దివిపై పిచ్చికుక్కలా అరుస్తావా? ఇంకోసారి ఆడపిల్లపై వేషాలేస్తే.. సోహైల్‌కు కొరడాతో నాగ్ వార్నింగ్
ఐదోవారానికి సంబంధించిన నామినేషన్లు బిగ్‌బాస్ ఇంటిలో రచ్చ రేపింది. మోనాల్, దివి విషయంలో అభిజిత్, అఖిల్, సోహైల్ రెచ్చిపోయి గొడవ పడ్డారు. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో పోట్లాడుకొన్నారు. ఈ ముగ్గురి వ్యవహార తీరుతో మోనాల్, దివి మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయంపై ఇంటి సభ్యులకు హోస్ట్ నాగార్జున వీకెండ్‌లో గట్టిగా క్లాస్ పీకారు. ముఖ్యంగా సోహైల్‌కు నాగ్ వార్నింగ్ ఇస్తూ..

దివి నామినేట్ చేస్తే అరుస్తావా?
దివి నిన్ను నామినేట్ చేసింది. ఏంటి ఆ అరుపులు, ఒకరు నీవు నచ్చలేదంటే అరుస్తావా? అంత మాత్రాన నువ్వ అరుస్తావా? నీవు ఏ స్థాయిలో అరిచావో తెలుసా? నీవు ఎందుకు అరుస్తున్నావో.. ఏమని అరుస్తున్నావో అర్థం కాలేదు. నీవు అర్తుస్తుంటే మెడ మీద నరాలు తెలుతున్నాయి అని నాగ్ క్లాస్ పీకారు.

పిచ్చి కుక్కలా అరుస్తున్నావని
దివి నన్ను నామినేట్ చేసిన తర్వాత నేను ఒక్క మాట అనలేదు. నాకు సాధారణంగా మాట్లాడితేనే నరాలు కనిపిస్తాయి అంటూ సోహైల్ ఏదో చెప్పబోయాడు. సోహైల్ మాటలను మధ్యలోనే తుంచేస్తూ.. నన్ను మధ్యలో ఆపకు. నీవు ఏ రేంజ్‌లో అరుస్తున్నావో తెలుసా? ఒక ఓ పిచ్చికుక్క మాదిరిగా అరుస్తున్నావు అని సోహైల్‌కు నాగార్జున గట్టిగా తలంటాడు.

నీకు నచ్చకపోతే మామూలుగా మాట్లాడు..
ఇంట్లో ఎవరైనా నామినేట్ చేసినా.. నీ గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసినా సీరియస్‌గా మాట్లాడుకోవాలి. కానీ అరవడాలేమిటి? నీకు ఏమైనా చెప్పాలంటే వారికి పరిస్థితిని వివరించు. నీవు అరిస్తే.. అవతలివాళ్లు అరవాలి. ఇలా కాదు. మీరందరూ ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని నాగ్ సూచించారు.

ఇంకోసారి ఆడపిల్లపై అలా అరిస్తే
ఇవన్నీ వదిలేస్తే.. ఒక ఆడపిల్ల మీద అరుస్తున్నావు. ఇంకొక్కసారి ఆడపిల్ల మీద అరిస్తే.. అందుకే ఈ కొరడా తీశాను. ఇంట్లో ఒక ఆడపిల్ల మీద గొంతు చించుకొని అరువాల్సిన అవసరం ఉందా? నీవు చాలా చాలా బాగా ఆడుతున్నావు. నీ విషయంలో ఇదొక్కటే నిన్ను వెనుకకు లాగుతున్నది. ఈ సమస్యను నీవు సాల్వ్ చేసుకొంటే మంచి ఫలితాలు సాధిస్తావు అని నాగార్జున చెప్పారు.
Recommended Video

నా ప్రవర్తను మార్చుకొంటానని
నాగార్జున పీకిన క్లాస్‌తో సోహైల్ రియలైజ్ అయినట్టు కనిపించాడు. ఇక ముందు నా నుంచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. నా పద్దతి మార్చుకొంటానని మాటిస్తున్నాను అని సోహైల్ అన్నారు. దాంతో నీవు బాగా ఆడుతున్నావు. నీ ప్రవర్తనను కొంత మార్చుకొంటే ఎక్కడో ఉంటావు అని నాగార్జున సలహా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











