Bigg Boss 6 Telugu Elimination Fifth Week:ఫన్ టాస్క్ తో నాగార్జున.. చంటీనే ఎలిమినేట్!.. ప్రోమోతో హింట్?

రేటింగ్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన బిగ్​బాస్​ ఆరో సీజన్​ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి శనివారం, ఆదివారం హోస్ట్ నాగార్జున వచ్చి రివ్యూ చేస్తాడని తెలిసిందే. అయితే ఈ శనివారం అంటే అక్టోబర్ 8న నాగార్జున వచ్చి ఎంటర్టైన్ చేసినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది.

 రేటింగ్ మాత్రం చాలా తక్కువగా..

రేటింగ్ మాత్రం చాలా తక్కువగా..

తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంటూ ఉంటున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వాహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, దీనికి రేటింగ్ మాత్రం చాలా తక్కువగానే వస్తుంది.

ఫన్ టాస్క్ తో నాగార్జున..

ఫన్ టాస్క్ తో నాగార్జున..

ఏది ఎలా ఉన్నా ప్రతి శనివారం, ఆదివారం హోస్ట్ నాగార్జున వచ్చి ఎంటర్ టైన్ చేస్తాడని తెలిసిందే. కానీ గత వారం మాత్రం హౌజ్ మేట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి గట్టి క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం మంచి ఫన్ టాస్క్ తో ముందుకు వచ్చాడు నాగార్జున.

ఎవరు హిట్.. ఎవరు ప్లాప్..

ఎవరు హిట్.. ఎవరు ప్లాప్..

ఇంట్లో ఎవరు హిట్.. ఎవరు ప్లాప్ అనే గేమ్ పెట్టారు. ఇద్దరి పేర్లను నాగార్జున పిలిస్తే వారు వెళ్లి కోర్టు బోనులో నిల్చోవాలి. అప్పుడు వారిద్దరిలో ఎవరు హిట్.. ఎవరు ప్లాప్ అనేది వాళ్లే తేల్చుకోవాలని నాగార్జున చెబుతారు. ముందుగా ఇనయా సుల్తానా, ఆర్జే సూర్యను పిలిచాడు నాగార్జున. దీంతో ఇనయా సిగ్గు పడిపోతూ కనిపించింది.

అన్నీ కలిపిన ఒక ప్యాకేజే హిట్..

అన్నీ కలిపిన ఒక ప్యాకేజే హిట్..

తర్వాత బోనులో ఉన్న ఇనయా తన గురించి మాట్లాడుతూ హిట్ అంటే అన్నీ కలిపిన ఒక ప్యాకేజే హిట్ అవుతుంది అని అంది. దీనికి నాగార్జున.. ఇనయా సుల్తానా ఒక కంప్లీట్ ప్యాకేజీ అని నేను ఒప్పుకుంటున్నా అని తెలిపాడు. దీంతో ఇనయా చాలా సంతోషించింది. తర్వాత ఇనయా తన క్రష్ గురించి బిగ్ బాస్ దగ్గర చెప్పిన విషయం లేవదీసాడు నాగార్జున.

 సత్యభామ అంటే ఇష్టం కదా..

సత్యభామ అంటే ఇష్టం కదా..

అనంతరం అర్జున్ కల్యాణ్ అండ్ వాసంతిని పిలిచాడు నాగార్జున. అర్జున్ నీకు సత్యభామ అంటే ఇష్టం కదా పురాణాల్లో అంటూ ఇన్ డైరెక్ట్ గా శ్రీ సత్య గురించి ప్రస్తావించాడు. తర్వాత అర్జున్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి వాసంతి మాట్లాడిన టాపిక్ పై సెటైర్ వేశాడు నాగార్జున. దీంతో సర్ మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అంటుంది వాసంతి.

ఇది ఎంటర్టైన్ మెంట్ షో కాదు..

ఇది ఎంటర్టైన్ మెంట్ షో కాదు..

తర్వాత గీతూ రాయల్-ఆది రెడ్డి మధ్య పోటి పెట్టాడు నాగార్జున. ఇందులో గీతూ తను గేమ్ తో పాటు ఎంటర్టైన్ మెంట్ ఇస్తానని చెప్పింది. దీనికి ఎంటర్టైన్ మెంట్ తో పనేముంది. ఇది ఎంటర్టైన్ మెంట్ షో కాదు బిగ్ బాస్ షో అని ఆదిరెడ్డి చెప్పాడు. దీంతో ఎంటర్టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్.. బిగ్ బాస్ 6 అని మొన్న నామినేషన్లలో ఇనయాతో శ్రీహాన్ చెప్పిన డైలాగ్ కొట్టింది.

చంటి మాత్రం తెలుసుకోవడం దగ్గరే ఆగిపోయారు..

చంటి మాత్రం తెలుసుకోవడం దగ్గరే ఆగిపోయారు..

ఇక తర్వాత సుదీప, చలాకీ చంటి మధ్య పోటీ నెలకొంది. తాను అందరిని అర్థం చేసుకుని, కలుపుకుని, ఎవరేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించానని, చంటి మాత్రం తెలుసుకోవడం దగ్గరే ఆగిపోయారని సుదీప అంది. దానికి నేను హిట్ అని చెప్పుకోవడం లేదు అని చంటి అన్నాడు. దీంతో నువ్ ప్లాప్ అని ఒప్పుకుంటున్నావా అని నాగార్జున చంటిని అడిగితే అవును సార్ అని సమాధానం ఇచ్చాడు చంటి.

ప్లాప్ అని మీరే చెబుతున్నారా..

చూసే ప్రేక్షకులకు మీరు ప్లాప్ అని మీరే చెబుతున్నారా అని మరోసారి నాగార్జున అడిగాడు. అప్పుడు కూడా అవుననే సమాధానం ఇచ్చాడు చంటి. దీంతో ఎపిసోడ్ ప్రోమో ముగిసింది. చంటి ఇచ్చిన సమాధానంతో నాగార్జున చేతులెత్తిసినట్లు రియాక్షన్ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ తెలుగు 6 ఐదోవారం చలాకి చంటినే ఎలిమినేట్ అవుతాడని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వారం చలాకి చంటీనే ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X