Bigg Boss 6 Final list: బిగ్​బాస్​ హౌస్​ ఫైనల్​ లిస్ట్ ఇదే.. ఖరారైన సభ్యులు వీరే..

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియాలిటీ షోలలో ముందుటుంది బిగ్​బాస్​ షో. ఈ బిగ్​బాస్ షో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని చెప్పవచ్చు. మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్​గా వ్యవహరిస్తున్న బిగ్​బాస్​ ఆరో సీజన్ ఎప్పుడెప్పుడూ ప్రారంభం అవుతుందా అని తెలుగు ఆడియెన్స్​ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్​ 4వ తేది నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్​బాస్​ షోలో పార్టిస్​పేట్​ చేసే కంటెస్టెంట్స్​పై ఎంత క్యూరియాసిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఇదే ఫైనల్ లిస్ట్​ అంటూ కవ్వించాయి పలు వార్తలు. తాజాగా అసలైన ఫైనల్​ లిస్ట్​ ఇదే.. వీరే అందులో పార్టిస్​పేట్​ చేసే కంటెస్టెంట్స్​ అంటూ మరో లిస్ట్ వచ్చింది. అదేంటో చూసేద్దామా!

సోషల్​ మీడియా స్టార్స్​తోపాటు..

సోషల్​ మీడియా స్టార్స్​తోపాటు..

తెలుగులో బిగ్​ బాస్ ప్రారంభమై సూపర్ హిట్ సాధించింది. ఇక అప్పటి నుంచి ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లపై ఎప్పుడూ ఒక క్యూరియాసిటీ నెలకొంటుంది. సినీ సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా స్టార్లతోపాటు పలువురు కామన్ పీపుల్స్​ను బిగ్​బాస్ హౌజ్​లోకి పంపిస్తూ సూపర్​ ప్లే చేస్తాడు బిగ్​బాస్​. ఈ షోలో పాల్గొనే సభ్యుల నుంచి వారు గేమ్​లో ఆడే టాస్క్​లు, చివరిగా గెలిచే విజేత వరకూ ఎప్పుడు ఆసక్తిగానే సాగుతుంది.

ఇదే ఫైనల్ లిస్ట్​..

ఇదే ఫైనల్ లిస్ట్​..

ఈసారి కూడా పార్టిస్​పెంట్స్​ ఎవరనే అంశంతో ప్రారంభమైంది ఈ ఆసక్తి. అక అట్టహాసంగా ప్రారంభం కాబోయే బిగ్​బాస్​ సీజన్​ 6 కోసం సుమారు ఫైనల్ లిస్ట్​ రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇదివరకు కూడా ఇలానే చివరి లిస్ట్ ఇదేనని, వారిని క్వారంటైన్​లో ఉంచారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా అదేం కాదని, వీళ్లే అసలు కంటెస్టెంట్లని మరో జాబితా వచ్చింది.

19 మంది కంటెస్టెంట్లు..

19 మంది కంటెస్టెంట్లు..

ఇప్పటివరకు బిగ్​బాస్​ 6వ సీజన్​లో 18 మంది కంటెస్టెంట్లు కాదు 21 మంది అని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం వచ్చిన జాబితా ప్రకారం బిగ్​బాస్​ 6వ సీజన్​లో పాల్గొనబోయేది 19 మంది కంటెస్టెంట్లు అని తెలుస్తోంది. 16 మంది సెలబ్రిటీలతోపాటు ఇద్దరు కామన్​ వ్యక్తులకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం విడుదలైన ఈ లిస్ట్​ వైరల్​గా మారింది. ఇక ఈ బిగ్​బాస్​ ఆరో సీజన్​లోకి ఎవరెవరూ రాబోతున్నారనే వివరాల్లోకి వెళితే..

ఎక్కువగా వినిపించిన పేర్లే..

ఎక్కువగా వినిపించిన పేర్లే..

మొదటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న వారి పేర్లలో ఉన్న శ్రీ సత్య, శ్రీహాన్, గీతు రాయల్​, యాంకర్ నేహా చౌదరి, పాపులర్​ యూట్యూబర్​ ఆది రెడ్డి, టీవీ9 యాంకర్​ ఆరోహి , ఇనయ సుల్తానా పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ జాబితాలో నటుడు బాలాదిత్య, కమెడియన్​ చలాకీ చంటి, ఆర్జే సూర్య, యాంకర్​ అండ్ హీరోయిన్​ (వాంటెడ్​ పండుగాడ్​) వాసంతి, వెన్నెల ఫేమ్​ కమెడియన్​​ షాని సాల్మాన్ పేర్లు వినిపిస్తున్నాయి.

క్వారంటైన్​లో సభ్యులు..

క్వారంటైన్​లో సభ్యులు..

అలాగే వీరితోపాటు రియల్​ కపుల్స్​ అయిన సీరియల్​ నటీనటులు మెరిన్​ అండ్ రోహిత్, మోడల్​ అండ్​ శుక్ర మూవీ విలన్​ విశాల్​ రాజశేఖర్, నటి అభినయశ్రీ​, సింగర్ రేవంత్​తోపాటు మరో ఇద్దరు సామాన్యులు బిగ్​బాస్​ ఆరో సీజన్​లోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా వచ్చిన జాబితా ప్రకారం వీరంతా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్​ బంజారా హిల్స్​లోని హయత్ ప్లేస్​లో క్వారంటైన్​లో ఉన్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X