Bigg Boss Elimination: ఒక్కసారిగా మారిన ఓటింగ్.. చివరికి పడిపోయిన నటి.. ఈ వారం ఆమె ఎలిమినేట్!
చూడ్డానికి పాశ్చత్య సంస్కృతికి అద్దం పట్టే షోనే అయినా.. తెలుగు ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ను అందుకుని ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్‌ను అందుకుంది బిగ్ బాస్. గతంలో ఇలాంటి షో ఎప్పుడూ రాకపోయినా ఆడియెన్స్ మాత్రం దీన్ని త్వరగానే వంటబట్టించుకున్నారు. ఫలితంగా ఈ రియాలిటీ షో కొన్ని సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఆరోది కూడా ఇటీవలే ప్రారంభం అయింది. ఇందులో ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎవరి పొజిషన్ ఏంటో తెలుసుకుందాం పదండి!

మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో
బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు వచ్చినా సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. అందుకు తగ్గట్లుగానే దీనిపై అంచనాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మొదలైన ఆరో సీజన్ కూడా మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే కొత్త కంటెంట్ చూపిస్తున్నారు. కానీ, దీనికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావట్లేదు.

4 వారాల్లో వాళ్లంతా ఎలిమినేట్
ఆరో సీజన్‌లోకి కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో 4 వారాల్లో షానీ, అభినయ, నేహా, ఆరోహి ఎలిమినేట్ అయిపోయారు.

ఈ వారం 8 మంది నామినేషన్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఐదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గొడవలు లేకుండా చాలా భిన్నంగా సాగింది. ఇలా ఈ టాస్కులో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. అందులో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నారు. వరుసగా 4 వారాలు నామినేట్ అయిన రేవంత్ సేఫ్ అయ్యాడు.

ట్విస్టులతో.. ఒక్కసారిగా ఛేంజ్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ నాలుగు ఎలిమినేషన్స్ జరిగాయి. అందులో ఫాలోయింగ్ తక్కువ ఉన్న కంటెస్టెంట్లే ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఐదో వారంలో మాత్రం ఓటింగ్ చాలా భిన్నంగా సాగుతోంది. ఈ వారంలో ప్రతి రోజూ ఓటింగ్ సరళి మారుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి పోలింగ్ మారింది. దీంతో అన్ని స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

టాప్ ప్లేస్ ఛేంజ్... తేడా లేదు
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్ ఒక్కసారిగా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం.. నిన్నటి వరకూ టాప్‌లో ఉన్న ఇనాయా సుల్తానా ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయిందట. ఆమె ప్లేస్‌లోకి జబర్ధస్త్ ఫైమా వచ్చిందని తెలిసింది. అయితే, వీళ్లిద్దరి మధ్య తేడా ఎంతో లేదని కూడా అంటున్నారు. కాబట్టి వారంతానికి మళ్లీ ఈ ప్లేస్ మారే ఛాన్స్ ఉంది.

మిగిలిన కంటెస్టెంట్ల పరిస్థితి
ఐదో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో మార్పు కనిపిస్తుండడంతో కంటెస్టెంట్ల స్థానాలు కూడా క్రమంగా మారుతున్నాయి. దీంతో ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో చెప్పడం కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే అర్జున్ కల్యాణ్ మూడో స్థానంలో, ఆది రెడ్డి నాలుగో స్థానంలో, నిన్నటి వరకూ చివర్లో ఉన్న చలాకీ చంటి ఐదో స్థానానికి వచ్చాడని తెలిసింది.

ఆమె చివరికి.. వెళ్లక తప్పదా!
ఆరో సీజన్ ఐదో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ప్రస్తుతం వాసంతి కృష్ణన్ ఆరో స్థానంలో ఉందని అంటున్నారు. అలాగే, బాలాదిత్య ఒక స్థానం మెరుగు పరుచుకుని ఏడో స్థానానికి వచ్చాడని తెలిసింది. అయితే, ఊహించని విధంగా మెరీనా అబ్రహం ఇప్పుడు చివరి స్థానానికి పడిపోయిందట. అంటే ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











