Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ట్విస్టుకు ఇద్దరు బలి.. ఎలిమినేషన్ ప్రమాదంలో ఆ కంటెస్టెంట్లు

కష్టతరమైన పరిస్థితుల మధ్యన తెలుగులోకి పరిచయమైనా.. ఎవరూ ఊహించని రీతిలో ఆరంభంలోనే మంచి స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ షో.. చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో మాత్రమే రికార్డు స్థాయి రేటింగ్‌ను అందుకుంటోంది. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్‌ను కూడా మొదలు పెట్టారు. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్‌లో రెండో వారం ఓటింగ్‌ ఎలా జరుగుతుంది అనే వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఎప్పటికప్పుడు మజాను పంచేలా

ఎప్పటికప్పుడు మజాను పంచేలా

తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా బిగ్ బాస్ భారీ స్పందనను దక్కించుకుంటూ సక్సెస్ అవుతోంది. ఇప్పుడు ప్రసారం అవుతోన్నా ఆరో సీజన్‌కు అదే రీతిలో ఆదరణ దక్కుతోంది. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో సరికొత్త కంటెంట్‌ను చూపించడంతో పాటు సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. అలాగే, ఎప్పటికప్పుడు ట్విస్టులు కూడా చూపిస్తున్నారు. దీంతో ఇది మరింత రంజుగా నడుస్తోంది.

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లేకుండానే

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లేకుండానే

ఆరో సీజన్‌లోకి కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారంలో మాత్రం ఎవరినీ ఎలిమినేట్ చేయకుండా సర్‌ప్రైజ్ చేసేశారు.

నామినేషన్స్ మాత్రం వైవిధ్యంగా

నామినేషన్స్ మాత్రం వైవిధ్యంగా

బిగ్ బాస్ షోలో మామూలుగా సోమవారం రోజే నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. కానీ, ఆరో సీజన్‌లో మాత్రం దీన్ని వైవిధ్యంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొదటి వారం ఈ టాస్కును బుధవారం ఎపిసోడ్‌లో నిర్వహించారు. కానీ, రెండో వారంలో మాత్రం సోమవారమే ప్రసారం చేశారు. ఇక, రాను రానూ ఈ టాస్కును వాళ్లకు నచ్చినట్లు మారుస్తారని తెలుస్తోంది.

ఆరుగురు మాత్రమే.. ఇద్దరు బుక్

ఆరుగురు మాత్రమే.. ఇద్దరు బుక్

ఆరో సీజన్ రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా గొడవలతో సాగింది. ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులు రేవంత్, ఫైమా, మెరీనా అండ్ రోహిత్, అభినయశ్రీ, ఆదిరెడ్డి, గీతూ రాయల్ నామినేట్ అయ్యారు. అయితే, బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ కెప్టెన్ బాలాదిత్యను మరో ఇద్దరినీ నామినేట్ చేయమని చెప్పగా.. అతడు రాజశేఖర్, షానీ సాల్మన్‌ను నామినేట్ చేశాడు.

మొదటి స్థానంలో ఎవరున్నారు?

మొదటి స్థానంలో ఎవరున్నారు?


బిగ్ బాస్ ఆరో సీజన్ రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్‌లో సింగర్ రేవంత్ కొనసాగుతున్నాడని తెలిసింది. అతడి తర్వాతి స్థానంలో జబర్ధస్త్ ఫైమా ఉందని సమాచారం. అయితే, వీళ్లిద్దరి మధ్య రెండు మూడు శాతమే తేడా ఉందని టాక్.

మిగతా కంటెస్టెంట్ల స్థానాలు ఇవే

మిగతా కంటెస్టెంట్ల స్థానాలు ఇవే

బిగ్ బాస్ ఆరో సీజన్ రెండో వారంలో జరుగుతోన్న ఓటింగ్‌లో రేవంత్, ఫైమా టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగుతున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఈ సారి నామినేషన్స్‌లో మూడో స్థానంలో మెరినా అండ్ రోహిత్, నాలుగో స్థానంలో ఆది రెడ్డి, ఐదో స్థానంలో గీతూ రాయల్, ఆరో స్థానంలో అభినయశ్రీలు ఉన్నారట.

డేంజర్‌ జోన్‌లోకి ఆ కంటెస్టెంట్లు

డేంజర్‌ జోన్‌లోకి ఆ కంటెస్టెంట్లు

ఆరో సీజన్ రెండో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఊహించని విధంగా నామినేట్ అయిన షానీ సాల్మన్, రాజశేఖర్‌లు చివరి స్థానాల్లో కొనసాగుతున్నారట. అంటే వీళ్లిద్దరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటింగ్ ముగిసే సమయానికి మరో మూడు రోజులు సమయం ఉండడంతో ఈ స్థానాల్లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X