Bigg Boss Elimination: 9వ ఓటింగ్‌లో ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో టాప్ లేడీస్.. వాళ్లలో ఒకరు ఎలిమినేట్
సరికొత్త టాస్కులు.. మధ్యలో ఊహించని సంఘటనలు.. వారం చివర్లో ఎమోషనల్ ఎలిమినేషన్లు.. ఇలా ఎన్నో రకాలుగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. దేశంలోని ఎన్నో భాషల్లో వస్తున్నా.. తెలుగులో ప్రసారం అయ్యే షోకు మాత్రమే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా కొత్త కంటెంట్‌తో రసవత్తరంగా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ పూర్తి వివరాలు మీరే చూడండి!

ప్రయోగాలు చేసినా రావట్లేదు
సుదీర్ఘ కాలంగా తెలుగులో టాప్ షోగా వెలుగొందడంతో పాటు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది బిగ్ బాస్. దీంతో ఆరో సీజన్ ఎన్నో అంచనాలతో మొదలై, సరికొత్త కంటెంట్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, దీనికి రెస్పాన్స్ అంతగా రావడం లేదు. ఫలితంగా ఈ సీజన్ రేటింగ్ తగ్గిపోతోంది.

ఇప్పటికే 8 మంది ఎలిమినేట్
ఆరో సీజన్‌లోకి గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, అర్జున్ కల్యాణ్, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, రేవంత్‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, ఆర్జున్, సూర్యలు వెళ్లారు.

ఈ నామినేషన్స్‌లో 10 మంది
గతంలో కంటే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో నామినేషన్స్ టాస్కులో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన తొమ్మిదో నామినేషన్స్ టాస్కు కూడా రచ్చ రచ్చగానే సాగింది. ఇక, ఈ వారంలో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, గీతూ రాయల్, కీర్తి భట్, శ్రీ సత్య, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్నీలు ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు.

టాస్కుకు తగ్గట్లుగానే ఓటింగ్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో తొమ్మిదో వారానికి సంబంధించి 'మిషన్ ఇంపాజిబుల్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో ఆటతీరును బట్టి కంటెంస్టెంట్లకు ఓటింగ్ నమోదు అవుతుంది. దీంతో ఎవరు మంచిగా ఆడుతున్నారో వాళ్లకు ఎక్కువ.. చెడ్డగా ఆడుతూ, తమ ప్రవర్తనతో విసుగు తెప్పిస్తున్న వారికి తక్కువగా ఓట్లు వస్తున్నాయి. దీంతో ఈ లిస్టులో చాలా మార్పులు వస్తున్నాయి.

టాప్‌లో అతడే.. సెకెండ్ ఆమె
ఆరో సీజన్‌లోని తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ సోమవారం రాత్రి నుంచే అనూహ్యంగా సాగుతోంది. కానీ, మొదటి స్థానంలో మాత్రం టైటిల్ ఫేవరెట్ రేవంత్ అత్యధిక ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడని తెలిసింది. అతడికే దాదాపు 30 శాతం ఓటింగ్ నమోదు అవుతుందట. ఇక, రేవంత్ తర్వాత ఇనాయా సుల్తానా రెండో స్థానంలో కొనసాగతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు?
బిగ్ బాస్ ఆరో సీజన్ తొమ్మిదో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో తాజా సమాచారం ప్రకారం.. బాలాదిత్య మూడో స్థానంలో, కీర్తి భట్ నాలుగో స్థానంలో శ్రీ సత్య ఐదో స్థానంలో, రోహిత్ సాహ్నీ ఆరో స్థానంలో, ఆది రెడ్డి ఏడో స్థానంలో ఉన్నారని తెలిసింది. చివరి రోజైన శనివారం మాత్రం ఓటింగ్‌లో మార్పులు లేకపోతే వీళ్లంతా ఈ వారానికి దాదాపుగా సేఫ్ అయినట్లే అని అనుకోవాలి.

వాళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్
తాజా సీజన్ తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ఊహించని విధంగా సాగుతుంది. ఇందులో జబర్ధస్త్ ఫైమా ఎనిమిదో స్థానంలో ఉందని తెలిసింది. అలాగే, మెరీనా అబ్రహం తొమ్మిదో స్థానంలోనూ, గీతూ రాయల్ పదో స్థానంలోనూ ఉన్నారని అంటున్నారు. అంటే ఈ వారంలో ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


Click it and Unblock the Notifications











