Bigg Boss Elimination: బిగ్ షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ 2 ప్లేయర్ ఎలిమినేట్.. బయటపడ్డ మరో కుట్ర కోణం!

తెలుగు టెలివిజన్‌పై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూనే ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. సీజన్ సీజన్‌కు సరికొత్త టాస్కులు.. ఊహించని సంఘటనలు.. ఆసక్తిని కలిగించే ఎలిమినేషన్స్ ఇలా ఎన్నో రకాల పరిణామాలతో షో ఆద్యంతం మజాను పంచుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నడుస్తోన్న ఆరో సీజన్‌ కూడా అదే విధంగా సాగుతోంది. ఇందులో ఇప్పుడు చివరి ఎలిమినేషన్ ఉండడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో 14వ వారంలో ఓ బిగ్ షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

అలా వచ్చారు.. వీళ్లు వెళ్లారు

అలా వచ్చారు.. వీళ్లు వెళ్లారు

ఇప్పుడు నడుస్తోన్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో ఎన్నో ఊహించని ఎలిమినేషన్స్ జరిగాయి. ఇలా ఇప్పటికి 13 వారాలు పూర్తి అవగా.. హౌస్ నుంచి 14 మంది బయటకు వెళ్లారు. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనా, రాజ్‌, ఫైమాలు ఎలిమినేట్ అయ్యారు.

14వ వారంలో ఒక్కడు తప్ప

14వ వారంలో ఒక్కడు తప్ప

బిగ్ బాస్ ఆరో సీజన్ ఫినాలే దశకు చేరుకుంది. దీంతో చివరి ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్‌లో అందరినీ నామినేట్ చేశారు. అయితే, టికెట్ టు ఫినాలే టాస్కు గెలిచి మొదటి ఫైనలిస్ట్ అయిన శ్రీహాన్‌ తప్ప హౌస్‌లో ఉన్న వాళ్లందరూ అంటే రేవంత్, ఆది రెడ్డి, కీర్తి భట్, ఇనాయా సుల్తానా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఎన్నో మార్పులతో ఓటింగ్

ఎన్నో మార్పులతో ఓటింగ్

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పుడు హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. అందులో ఆరుగురు నామినేట్ అయ్యారు. ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను ఫినాలేకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ వారం ఓటింగ్ మొత్తం ఎన్నో మార్పులతో సాగింది. ఫలితంగా ఇందులో చాలానే ట్విస్టులు కనిపించాయి.

అత్యధిక ఓట్లతో టాప్ ప్లేస్

అత్యధిక ఓట్లతో టాప్ ప్లేస్

ఆరో సీజన్‌లోకి మొత్తం 21 మంది సభ్యులు కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో రేవంత్ మాత్రమే ఆరంభం నుంచే తనదైన ఆటతీరుతో టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తున్నాడు. దీంతో అతడు ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా అత్యధిక ఓటింగ్‌తో సేఫ్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే పద్నాలుగో వారం కూడా అతడే దాదాపు 25 శాతం ఓటింగ్‌తో టాప్‌లో నిలిచాడని సమాచారం.

రేవంత్ తర్వతా ఎవరంటే

రేవంత్ తర్వతా ఎవరంటే

బిగ్ బాస్ ఆరో సీజన్ పద్నాలుగో వారానికి జరిగిన ఓటింగ్‌లో సింగర్ రేవంత్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడని తెలిసింది. అతడి తర్వాత అంటే రెండో స్థానంలో రోహిత్ సాహ్నీ ఉన్నాడని సమాచారం. ఇక, మూడో స్థానంలో లేడీ ఫైర్ బ్రాండ్ ఇనాయా సుల్తానా నిలిచినట్లు, నాలుగో స్థానంలో రివ్యూవర్ ఆది రెడ్డి ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. వీళ్లు దాదాపు సేఫ్ అవుతారని టాక్.

ఇద్దరు లేడీస్ డేంజర్ జోన్

ఇద్దరు లేడీస్ డేంజర్ జోన్

ఆరో సీజన్‌లో చివరి ఎలిమినేషన్ ఉండే పద్నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్‌‌ ముగిసే సమయానికి శ్రీ సత్య ఐదో స్థానంలో ఉండగా, కీర్తి భట్ ఆరో స్థానానికి పడిపోయినట్లు తెలిసింది. అంటే వీళ్లిద్దరిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరూ వెళ్లే ఛాన్స్ కూడా ఉందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

బిగ్ షాకింగ్ ఎలిమినేషన్?

బిగ్ షాకింగ్ ఎలిమినేషన్?

పద్నాలుగో వారం ఎలిమినేషన్‌కు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ వారం ఇనాయా సుల్తానాను ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. ఆమె కంటే తక్కువ ఓట్లు వచ్చిన రివ్యూవర్ ఆది రెడ్డిని సేఫ్ చేసి ఫినాలేకు పంపడం కోసమే బిగ్ బాస్ ఈ కుట్రకు పాల్పడుతుందని కొన్ని సోషల్ మీడియా పేజీల్లో పోస్టులు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X