Bigg Boss Elimination: ఓటింగ్‌లో సంచలనం.. డేంజర్ జోన్‌లో టాప్ ప్లేయర్స్.. ఈ సీజన్‌లోనే తొలిసారి

ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అవుతోన్నా.. తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. అంతలా ఇది ఆరేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. దీంతో ఇప్పుడు ఆరో దానిని ముందుకు నడుపుతున్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆరో సీజన్‌లో 13వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో డేంజర్ జోన్‌లో ఉన్నదెవరో మీరే చూడండి!

మరింత రసవత్తరంగా సాగేలా

మరింత రసవత్తరంగా సాగేలా

భారీ అంచనాల నడుమ వచ్చిన బిగ్ బాస్ ఆరో సీజన్‌కు ఆరంభంలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో నిర్వహకులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడిది చివరి దశకు చేరడంతో మరింత రసవత్తరంగా సాగేలా టాస్కులు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో రేటింగ్‌లో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

ఏకంగా 13 మంది ఎలిమినేట్

ఏకంగా 13 మంది ఎలిమినేట్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మొదటి వారం ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో, పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇలా ఇప్పటికి పన్నెండు వారాలు కంప్లీట్ అయిపోయాయి. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనా, రాజ్‌లు వెళ్లిపోయారు.

వాళ్లు తప్ప అంతా నామినేట్

వాళ్లు తప్ప అంతా నామినేట్

ఆరో సీజన్‌లోని పదమూడో వారం నామినేషన్స్ టాస్కు ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా జరిగింది. ఇక, ఈ వారానికి జరిగిన ఈ టాస్క్‌లో రేవంత్, ఆది రెడ్డి, కీర్తి భట్, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేషన్‌లో ఉన్నారు. ఇక, ఈ వారం కెప్టెన్ అవడం వల్ల ఇనాయా సుల్తానా సేఫ్ అవగా.. ఓట్లు పడని కారణంగా శ్రీహాన్ చోటూ కూడా నామినేషన్స్‌ను తప్పించుకున్నాడు.

ఈసారి ఓటింగ్‌లో సెన్సేషన్

ఈసారి ఓటింగ్‌లో సెన్సేషన్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని ఎలిమినేషన్స్ సాగుతున్నాయి. ఇక, ఇది ఇప్పుడు చివరి దశకు చేరడంతో ఎలిమినేషన్స్‌పై అందరూ ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ తమ అభిమాన కంటెస్టెంట్‌ను సేఫ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పదమూడో వారం ఓటింగ్‌ ఎన్నో ట్విస్టులతో సెన్సేషన్ అవుతోంది.

హవాను చూపిస్తోన్న రేవంత్

హవాను చూపిస్తోన్న రేవంత్


ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లో చాలా మంది బిగ్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో సింగర్ రేవంత్ మాత్రం టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటున్నాడు. అందుకే అతడు ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా అత్యధిక ఓట్లతో టాప్‌లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోన పదమూడో వారం కూడా రేవంత్‌కే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నట్లు తాజాగా తెలిసింది.

మిగిలిన స్థానాల్లో ఎవరంటే!

మిగిలిన స్థానాల్లో ఎవరంటే!


ఆరో సీజన్ పదమూడో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి సింగర్ రేవంత్ మొదటి స్థానంలోనే ఉన్నాడు. అతడి తర్వాత వరుసగా రెండో స్థానంలో రోహిత్ సాహ్నీ, మూడో స్థానంలో కీర్తి భట్, నాలుగో స్థానంలో శ్రీ సత్యలు ఉన్నారని తెలిసింది. ఇదే కంటిన్యూ అయితే వీళ్లంతా సేఫ్ అవుతారు. ఇదిలా ఉండగా.. శ్రీహాన్ ఫ్యాన్స్ ఓట్లు శ్రీ సత్యకు పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

డేంజర్ జోన్‌లో టాప్ ప్లేయర్లు

డేంజర్ జోన్‌లో టాప్ ప్లేయర్లు


బిగ్ బాస్ ఆరో సీజన్ పదమూడో వారానికి సంబంధించిన ఓటింగ్‌‌లో ప్రస్తుతం ఆది రెడ్డి ఐదో స్థానంలో, ఫైమా ఆరో స్థానంలో ఉన్నట్లు సమాచారం. అంటే ఈ వారానికి వీళ్లిద్దరూ డేంజర్‌ జోన్‌లో పడిపోయారు. ఈ సీజన్‌లోనే తొలిసారి ఆది రెడ్డికి ఓటింగ్ చాలా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇక, ఈ వారం టాస్కులను బట్టి వీళ్ల స్థానాలు మారొచ్చు. లేకుండా ఈ ఇద్దరిలో ఒకరు వెళ్లొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X