For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rohit Remuneration: రోహిత్‌కు ఊహించని రెమ్యూనరేషన్.. మరీ ఇంత తక్కువగా.. మెరీనాతో కలిపితే మాత్రం!

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలలో అన్నింటికీ ప్రేక్షకుల మద్దతు లభిస్తుందన్న గ్యారెంటీ లేదు. అలాంటిది గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అయినా.. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సూపర్ హిట్ అయిందే బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. గత ఆదివారంతో ఆరో దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక, ఇందులో సాదాసీదాగా వచ్చి ఫైనలిస్టుగా నిలిచిన రోహిత్ అందరి మనసులు దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి రెమ్యూనరేషన్ గురించి తెలుసుకుందాం పదండి!

   స్పెషల్ కంటెస్టెంట్లుగా జంట

  స్పెషల్ కంటెస్టెంట్లుగా జంట

  బిగ్ బాస్ ఆరో సీజన్‌కు కంటెస్టెంట్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. ఇక, ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లుండగా.. అందులో మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీలు మాత్రమే జంటగా ఎంట్రీ ఇచ్చారు.

  బాత్రూంలో జాతి రత్నాలు చిట్టి హాట్ షో: అదొక్కటే చుట్టుకుని టెంప్ట్ చేస్తోందిగా!

  వేరు వేరుగా ఆడి.. మంచిగానే

  వేరు వేరుగా ఆడి.. మంచిగానే


  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి జంటగా ఎంట్రీ ఇచ్చిన మెరీనా, రోహిత్.. కొన్ని వారాల పాటు ఒకే కంటెస్టెంట్‌గా వ్యవహరించారు. అయితే, ఆ తర్వాత వీళ్లిద్దరినీ విడదీసి వేరు వేరు ఇంటి సభ్యులుగా మార్చారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ తమదైన శైలిలో గేమ్ ఆడుతూ వచ్చారు. అంతేకాదు, జంటగా వచ్చినా ఇద్దరూ ఓవర్ యాక్టింగ్ చేయకుండానే, గొడవలు పడకుండానే అలరించారు.

  మోరీనా వెళ్లాక.. అదరగొట్టేసి

  మోరీనా వెళ్లాక.. అదరగొట్టేసి


  ఆరంభంలో జంటగా సందడి చేసిన మెరీనా, రోహిత్.. ఆ తర్వాత ఎవరి ఆట వాళ్లు ఆడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత మెరీనా షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అప్పటి నుంచి రోహిత్ తనలోని కొత్త యాంగిల్‌ను బయటకు తీసుకొచ్చి ప్రేక్షకులను అలరించాడు. ఫలితంగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు ఏకంగా ఫినాలేలో అడుగు పెట్టేశాడు.

  Keerthi Remuneration: జాక్‌పాట్ కొట్టిన కీర్తి భట్.. అందరి కంటే ఎక్కువ.. రెమ్యూనరేషన్‌తో రికార్డ్

  ఐదో స్థానమే... నిఖిల్ చేతిలో

  ఐదో స్థానమే... నిఖిల్ చేతిలో


  రేవంత్, శ్రీహాన్, కీర్తి భట్, ఆది రెడ్డిలతో పాటు టాప్ 5గా నిలిచి ఫినాలేలో అడుగు పెట్టిన రోహిత్ సాహ్నీకి కూడా బాగానే ఓటింగ్ నమోదైంది. దీంతో అతడు మూడు లేదా నాలుగో స్థానాల్లో ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ముందుగా ఎలిమినేటై ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హీరో నిఖిల్ అతడిని ఎలిమినేట్ చేయగా.. నాగ్ ప్రశంసలతో ముంచెత్తాడు.

  రోహిత్‌ రెమ్యూనరేషన్ ఎంత?

  రోహిత్‌ రెమ్యూనరేషన్ ఎంత?


  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఫినాలేలో అడుగు పెట్టడంతో పాటు హౌస్‌లో 15 వారాల పాటు ఉన్న రోహిత్ సాహ్నీకి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మంచి కంటెస్టెంట్‌గా పేరొందిన అతడికి ఫైనలిస్టుల్లో తక్కువ వచ్చిందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లో రోహిత్ రూ. 6.75 లక్షలు తీసుకున్నాడట.

  నగ్నంగా చరణ్ హీరోయిన్: ప్రైవేటు భాగాలను అలా కవర్ చేస్తూ ఘోరంగా!

  వారానికి 45.. మొత్తంగా ఇలా

  వారానికి 45.. మొత్తంగా ఇలా


  బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. రోహిత్ సాహ్నీకి బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం వారానికి రూ. 45 వేలు రెమ్యూనరేషన్‌గా అందించారని తెలిసింది. అలా పదిహేను వారాల పాటు ఉన్న అతడు రూ. 6.75 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. డబ్బును పక్కన పెడితే మంచి కంటెస్టెంట్‌గా రోహిత్ అందరి హృదయాల్లో నిలిచిపోయాడు.

  మెరీనాకు అంత.. మొత్తంగా

  మెరీనాకు అంత.. మొత్తంగా


  ఇక, బిగ్ బాస్ ఆరో సీజన్‌లో మెరీనా అబ్రహంకు వారానికి రూ. 35 వేలు చొప్పున రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఆమె బిగ్ బాస్ హౌస్‌లో 11 వారాల పాటు కొనసాగింది. దీంతో ఈ నటికి మొత్తంగా రూ. 3.85 లక్షలు రెమ్యూనరేషన్ వచ్చిందని తెలిసింది. ఇక, జంటగా వీళ్లు బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా రూ. 10.60 లక్షలు ఖాతాలో వేసుకున్నట్లు బుల్లితెర వర్గాల ద్వారా తెలిసింది.

  English summary
  Bigg Boss 6th Season Completed Successfully. Rohit Sahni Stands 5 Position in This Season. Let We See About His Remuneration Details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X