Bigg Boss Elimination: ఓటింగ్‌లో సంచలనం.. డేంజర్ జోన్‌లోకి టాప్ ప్లేయర్.. ఆమె కోసం ప్లానింగా!

అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో చాలా తక్కువ సమయంలోనే సూపర్ హిట్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ మజాను పంచుతోన్న ఈ షో.. ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇది చివరి దశకు చేరడంతో మరింత రంజుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరో సీజన్ 14వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ట్విస్ట్ కనిపించినట్లు తెలిసింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

కొత్త కొత్తగా.. ఇప్పుడు బెటర్‌గా

కొత్త కొత్తగా.. ఇప్పుడు బెటర్‌గా

ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ భారీ స్థాయిలో ఆదరణను సొంతం చేసుకోవడంతో ఆరో దానిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. కానీ, దీనికి ఆరంభంలో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. అయితే, ఇప్పుడీ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో మరింత రంజుగా మారుతోంది. ఇందులో కొత్త కొత్త టాస్కులు ఇస్తూ ఆసక్తిని పెంచుతున్నారు. దీంతో రేటింగ్ కొద్దికొద్దిగా పెరుగుతోంది.

మొత్తం 14 మంది బయటకు

మొత్తం 14 మంది బయటకు

తాజా సీజన్‌లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, మొదటి వారం ఎలిమినేషన్ తీసేసినా.. రెండు, పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇలా ఇప్పటికి 13 వారాలకు 14 మంది వెళ్లారు. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనా, రాజ్‌, ఫైమాలు బయటకు వెళ్లిపోయారు.

అతడు తప్ప లిస్ట్‌లో అంతా

అతడు తప్ప లిస్ట్‌లో అంతా

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పుడు పద్నాలుగో వారం నడుస్తోంది. కాబట్టి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు అర్హులే ప్రేక్షకులే నిర్ణయిస్తారన్న బిగ్ బాస్.. అందరినీ నామినేట్ చేసేశాడు. అయితే, టికెట్ టు ఫినాలే టాస్కు గెలిచిన శ్రీహాన్‌ తప్ప హౌస్‌లో ఉన్న వాళ్లందరూ అంటే రేవంత్, ఆది రెడ్డి, కీర్తి భట్, ఇనాయా సుల్తానా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు ఈ వారం నేరుగా నామినేట్ అయ్యారు.

ఓటింగ్‌లో ఎన్నో మార్పులు

ఓటింగ్‌లో ఎన్నో మార్పులు

బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీరి నుంచి నలుగురిని టాప్ 5కి చేర్చుతారు. ఇందుకోసం ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్లను ఫినాలేకు పంపేందుకు పోటీ పడుతున్నారు. దీంతో రెండు రోజుల్లోనూ ఊహించని ఓటింగ్ జరిగింది. ఫలితంగా కంటెస్టెంట్ల స్థానాల్లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి.

ఆరంభం నుంచీ టాప్‌లోనే

ఆరంభం నుంచీ టాప్‌లోనే

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లోకి బడా సెలెబ్రిటీలు కూడా వచ్చారు. అయితే, అందులో సింగర్ రేవంత్ మాత్రం టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటున్నాడు. అందుకే పద్నాలుగో వారం కూడా రేవంత్‌కే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నట్లు తాజాగా తెలిసింది. అతడు ఒక్కడికే దాదాపు 28 శాతానికి పైగా ఓటింగ్ నమోదు అవుతున్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.

ఇనాయా పైకి.. వాళ్లందరూ

ఇనాయా పైకి.. వాళ్లందరూ


ఆరో సీజన్ పద్నాలుగో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి సింగర్ రేవంత్ మొదటి స్థానంలోనే ఉన్నాడు. అతడి తర్వాత వరుసగా రెండో స్థానంలో రోహిత్ సాహ్నీ కొనసాగుతున్నాడని తెలిసింది. ఇక, మొదటి రోజు చివర్లో ఉన్న ఇనాయా ఇప్పుడు మూడో స్థానానికి చేరిపోయిందని సమాచారం. అదే సమయంలో శ్రీ సత్య చివరి నుంచి నాలుగో స్థానానికి ఎగబాకిందని టాక్.

డేంజర్ జోన్‌లోకి ఆది రెడ్డి

డేంజర్ జోన్‌లోకి ఆది రెడ్డి

బిగ్ బాస్ ఆరో సీజన్ పద్నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్‌‌లో ప్రస్తుతం కీర్తి భట్ ఐదో స్థానంలో ఉండగా, ఆది రెడ్డి ఏకంగా ఆరో స్థానానికి పడిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంటే ఇదే కంటిన్యూ అయితే అతడు కూడా ఈ వారం వెళ్లిపోయే అవకాశం ఉంది. మరోవైపు, శ్రీ సత్యను సేఫ్ చేయడం కోసమే ఆది రెడ్డిని కిందకు పడేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X