Bigg Boss Elimination: చివరి రోజు మారిన ఓటింగ్.. డేంజర్ జోన్‌లోకి మోడల్.. ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

బిగ్ బాస్... తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని రియాలిటీ షో ఇది. అంతలా దీన్ని ఓన్ చేసేసుకున్నారు మన ఆడియెన్స్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ డూపర్ హిట్ చేసేశారు. అందుకే ఈ షో తెలుగులో ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులో నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ముగిసింది. మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దామా!

ప్రయోగాలు చేసినా ఫలితం లేదు

ప్రయోగాలు చేసినా ఫలితం లేదు

గత సీజన్ల కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని చెప్పినట్లుగానే.. బిగ్ బాస్ నిర్వహకులు ఆరో సీజన్‌ను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆరంభంలోనే అదిరిపోయే టాస్కులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. అయినప్పటికీ ఈ సీజన్‌కు స్పందన కరువై రేటింగ్ అంతగా దక్కడం లేదు.

3 వారాలు.. ముగ్గురు ఎలిమినేషన్

3 వారాలు.. ముగ్గురు ఎలిమినేషన్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మూడు వారాల్లో షానీ, అభినయ, నేహాలు ఎలిమినేట్ అయ్యారు.

4వ వారంలో 10 మంది నామినేట్

4వ వారంలో 10 మంది నామినేట్

తాజా సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తంగా పది మంది నామినేట్ అయ్యారు. అందులో ఇద్దరు కీర్తి భట్, అర్జున్ కల్యాణ్‌ను నాగార్జున నామినేట్ చేయగా.. ఇనాయా, శ్రీహాన్, ఆరోహి, రేవంత్, గీతూ, సుదీప, రాజ్‌, సూర్యలను ఇంట్లోని కంటెస్టెంట్లు నామినేట్ చేశారు. దీంతో ఈ వారం మొత్తం పది మందిపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది.

అలా మారుతూనే వచ్చిన ఓటింగ్

అలా మారుతూనే వచ్చిన ఓటింగ్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఎలిమినేషన్స్ ఆశించిన రీతిలో జరగడం లేదు. ఇందులో ఇప్పటి వరకూ ఎలిమినేట్ అయిన వాళ్లు ఆట మంచిగా ఆడినా ఓట్లు తెచ్చుకోలేకపోయారు. దీంతో నాలుగో ఎలిమినేషన్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటింగ్ ఎన్నో మలుపులతో సాగుతూ వచ్చింది. దీంతో కంటెస్టెంట్ల స్థానాలు తరచూ మారుతూ వచ్చినట్లు టాక్ వినిపించింది.

అతడే టాప్.. ఆమె రెండో స్థానమే

అతడే టాప్.. ఆమె రెండో స్థానమే

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ చాలా ట్విస్టులతో ముగిసింది. షో వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న రేవంత్‌ మధ్యలో రెండో స్థానానికి పడిపోయినా.. చివరికి టాప్‌కు చేరుకున్నాడు. అతడి తర్వాతి స్థానంలో అనూహ్యంగా కీర్తి భట్‌ నిలిచింది. వీళ్లిద్దరికే దాదాపు 60 శాతం ఓటింగ్ నమోదైందని టాక్.

తర్వాతి స్థానాల్లో ఎవరు ఉన్నారు

తర్వాతి స్థానాల్లో ఎవరు ఉన్నారు

నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో మొదటి నాలుగు స్థానాల్లోనే ఎక్కువగా మార్పులు కనిపించాయి. పోలింగ్ ముగిసే సమయానికి శ్రీహాన్ మూడో స్థానంలో, ఇనాయా సుల్తానా నాలుగో స్థానంలో, సూర్య ఐదో స్థానంలో, అర్జున్ కల్యాణ్ ఆరో స్థానంలో గీతూ రాయల్ ఏడో స్థానంలో నిలిచారని తెలిసింది. ఈ కంటెస్టెంట్లు అందరూ ఈ వారానికి సేఫ్ అయినట్లే అని సమాచారం.

ఆ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్?

ఆ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్?

బిగ్ బాస్ ఆరో సీజన్ నాలుగో వారానికి సంబంధించి జరిగిన ఓటింగ్‌లో రాజశేఖర్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడట తెలిసింది. అలాగే, ఆరోహి రావు తొమ్మిదో స్థానంలో ఉండగా.. సుదీప పదో స్థానానికి పడిపోయినట్లు సమాచారం. అనధికారిక పోల్స్‌లో కూడా దాదాపుగా ఇదే ఫలితం కనిపిస్తోంది. అంటే.. రాజ్ సేఫ్ అయినా ఆరోహి, సుదీపలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X