Bigg Boss Elimination: ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. టాప్‌లో బోల్డ్ లేడీ.. ప్రమాదంలో ఇద్దరు స్టార్లు

చాలా అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులందరి దృష్టినీ ఆకర్షించి.. భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక షో బిగ్ బాస్. కొత్త కాన్సెప్టే అయినా ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు ఇస్తూ, బోల్డు కంటెంట్‌ను ప్రసారం చేస్తూ ఈ షోను నిర్వహకులు మరింత సక్సెస్ చేశారు. దీంతో ఇది ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందో చూద్దాం పదండి!

ప్రయోగాలు.. ఫలితం లేదుగా

ప్రయోగాలు.. ఫలితం లేదుగా


తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. అందుకే నిర్వహకులు వరుసగా సీజన్లను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్‌ను ఎన్నో అంచనాల నడుమ మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని టాస్కులు ఇస్తూ కొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. కానీ, ఎందుకనో ఈ సీజన్‌కు స్పందన రావట్లేదు. దీంతో రేటింగ్ కూడా దక్కట్లేదు.

4 వారాలు.. ఆ నలుగురు ఔట్

4 వారాలు.. ఆ నలుగురు ఔట్

తాజా సీజన్‌లోకి కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో 4 వారాల్లో షానీ, అభినయ, నేహా, ఆరోహి వెళ్లిపోయారు.

5వ వారం 8 మంది నామినేట్

5వ వారం 8 మంది నామినేట్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఐదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ మాత్రం పెద్దగా గొడవలు లేకుండానే సాగింది. ఇందులో త్యాగాలు, ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా కనిపించాయి. ఇలా ఈ ప్రక్రియలో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. అందులో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నారు.

ఓటింగ్‌లో ట్విస్ట్.. మార్పులు

ఓటింగ్‌లో ట్విస్ట్.. మార్పులు

గతంలో మాదిరిగానే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో సైతం ఎలిమినేషన్స్ అన్నీ ఊహించని విధంగానే సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో వారంలో ఓటింగ్ కూడా చాలా ఆసక్తికరంగా సాగుతోందని తెలిసింది. మరీ ముఖ్యంగా ఈ వారం జరుగుతోన్న ఓటింగ్‌లో ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి. దీంతో కంటెస్టెంట్ల స్థానాలు తరచుగా మారుతూనే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

టాప్‌ ప్లేస్‌లో బోల్డు బ్యూటీనే

టాప్‌ ప్లేస్‌లో బోల్డు బ్యూటీనే

ఆరో సీజన్‌లో ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్ చిత్ర విచిత్రంగా సాగుతోందని అంటున్నారు. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో టైటిల్ ఫేవరెట్లు పెద్దగా లేరు కాబట్టి ఆరంభం నుంచీ ఇనాయా సుల్తానానే టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోందట. ఆమె తర్వాతి స్థానంలో మార్పులు వస్తున్నాయని తెలిసింది. అయితే, ఇప్పుడు మాత్రం ఫైమా రెండో స్థానంలో ఉందట.

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు

ఇనాయా సుల్తానా, ఫైమా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతోన్నప్పటికీ.. మిగిలిన వాళ్ల స్థానాలు మాత్రం మారుతూనే ఉన్నాయని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ప్రస్తుతం మాత్రం మెరినా అబ్రహం మూడో స్థానంలో, అర్జున్ కల్యాణ్ నాలుగో స్థానంలో, ఆది రెడ్డి ఐదో స్థానంలో ఉన్నారని సమాచారం. అంటే మార్పులు లేకుంటే వీళ్లంతా ఈ వారం సేఫ్ అవుతారని టాక్.

ప్రమాదంలో ఇద్దరు టాపర్లు

ప్రమాదంలో ఇద్దరు టాపర్లు

బిగ్ బాస్ ఆరో సీజన్ ఐదో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ప్రస్తుతం వాసంతి కృష్ణన్ ఆరో స్థానంలో ఉందని తెలిసింది. దీంతో టాప్ ప్లేయర్లుగా బరిలోకి దిగిన చలాకీ చంటి ఏడో స్థానంలో, బాలాదిత్య ఎనిమిదో స్థానంలో ఉన్నారని సమాచారం. ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే మాత్రం వీళ్లిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావించాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X