టీవీ షోలో... ప్రభుదేవా, ఇమ్రాన్‌లతో సల్మాన్ డాన్స్

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ కిస్సుల హీరో ఇమ్రాన్ హష్మి, కొయోగ్రాఫర్-దర్శకుడు ప్రభుదేవా, మరో డాన్సింగ్ సంచలనం రెమో డిసౌజాలు కలర్స్ ఛానల్ సూపర్ హిట్ రియాల్టీ షో 'బిగ్ బాస్ 6' ఫైనల్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి డాన్స్ చేయబోతున్నారు. ఈ ఫైనల్ షోకు వీరంతా అతిథులుగా హాజరవుతున్నారు. ఇదంతా వారి వారి సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో భాగమే.

గతంలో ప్రభుదేవా సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'వాంటెడ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ప్రభుదేవా డాన్స్ ప్రధానంగా సాగే 'ABCD (ఎనీ బడీ కెన్ డాన్స్)' సినిమాలో నటిస్తున్నాడు. డాన్స్ మాస్టర్ రేమో డిసౌజా దర్శకత్వంలో 'ABCD (ఎనీ బడీ కెన్ డాన్స్)' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగానే వీరు బిగ్ బాస్-6 ఫైనల్‌లో పాల్గొంటున్నారు.

ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఒకే సారి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో అనువాద కార్యక్రమాలు మొదలు కాన్నాయి. పనులన్నీ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే...ఇది ఇండియాలోనే తొలి 3డి డాన్స్ నేపథ్య మూవీ. యూటీవీ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిబ్రవరిలో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

మరో వైపు బాలీవుడ్ కిస్సుల కింగ్ ఇమ్రాన్ హష్మి కూడా తన తాజా సినిమా 'Ek Thi Daayan' చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా 'బిగ్ బాస్-6' ఫైనల్స్‌కు అతిథిగా విచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని విశాల్ భరద్వాజ్, ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X