Bigg Boss 6 Telugu: హౌస్ లోకి రాబోయే ఫైనల్ లిస్ట్.. బజ్ లో నాన్ స్టాప్ యాంకర్!

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 6వ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ఓ వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రత్యేకంగా ఉండాలి అని ఇప్పటికే నిర్వాహకులు పూర్తిస్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇక దాదాపు కంటెస్టెంట్స్ లిస్టు కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 18 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నాన్ స్టాప్ సీజన్లో మెరిసిన ఒక యాంకర్ కు ఈసారి స్పెషల్ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

ఎందుకు అలస్యమయ్యిందంటే?

ఎందుకు అలస్యమయ్యిందంటే?

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ను గత రెండు నెలల క్రితం మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ సరైన ప్రణాళిక సిద్ధం కాకపోవడం అలాగే అనుకున్న సెలబ్రిటీల అందుబాటులో లేకపోవడంతో బిగ్ బాస్ నిర్వాకులు ఆ ప్రణాళికను మార్చుకోవాల్సి వచ్చింది. ఇక మొత్తానికి వచ్చే నెలలో ఈ కాంట్రవర్సీస్ షోను భారీ స్థాయిలోనే మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం నాగార్జున కూడా ప్రత్యేకంగా మరోసారి హోస్టుగా సిద్ధమవుతున్నారు.

 మొత్తం కంటెస్టెంట్స్ ఎంతమంది?

మొత్తం కంటెస్టెంట్స్ ఎంతమంది?

ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోయే వారి సంఖ్య 20 కంటే ఎక్కువగానే ఉంటుంది అనే కామెంట్స్ అయితే చాలానే వినిపిస్తున్నాయి. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం అయితే 18 మందిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఒక వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. దాదాపు 22 వారాలు పాటు షో కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

రాబోయేది వీళ్లేనా?

రాబోయేది వీళ్లేనా?

ఇక ప్రస్తుతం అయితే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోయే వారి పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే.. మొదట ఉదయభాను, జబర్దస్త్ అప్పారావు, సింగర్ రేవంత్, నేహా చౌదరి, యాంకర్ ప్రత్యూష, సింగర్ మోహన భోగరాజు, అర్జున్ కళ్యాణ్ ఇలా ప్రముఖ సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

18 మందిలో..

18 మందిలో..

అలాగే మరొక లిస్టులోకి వెళ్తే దీపికాపిళ్ళై, రివ్యూవర్ ఆదిరెడ్డి, చలాకీ చంటి, నేహా చౌదరి, RJ సూర్య, గీతు రాయల్, శ్రీ సత్య, పాండు మాస్టర్ వంటి వారు కూడా హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లిస్టు దాదాపు ఫైనల్ అయినట్లే అని సమాచారం. మొత్తం 18 మందిలో దాదాపు 15 మంది ఫిక్స్ అయ్యారు అని మంచి డీల్ కూడా సెట్ అయినట్లుగా తెలుస్తోంది.

 రెండు వైల్డ్ కార్డులు

రెండు వైల్డ్ కార్డులు

గతంలో అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మంచి గుర్తింపు అందుకున్న వారు ఈసారి 6వ సీజన్లో కూడా కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోయే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజం అనేది షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే. అంతే కాకుండా ఈసారి రెండు ప్రత్యేకమైన వైల్డ్ కార్డులు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సెలబ్రిటీలు చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారని సమాచారం.

 యాంకర్ శివకు ఛాన్స్

యాంకర్ శివకు ఛాన్స్

ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న యాంకర్ శివకు బిగ్ బాస్ 6వ సీజన్లో ఒక మంచి బాధ్యతను అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ బజ్ హోస్ట్ బాధ్యతలను యాంకర్ శివ తీసుకుపోతున్నట్లు సమాచారం. గత సీజన్లో అరియానా తన హోస్టింగ్ తో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈసారి యాంకర్ శివ మంచి ఛాన్స్ అందుకుంటున్నాడు. మరి అతను ఎంతవరకు క్లిక్ అవుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X