Bigg Boss Nominations: 5వ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే.. 8 మందికి షాక్.. అతడు తప్పించుకున్నాడుగా!

గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో రన్ అవుతోన్నా.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుని.. భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుంటోంది బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే ఇది రికార్డు స్థాయి రేటింగ్‌ను రాబడుతోంది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని కూడా ప్రసారం చేస్తున్నారు. ఇందులో ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్ లిస్ట్ తాజాగా లీకైంది. మరి అందులో ఎవరెవరు ఉన్నారో మీరే చూసేయండి మరి!

కొత్త కంటెంట్.. రేటింగ్ మాత్రం

కొత్త కంటెంట్.. రేటింగ్ మాత్రం

తెలుగులో బిగ్ బాస్ ‌షో ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌తో ప్రసారం చేస్తున్నారు. దీంతో ఇది మరింత కొత్తగా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతోంది. కానీ, ఈ సీజన్‌కు గతంలో వాటికి మాదిరిగా రేటింగ్ మాత్రం స్పందన మాత్రం దక్కట్లేదు. దీంతో రేటింగ్ క్రమంగా పడిపోతోంది.

21 మంది.. నలుగురు బయటకు

21 మంది.. నలుగురు బయటకు

ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి ప్రవేశించారు. వీరిలో మూడు వారాల్లో షానీ, అభినయ, నేహా, ఆరోహి ఎలిమినేట్ అయ్యారు.

అతడు ప్రతివారం ఉడాల్సిందే

అతడు ప్రతివారం ఉడాల్సిందే

నాలుగో వారం మొత్తంలో జరిగిన టాస్కుల్లో చక్కగా ఆడని కంటెస్టెంట్లకు శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున క్లాస్ పీకిన విషయం తెలిసిందే. అంతేకాదు, అందులో నుంచి చలాకీ చంటి ఈ సీజన్ మొత్తంలో కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం లేదని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అతడు ప్రతివారం నామినేషన్స్‌లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే.

టాస్కులు మరింత ఆసక్తికరంగా

టాస్కులు మరింత ఆసక్తికరంగా

బిగ్ బాస్ షోలో సోమవారం జరిగే ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్కును చూపిస్తారు. అయితే, ఆరో సీజన్ మొదటి వారంలో మాత్రం దీన్ని బుధవారం నిర్వహించారు. అయితే, ఇప్పుడు నిర్వహకులు మరోసారి పాత పద్దతినే వాడుతున్నారు. ఇందులో భాగంగానే రెండో వారం నుంచి నామినేషన్స్ ప్రక్రియను సోమవారమే నిర్వహిస్తూ కొత్త కొత్త టాస్కులు తీసుకు వస్తున్నారు.

వాళ్ల మధ్య గొడవలతో జరిగింది

వాళ్ల మధ్య గొడవలతో జరిగింది

బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను మరో కొత్త పద్దతిలో నిర్వహించారని తెలిసింది. ఇందులో కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. అయితే, గీతూ - చంటి మధ్య యుద్ధం ఉంటుందని అనుకున్నా.. అలా ఏమీ జరగలేదని అంటున్నారు. కానీ, వేరే కంటెస్టెంట్లు గొడవలు పెట్టుకున్నారట.

ఐదో వారం 8 మంది నామినేట్

ఐదో వారం 8 మంది నామినేట్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని ఐదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అందులో ఇనాయా సుల్తానా, మెరీనా అండ్ రోహిత్, బాలాదిత్య, చలాకీ చంటి, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.

అతడికి మాత్రం ఈసారి సేఫ్‌గా

అతడికి మాత్రం ఈసారి సేఫ్‌గా

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరిద్దరు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌‌గా నిలుస్తున్నారు. వారిలో సింగర్ రేవంత్ ఒకడు. బయట భారీ ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రిటీ కావడంతో అందరూ అతడినే టార్గెట్ చేస్తున్నారు. దీంతో ప్రతివారం నామినేట్ అవుతున్నాడు. కానీ, ఈ సారి మాత్రం రేవంత్ తప్పించుకున్నాడని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X