Bigg Boss Elimination: చివరి రోజు బిగ్ ట్విస్ట్.. లాస్ట్ కంటెస్టెంట్ సేఫ్.. వాళ్లిద్దరిలో ఒకరు ఔట్

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలే మాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ కార్యక్రమం.. తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకుంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా మొదలు పెట్టారు.

ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, మొదటి వారం ఎలిమినేషన్ లేకపోవడంతో రెండో వారంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో

మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో

ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో మాత్రమే బిగ్ బాస్ షోకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అందుకే నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ లేకుండా సీజన్లను పూర్తి చేసుకుంటున్నారు. ఇక, ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా సాగుతోంది. ఇందులో నిర్వహకులు కొత్త ప్రయోగాలు చేస్తూ మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు.

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదుగా

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదుగా

తాజా సీజన్‌లోకి కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారంలో మాత్రం ఎలిమినేషన్ తీసేసి నిర్వహకులు సర్‌ప్రైజ్ చేశారు.

నామినేషన్‌లో వైవిధ్యంగానే

నామినేషన్‌లో వైవిధ్యంగానే

సాధారణంగా బిగ్ బాస్ షోలో సోమవారం రోజే నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. కానీ, ఆరో సీజన్‌లో మాత్రం దీన్ని వైవిధ్యంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొదటి వారం ఈ టాస్కును బుధవారం ఎపిసోడ్‌లో నిర్వహించారు. కానీ, రెండో వారంలో మాత్రం సోమవారమే ప్రసారం చేశారు. ఇక, రాను రానూ ఈ టాస్కును వీక్ డేస్‌లో కూడా మారుస్తారని సమాచారం.

ఎనిమిది మంది నామినేషన్

ఎనిమిది మంది నామినేషన్

రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఇందులో ఆరుగురు సభ్యులు రేవంత్, ఫైమా, మెరీనా అండ్ రోహిత్, అభినయశ్రీ, ఆదిరెడ్డి, గీతూ రాయల్ నామినేట్ అయ్యారు. అయితే, బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ కెప్టెన్ బాలాదిత్యను మరో ఇద్దరినీ నామినేట్ చేయమని చెప్పగా.. అతడు రాజశేఖర్, షానీ సాల్మన్‌ను నేరుగా నామినేట్ చేశాడు.

ఎక్కువ ఓట్లు వాళ్లిద్దరికేనట

ఎక్కువ ఓట్లు వాళ్లిద్దరికేనట

బిగ్ బాస్ ఆరో సీజన్ రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం రాత్రితో ముగిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ చివరి వరకూ సింగర్ రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయట. అంతేకాదు, అతడికి యాభై శాతం వరకూ ఓట్లు వచ్చాయని తెలిసింది. అతడి తర్వాతి స్థానంలో అంటే సెకెండ్ ప్లేస్‌లో ఫైమా ఉందని సమాచారం.

మిగిలిన వాళ్ల స్థానాలు ఇవే

మిగిలిన వాళ్ల స్థానాలు ఇవే

బిగ్ బాస్ ఆరో సీజన్ రెండో వారంలో జరిగిన ఓటింగ్‌లో రేవంత్, ఫైమా టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగినట్లు తెలిసింది. దీని ప్రకారం ఈ సారి నామినేషన్స్‌లో మూడో స్థానంలో గీతూ రాయల్, నాలుగో స్థానంలో ఆది రెడ్డి, ఐదో స్థానంలో మెరీనా అండ్ రోహిత్, ఆరో స్థానంలో రాజశేఖర్ నిలిచినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

బిగ్ బాస్ ఆరో సీజన్ రెండో వారానికి సంబంధించి జరిగిన ఓటింగ్‌లో ఊహించని విధంగా నామినేట్ అయిన షానీ సాల్మన్‌తో పాటు అభినయశ్రీ చివరి స్థానాల్లో ఉన్నారట. అంటే వీళ్లిద్దరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మొన్నటి వరకూ డేంజర్ జోన్‌లో ఉన్న రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడన్న వార్తతో చివరి రోజు ఓట్లు సాధించడట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X