూపించారు. ఒకవేళ ప్రభుదేవా చూస్తే రిటైర్ అయిపోవడం ఖాయమని పరోక్షంగా ఝలక్ ఇచ్చాడు.

రోల్ నీ లొల్లి చాలూ

రోల్ నీ లొల్లి చాలూ

బిగ్‌బాస్ హౌస్‌లో ర్యాప్ సాంగ్స్‌తో హోరెత్తించే రోల్ రైడాకు నాయనా నీ లోల్లి చాలూ అని పరోక్షంగా హెచ్చరించారు. ర్యాప్ చాలా రొటీన్ అవుతుందని ప్రేక్షకులు ఫీలవుతున్న విషయాన్ని నాని చెప్పడం కొంత ఊరటగా మారింది.

బాబు గోగినేని, కౌశల్ సేఫ్

బాబు గోగినేని, కౌశల్ సేఫ్

నామినేషన్‌ ప్రక్రియలో కౌశల్, బాబు గోగినేని, నందిని, గణేష్, దీప్తి నల్లమోతు ఉన్న సంగతి తెలిసిందే. వారిలో నుంచి బాబు గోగినేని, కౌశల్‌ను ప్రొటెక్టెడ్ జోన్‌లోకి పంపించి టెన్షన్‌కు తెరదించారు. ఇక రేపు ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా? లేక ఒకే ఎలిమినేట్‌తో సరిపెట్టుకొంటారా? అనే విషయంపై ఆసక్తిని రేపింది.

ఎలిమినేషన్‌లో ముగ్గురిలో ఎవరు

ఎలిమినేషన్‌లో ముగ్గురిలో ఎవరు

గణేష్, దీప్తి నల్లమోతు, నందిని రాయ్‌లో ఎవరు వెళ్తారు అనే విషయం పెద్దగా ఆసక్తి లేకపోయినా.. కొంత చర్చకు దారి తీసే అంశంగానే మిగిలింది. ఎందుకంటే కౌశల్‌ను బలవంతంగా నామినేట్ చేసిన దీప్తి గానీ వెళ్లే కౌశల్‌తో పెట్టుకొంటే బయటకు పోవడం ఖాయమనే వాదనకు మరింత బలం చేకూరింది. నందిని బయటకు వచ్చినా అదే వాదనకు బలం పెరుగుతుంది. ఎందుకంటే గత కొద్దిరోజులుగా నందిని కౌశల్‌ను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నాని చిన్నప్పటి ఫోటోలు

నాని చిన్నప్పటి ఫోటోలు

గతవారం ఇంటి సభ్యుల బాల్యానికి సంబంధించిన ఫోటోలు చూపించిన బిగ్‌బాస్ శనివారం నాని చిన్నప్పటి ఫొటోలు చూపించి ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. వైజాగ్‌లో తీయించుకొన్న ఫోటోల వెనుక ఆసక్తికరమైన విషయాన్ని వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X