For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Vote: 4వ వారం షాకింగ్ ఓటింగ్.. ఒక్క ఎపిసోడ్‌కే ఆమె సంచలనం.. ఆ జంటకు మాత్రం బిగ్ షాక్

  |

  తెలుగు బుల్లితెరపై రకరకాల కాస్సెప్టులతో షోలు ప్రసారం అవుతున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి భారీ స్పందన దక్కింది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో వారం ఓటింగ్ ఎలా నడుస్తుందో చూద్దాం పదండి!

  మరింత వినోదాన్ని పంచాలని ప్లాన్

  మరింత వినోదాన్ని పంచాలని ప్లాన్

  బిగ్ బాస్ షోలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తుంటాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, గ్రూపులు, రొమాన్స్, లవ్‌తో పాటు బాధలు ఇలా అన్ని రకాల సన్నివేశాలను చూపిస్తుంటారు. ఇక, ఇప్పుడు జరుగుతోన్న ఆరో సీజన్‌లో వాటిని ఇంకాస్త ఎక్కువగా చూపిస్తున్నారు. కానీ, గతంలో మాదిరిగా ఈ సీజన్‌కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదు. దీంతో రేటింగ్ పడిపోతోంది.

  జాకెట్ లేకుండా శిల్పా చక్రవర్తి: అప్పటి స్టార్ యాంకర్.. ఇప్పుడిలా చేసిందేంటి!

  21 మంది రాక... ముగ్గురు బయటకు

  21 మంది రాక... ముగ్గురు బయటకు

  తాజా సీజన్‌లోకి కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో మూడు వారాల్లో షానీ, అభినయ, నేహా బయటకు వెళ్లారు.

  తొలిసారి నాగార్జున అలా చేశాడుగా

  తొలిసారి నాగార్జున అలా చేశాడుగా

  సాధారణంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల ద్వారానే నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇంటి సభ్యులు మాత్రమే మిగిలిన వాళ్లను నామినేట్ చేస్తూ ఉంటారు. కానీ, షో చరిత్రలోనే తొలిసారి గత వారం సరిగా పెర్ఫార్మ్ చేయని కంటెస్టెంట్లకు హోస్ట్ నాగార్జున ఓటింగ్ నిర్వహించాడు. అందులో అర్జున్ కల్యాణ్, కీర్తీ భట్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో వాళ్లను నేరుగా నామినేట్ చేసేశాడు.

  ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

  ఈ వారం మొత్తం ఎంత మందంటే

  ఈ వారం మొత్తం ఎంత మందంటే

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తంగా పది మంది నామినేట్ అయ్యారు. అందులో ఇద్దరు కీర్తి భట్, అర్జున్ కల్యాణ్‌ను నాగార్జున నామినేట్ చేయగా.. ఇనాయా, శ్రీహాన్, ఆరోహి, రేవంత్, గీతూ, సుదీప, రాజ్‌, సూర్యలను కంటెస్టెంట్లు నామినేట్ చేశారు. దీంతో ఈ వారం మొత్తం పది మంది ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చారు.

  షాకింగ్ ఓటింగ్.. ఆమెకు భారీ ఓట్లు

  షాకింగ్ ఓటింగ్.. ఆమెకు భారీ ఓట్లు


  నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ షాకింగ్‌గా సాగుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్‌లో రేవంత్ కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో మాత్రం ఊహించని విధంగా ఇనాయా సుల్తానా వచ్చిందట. నామినేషన్స్‌లో అందరూ ఆమెను టార్గెట్ చేయడం వల్లే ఓట్లు ఎక్కువగా వస్తున్నాయని తెలిసింది.

  స్లీవ్‌లెస్ టాప్‌లో శివాత్మక రాజశేఖర్: మైండ్‌బ్లాక్ చేసే ఫోజులతో రచ్చ

  మిగిలిన కంటెస్టెంట్ల స్థానాలు ఇవే

  మిగిలిన కంటెస్టెంట్ల స్థానాలు ఇవే


  నాలుగో వారం ఓటింగ్‌లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ శ్రీహాన్ మూడో స్థానానికి పడిపోయాడని తెలిసింది. ఇక, ఈ టాప్ 3 తర్వాత మిగిలిన స్థానాల్లో మాత్రం చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే నాలుగో స్థానంలో గీతూ, ఐదో స్థానంలో రాజ్, ఆరో స్థానంలో కీర్తి భట్, ఏడో స్థానంలో అర్జున్ కల్యాణ్ ఉన్నారని తెలిసింది. కానీ, ఈ ప్లేసులు మారే అవకాశం కనిపిస్తుంది.

  ప్రేమజంటకు ప్రేక్షకులు బిగ్ షాక్

  ప్రేమజంటకు ప్రేక్షకులు బిగ్ షాక్

  ఆరో సీజన్ నాలుగో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ప్రేమజంట ఆర్జే సూర్య, ఆరోహి రావులు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు సుదీపకు కూడా తక్కువ ఓట్లు వస్తున్నాయని అంటున్నారు. అయితే, ఈ ముగ్గురిలో సూర్య కచ్చితంగా ఎలిమినేట్ కాడు కాబట్టి.. ఈ వారం ఆరోహి రావు లేదా సుదీపలో ఒకరు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని టాక్.

  English summary
  Bigg Boss Telugu 6th Season Running Successfully. Arohi Rao and Sudeepa Pinky Gets Very Less Votes in 4th Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X