‘బిగ్ బాస్ పతనం మొదలైంది..’: శేఖర్ బాషా ఎలిమినేషన్ పై మాజీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8. ఇప్పటికే పలు సందర్భాల్లో తిమ్మతిరిగే ట్విస్టులు ఇచ్చాడు బిగ్ బాస్.. గతంలో ఏ సీజన్లో లేని షాకింగ్ ఎలిమినేషన్‌లు చేస్తున్నాడు. ఈ వారం జరిగే ఎలిమినేషన్ కూడా ఎవరూ ఊహించి ఉండరు. ఈ సారి చాలా బోరింగ్ గా హౌస్ ఉందనే సమయంలో.. కాస్తో కూస్తో ఎంటర్టైన్ మెంట్ అందుస్తున్నాడంటే..అది ఆ కంటెస్టెంట్ వల్లే. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంటే శేఖర్ బాషా. పంచు డైలాగ్స్.. కుళ్లు జోక్స్ లతో హౌస్ లో ఎంటర్టైన్ మెంట్ అందించిన శేఖర్ బాషా నేడు ఎలిమినేట్ కాబోతున్నాడు.
నిజంగా బిగ్ బాస్ లవర్స్ షాక్ లో ఉన్నారు. అస్సలూ శేఖర్ బాషాను ను ఎలిమినేట్ చేయడమేంట్రా అంటూ నోరు వెల్లబెడుతున్నారు. కొంతమంది అయితే.. వెస్ట్ ఎలిమినేషన్, చెత్త సీజన్ అంటూ బిగ్ బాస్ పై కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో ఏమౌతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలే సీజన్ అట్టర్ ఫ్లాప్ వేలో వెళ్తుంటే.. షాకింగ్‌ల మీద షాకింగ్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఈ తరుణంలో బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం కామెంట్స్ చేసింది. శేఖర్ బాషా ఎలిమినేషన్ పై గీతూ రాయల్ స్పందనేంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ మాట్లాడుతూ.. తాను పాల్గొన్న సీజన్ 6 లాగానే సీజన్ 8 కూడా అట్టర్ ప్లాప్ టాక్ సొంతం చేసుకుంటుందనీ, టాస్కులే కాదు.. ఎలిమినేషన్స్ కూడా అలానే జరుగుతున్నాయని షాకింగ్ కామెంట్స్ చేసింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లంతా బయటకు పంపిస్తే.. హౌస్ లో సైలెంట్ గా కూర్చొనే వారిని సేవ్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. వెస్ట్ కంటెస్టెంట్లను హౌస్ లో ఉంచుకుంటే.. సీజన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ గా అవుతుందని అన్నారు. ఈ వారం శేఖర్ బాషాను ఎలిమినేట్ చేయబోతున్నామనే వార్త తనకు షాక్ ఇచ్చిందనీ, హౌస్ లో ఇంతో.. అంతో.. ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారంటే.. అది శేఖర్ బాషానే.. అలాంటి కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయడమేంట్రా బాబు.. ఇది మాత్రం చాలా చెత్త నిర్ణయమంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది గీతూ రాయల్.
ఆర్జే శేఖర్ బాషాను ఎలిమినేట్ చేయకుండా.. ఆయను సీక్రెట్ రూంలోకి పంపించో.. లేదా ఈ వారం నో ఎలిమినేషన్ పెట్టి అయినా శేఖర్ బాషాను హౌస్ లోనే ఉంచాలని అభిప్రాయం వ్యక్తం చేసింది గీతూ రాయల్. శేఖర్ బాషాకు కొడుకు పుట్టాడు కాదా ఆ రిజన్ తోనైనా బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించి ఉంటారమో అనే అభిప్రాయం వ్యక్తం చేసింది.ఈ వారం శేఖర్ బాషాను ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుగానే డిసైట్ అయినట్టు ఉన్నారు. అందుకే ఈ వారం ఒక్క గేమ్ కూడా శేఖర్ బాషాకు ఇవ్వలేదు. కావాలనే ఆయన గేమ్ ను చూపించలేదంటూ.. ఆ హైలెట్ మూమెంట్స్ ను కట్ చేసి టెలికాస్ట్ చేసి ఉంటారు. ఆయనకు స్కీన్ ఫ్లేస్ కూడా ఇవ్వలేదు. అందుకే ఆయనకు తక్కువ ఓట్లు వచ్చాయంటూ పలు అనుమానాలు వ్యక్తం చేసింది.

గీతూ రాయల్ ఇంకా మాట్లాడుతూ..శేఖర్ బాషాను సేవ్ చేసి.. ఆదిత్య ఓం ను ఎలిమినేట్ చేయాలి. ఆ గేమ్ అసలు బాగాలేదన్నారు. ఇక ప్రుద్వీ సీజన్ ప్రారంభం నుంచే నెగిటీవితో సర్వేవ్ అవుతున్నాడనీ, కానీ.. ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఓటింగ్ పడుతోందని అన్నారు. శేఖర్ బాషా ఎలిమినేట్ అవుతున్నాడంటే.. తాను మాత్రం అస్సలూ జీర్ణించుకోలేకపోతున్నారంటూ కామెంట్స్ చేశారు. శేఖర్ బాషాను ఎలిమినేట్ చేస్తే.. అన్ లిమిట్ ఎంటర్ టైన్ అంటూ ముందుకు వచ్చిన బిగ్ బాస్ 8 లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందనీ, ఆ షోకు ఆదరణ తగ్గిపోతుందన్నారు. శేఖర్ బాషా వెళ్లిపోతే.. యష్మీ, సోనియాలు రెచ్చిపోతారని అన్నారు. తాను పాల్గొన్న సీజన్లో కూడా ఇలానే జరిగిందని, షో అట్టర్ ఫ్లాప్ టాక్ సోంతం చేసుకుంటుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్.


Click it and Unblock the Notifications










