Bigg Boss Elimination: బిగ్ ట్విస్టుతో ముగిసిన ఓటింగ్.. చంటి పరిస్థితి ఇది.. ఈసారి వెళ్లేది ఎవరంటే!

కొత్త కాన్సెప్టుతో వచ్చినా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని మరీ ప్రసారం అవుతోన్న ఏకైక షో బిగ్ బాస్. బుల్లితెరపై అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ రకరకాల ఎమోషన్స్‌ను చూపిస్తూ సాగిపోతోందీ షో. అందుకే తెలుగులో ఇది ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి అన్నట్లు రెస్పాన్స్‌ను అందుకుంటూ సూపర్ హిట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులో ఐదో వారం ఓటింగ్ ఎన్నో ట్విస్టులతో సాగింది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై పూర్తి వివరాలు మీ అందరి కోసం!

సరికొత్తగా.. రేటింగ్ రావట్లేదుగా

సరికొత్తగా.. రేటింగ్ రావట్లేదుగా


ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే బిగ్ బాస్ భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఆరో సీజన్‌ను కూడా ప్రయోగాత్మకంగా మొదలు పెట్టారు. ఇందులో ఆరంభం నుంచే గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను అందిస్తున్నారు. అయినప్పటికీ ఆదరణ మాత్రం అంతంత మాత్రంగానే వస్తూ రేటింగ్ రాబట్టేదు.

4 వారాల్లో నలుగురు బయటకు

4 వారాల్లో నలుగురు బయటకు


బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో 4 వారాల్లో షానీ, అభినయ, నేహా, ఆరోహిలు వెళ్లిపోయారు.

5వ వారం 8 మంది నామినేషన్

5వ వారం 8 మంది నామినేషన్


బిగ్ బాస్ ఆరో సీజన్ ఆరంభం నుంచే అనుకున్న దానికంటే చప్పగా సాగుతోంది. మరీ ముఖ్యంగా నామినేషన్స్ సమయంలోనూ ఇందులో గొడవలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఐదో వారం మరింత నీరసంగా సాగింది. ఇక, ఈ వారంలో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు నామినేట్ అయ్యారు.

మొదటిసారి చాలా ట్విస్టులతో

మొదటిసారి చాలా ట్విస్టులతో


బిగ్ బాస్ ఆరో సీజన్‌లో నాలుగు వారాల్లో నలుగురు బయటకు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన వారాల్లో ఓటింగ్‌ ఏకపక్షంగానే సాగింది. అయితే, ఐదో వారంలో మాత్రం పోలింగ్‌ చిత్ర విచిత్రంగా ఎన్నో మలుపులతో నడిచింది. దీంతో ఆరంభంలో డేంజర్‌ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు సేఫ్ అవగా.. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న వాళ్లు డేంజర్ జోన్‌లోకి వచ్చినట్లుగా పరిస్థితులు కనిపించాయి.

 టాప్ 2లో లేడీస్.. పోటాపోటీగా

టాప్ 2లో లేడీస్.. పోటాపోటీగా


బిగ్ బాస్ ఆరో సీజన్ ఐదో వారంలో రేవంత్, గీతూ వంటి టాప్ ప్లేయర్స్ నామినేషన్స్‌లోకి రాలేదు. దీంతో ఉన్న వారిలోనే మంచిగా ఆడే కంటెస్టెంట్లకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అందులో జబర్ధస్త్ ఫైమా, ఇనాయా సుల్తానా మధ్య పోటీపోటీగా ఓటింగ్ జరిగిందట. అయితే, పోలింగ్ ముగిసే సమయానికి ఫైమా టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఆమెకు కొన్ని ఓట్ల దూరంలోనే ఇనాయా ఉంది.

ఈసారి వీళ్లు సేఫ్ అయినట్లేగా

ఈసారి వీళ్లు సేఫ్ అయినట్లేగా


ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్‌ చివరి రోజు మరింత ఆసక్తికరంగా సాగిందని తెలిసింది. దీంతో మొన్నటి వరకూ సేఫ్ అనుకున్న కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వచ్చేశారట. ఇక, ఓటింగ్ ముగిసే సమయానికి అర్జున్ కల్యాణ్ మూడో స్థానంలో, వాసంతి నాలుగో స్థానంలో, నిన్నటి వరకూ చివర్లో ఉన్న చలాకీ చంటి ఐదో స్థానానికి వచ్చాడని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.

 ఈ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్

ఈ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్


ఆరో సీజన్ ఐదో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో బాలాదిత్య ఆరో స్థానానికి చేరుకున్నాడట. దీంతో ఊహించని విధంగా ఆది రెడ్డి ఏడో స్థానానికి పడిపోయాడని తెలిసింది. ఇక, ఇందులో మెరీనా అబ్రహం ఎనిమిదో స్థానంలో ఉందట. అంటే ఈ వారంలో చివరి స్థానాల్లో ఉన్న వీళ్లిద్దరిలోనే ఒకరు షో నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X