Bigg Boss Nominations: ఆరో వారం నామినేషన్స్ లీక్.. ముఖంపై కొట్టి మరీ.. మళ్లీ 8 మంది నామినేట్
తెలుగులోకి ఎన్నో అనుమానాల నడుమ పరిచయమై.. ఎవరూ ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో స్పందనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. పాశ్చాత్య నాగరికతకు అద్దం పట్టే కాన్సెప్టుతో నడిచే ఈ కార్యక్రమానికి మన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా నిర్వహకులు సీజన్లను క్రమం తప్పకుండా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో దాన్ని మొదలు పెట్టారు. ఇక, ఈ సీజన్ ఆరో వారం నామినేషన్స్ లిస్ట్ తాజాగా లీకైంది. ఇందులో ఎవరున్నారో మీరే చూడండి!

అంతా కొత్తగానే.. రేటింగ్ చెత్తగా
బిగ్ బాస్ షో తెలుగులో క్రమం తప్పుకుండా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌తో తీసుకు వచ్చారు. ఫలితంగా ఈ సీజన్ కొత్త కాన్సెప్టులతో సాగుతోంది. కానీ, ఈ సీజన్‌కు గతంలో వచ్చినట్లుగా ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం దక్కట్లేదు. దీంతో ఈ సీజన్ రేటింగ్ చెత్తగా వస్తుంది.

21 మంది... 5 గురు ఎలిమినేట్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటిలు ఎలిమినేట్ అయిపోయారు.

నామినేషన్స్‌పైన మరింత శ్రద్ద
సోమవారం బిగ్ బాస్ షోలో జరిగే ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్కును చూపిస్తారు. అయితే, ఆరో సీజన్ మొదటి వారంలో మాత్రం దీన్ని బుధవారం నిర్వహించారు. కానీ, దానిపై ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో నిర్వహకులు మరోసారి పాత పద్దతినే వాడుతున్నారు. ఇందులో భాగంగానే రెండో వారం నుంచి నామినేషన్స్ ప్రక్రియను సోమవారమే నిర్వహిస్తూ కొత్తగా చూపిస్తున్నారు.

ఆరో వారం.. ముఖానికి రాసేస్తూ
బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను గతంలో మాదిరిగానే నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రతి కంటెస్టెంట్.. సరైన కారణాన్ని చెప్పి నామినేట్ చేసే కంటెస్టెంట్ ముఖంపై తెలుపు రంగు క్రీమును పూయాల్సి ఉంటుంది. కెప్టెన్ అయిన కారణంగా రేవంత్‌ను నామినేట్ చేసే అవకాశం లేదు.

వాళ్ల మధ్య గొడవలతో రచ్చగా
సాధారణంగానే నామినేషన్స్ టాస్కులో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా రేవంత్‌తో సుదీప, బాలాదిత్య వాదనకు దిగినట్లు తెలిసింది. అలాగే, మరికొందరు సభ్యులు కూడా నామినేట్ చేశారన్న కోపంతో గొడవలు పెట్టుకున్నారట.

ఆరో వారం 8 మంది నామినేట్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసినట్లు తెలిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మరోసారి ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అందులో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్, సుదీప పింకీ, కీర్తి భట్, శ్రీహాన్, గీతూ రాయల్‌లు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.

ఆమె టార్గెట్.. మరోసారి బిగ్ షాక్
తాజా సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరిద్దరు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తున్నారు. మరికొందరు మాత్రం ఆరంభంలోనే పాపులర్ అయ్యారు. అందులో ఇనాయా సుల్తానా ఒకరు. దూకుడైన వ్యవహారంతో ఫేమస్ అయిన ఈ భామను.. మరోసారి చాలా మంది టార్గెట్ చేశారట. దీంతో ఇనాయా మళ్లీ నామినేట్ అయిందని టాక్.


Click it and Unblock the Notifications











