Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Keerthi Remuneration: జాక్‌పాట్ కొట్టిన కీర్తి భట్.. అందరి కంటే ఎక్కువ.. రెమ్యూనరేషన్‌తో రికార్డ్
సరికొత్త కంటెంట్‌తో సాగుతూ.. చాలా కాలంగా ప్రేక్షకులకు మజాను పంచుతూ.. అత్యధిక రేటింగ్‌తో దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది తెలుగు బిగ్ బాస్. అందుకే నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను భారీ రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్‌ను కూడా మొదలెట్టి.. ఆదివారంతో దీన్ని కూడా ముగించింది. ఈ నేపథ్యంలో ఇందులో కంటెస్టెంట్‌గా వచ్చి.. సెకెండ్ రన్నరప్‌గా నిలిచిన కీర్తి భట్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులు మీకోసం!

బిగ్ బాస్ ఛాన్స్.. హైలైట్‌గా
బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్ బాస్నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా సెలెక్ట్ చేశారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపించారు. అందులో ప్రముఖ సీరియల్ హీరోయిన్ కీర్తి భట్ ఒకరు. ఈమె ఆరంభంలోనే హైలైట్ అయింది.
Revanth Remuneration: రేవంత్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్.. ప్రైజ్ మనీతో కలిపితే.. చేతికొచ్చింది మాత్రం!

గాయమైన తగ్గకుండా పోటీ
సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తెగ సందడి చేస్తోన్న కీర్తి భట్ అనతి కాలంలోనే తెలుగులో విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఎనలేని క్రేజ్ కూడా దక్కింది. అలాగే, ఇటీవలే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, చేతి వేలు విరిగినా ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేసి ప్రశంసలు దక్కించుకుంది.

ఫినాలేకు చేరుకున్న నటి
15 వారాల పాటు రంజింపజేసిన ఆరో సీజన్ ఆదివారంతో ముగిసింది. తారల తళుకుబెళుకుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని గెస్టులు స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, మాజీ కంటెస్టెంట్లు డ్యాన్సులతో మెప్పించారు. ఇక, ఇందులో రేవంత్, శ్రీహాన్, ఆది రెడ్డి, రోహిత్‌లతో కలిసి కీర్తి భట్ కూడా ఫినాలేలో టైటిల్ కోసం పోరాడింది.
Shrihan Remuneration: శ్రీహాన్ గెలిచింది 45 లక్షలు.. రెమ్యూనరేషన్ భారీగా.. ట్యాక్సులు పోను ఎంతంటే!

డబ్బు వద్దని... ఎలిమినేట్
చాలా ట్విస్టులతో సాగిన ఆరో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌లో రోహిత్, ఆది రెడ్డి ఎలిమినేట్ అయిన తర్వాత టాప్ 3 కంటెస్టెంట్లు హౌస్‌లో ఉన్నప్పుడు రవితేజ వెళ్లి వాళ్లకు ఆఫర్ ఇచ్చాడు. ఆ సమయంలో కీర్తి భట్‌ను ఆమె తరపున వచ్చిన వ్యక్తి అమౌంట్ తీసుకోమని అన్నాడు. కానీ, ఆమె డబ్బులు వద్దని చెప్పింది. ఫలితంగా ఈ రౌండ్‌లోనే ఆమె ఎలిమినేట్ అయి బయటకొచ్చింది.

కీర్తి రెమ్యూనరేషన్ ఎంత?
బిగ్
బాస్
హౌస్‌లో
15
వారాల
పాటు
ఉన్న
కీర్తి
భట్‌కు
ఎంత
రెమ్యూనరేషన్
ఇచ్చారన్న
దానిపై
అప్పుడే
పలు
రకాల
వార్తలు
వైరల్
అవుతున్నాయి.
స్ట్రాంగ్
కంటెస్టెంట్‌గా
పేరొందిన
ఆమెకు
బాగానే
ముట్టజెప్పి
ఉంటారని
అంతా
అనుకున్నారు.
తాజా
సమాచారం
ప్రకారం..
ఈ
సీజన్
కోసం
కీర్తి
భట్‌కు
ఏకంగా
రూ.
9
లక్షలు
వరకూ
రెమ్యూనరేషన్
తీసుకుందని
తెలిసింది.
బాత్రూంలో జాతి రత్నాలు చిట్టి హాట్ షో: అదొక్కటే చుట్టుకుని టెంప్ట్ చేస్తోందిగా!

వారానికే అన్ని వేల అని
బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. కీర్తి భట్‌కు బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం వారానికి రూ. 60 వేలు రెమ్యూనరేషన్‌గా అందించారని తెలిసింది. అలా పదిహేను వారాల పాటు ఉన్న ఈ లేడీ ఏకంగా రూ. 9 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. లేడీ కంటెస్టెంట్లు అందరిలోనూ ఇదే అత్యధిక మొత్తం అని కూడా ఓ న్యూస్ బయటకు వచ్చేసింది.

ఓవరాల్‌గా రెండో స్థానం
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఆరో సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రేవంత్‌కు మాత్రమే వారానికి రూ. 65 వేలు చెల్లించారు. అతడి తర్వాత కీర్తి భట్‌కు, చలాకీ చంటికి రూ. 60 వేలు ఇచ్చారని తెలిసింది. అంటే.. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్లలో ఆమె రెండో స్థానంలో నిలిచింది. దీనికితోడు మంచి ఫేమ్‌ను కూడా సంపాదించుకుంది.