Bigg Boss 6 Final list: హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ వీరే.. చివరలో తప్పుకున్నది ఎవరంటే?

బిగ్ బాస్ 6వ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మరో కొన్ని రోజుల్లో అసలైన ఎంటర్టైన్మెంట్ మొదలు కాబోతోంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి బిగ్ బాస్ గ్రాండ్ గా స్టార్ట్ కానున్నట్లు ఇటీవల అఫీషియల్ గా క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మొత్తంగా ఈసారి బిగ్ బాస్ లో 21 మంది రాబోతున్నట్లు మరొక కొత్త లిస్టు వైరల్ గా మారుతొంది. ఆ వివరాల్లోకి వెళితే

చివరి నిమిషంలో..

చివరి నిమిషంలో..

అట్టహాసంగా మొదలు కాబోతున్న బిగ్ బాస్ 6వ సీజన్ కోసం దాదాపు ఫైనల్ లిస్ట్ రెడీ అయినట్లు సమాచారం. ఇక కొంతమందిని ఇప్పటికే క్వారంటైన్ లోకి కూడా పంపించారు. అయితే చివరి నిమిషంలో ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఉదయభాను కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే మరొక ప్రముఖ సింగర్ కూడా చివరి నిమిషంలో డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తం ఎంతమంది అంటే?

మొత్తం ఎంతమంది అంటే?

బిగ్ బాస్ 6వ సీజన్లో మొత్తంగా 18 మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ అయితే వినిపించింది. అందుకు సంబంధించిన పలు రకాల లిస్టులు కూడా వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం మొత్తం 21 మంది రాబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒక ఇద్దరు కామన్ క్యాటగిరీలో రాబోతున్నారు. ఈసారి ఎక్కువగా టెలివిజన్ సెలబ్రిటీలను హౌస్ లోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

పేర్లు వైరల్

పేర్లు వైరల్

ఇక బిగ్ బాస్ 6వ సీజన్లోకి ఎవరెవరు రాబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే.. మొదటి నుంచి కూడా ఎక్కువగా వినిపిస్తున్న వారి పేర్లలో శ్రీ సత్య, నేహా, ఇనాయ సుల్తానా, సుదీప, గీతు అభినయశ్రీ, ఆరోహి రావు, దీపికాపిళ్ళై, వాసంతి, మరీనా, రోహిత్, అర్జున్ కళ్యాణ్ ఇలా కొంతమంది టెలివిజన్ యూట్యూబ్ అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేర్లు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ కమెడియన్స్

జబర్దస్త్ కమెడియన్స్

జబర్దస్త్ లో మంచి గుర్తింపు అందుకున్న కొంతమంది సీనియర్ కమెడియన్లు కూడా రాబోతున్నట్లు మొదటి నుంచి టాక్ వచ్చింది. ఇక అందులో ఎక్కువగా చలాకీ చంటి పేరు అయితే ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక టెలివిజన్ కంటెంట్ తో మంచి కమెడియన్ గా గుర్తింపు అందుకున్న లేడీ కమెడియన్ ఫైమా కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

 మరో ట్రాన్స్ జెండర్

మరో ట్రాన్స్ జెండర్

ఇక గతంలో కొంతమంది ట్రాన్స్ జెండర్స్ కూడా బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టారు. అయితే ఈసారి మరో సెలబ్రిటీ ట్రాన్స్ జెండర్ తన్మయి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. గత సీజన్లో ప్రియాంక సింగ్ ఫైనల్ అంచుల వరకు చేరువైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన్మయి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

మరికొందరు..

మరికొందరు..

ఇక సింగర్ రేవంత్ కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెలబ్రిటీ కపుల్ అయినటువంటి మరియనా, రోహిత్ కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్లు టాక్. అలాగే వీరి వరుసలో మరొక సీనియర్ నటుడు బాలదిత్య అలాగే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ కూడా రాబోతున్నాడు. ఇక బిగ్బాస్ రివ్యూ లతో మంచి క్రేజ్ అందుకున్న ఆదిరెడ్డి కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ 21 మంది పేర్లు అయితే దాదాపు ఫైనల్ అయినట్లు అంటున్నారు. మరి ఈ లిస్ట్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే బిగ్ బాస్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X