Bigg Boss 6: కంటెస్టెంట్ గా ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో.. భారీ అమౌంట్ కు గ్రీన్ సిగ్నల్?

బిగ్ బాస్ ద్వారా కొంతమంది సినీ ఆర్టిస్టులు రీ ఎంట్రీ తో సరికొత్తగా గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. అయితే మరికొందరు మాత్రం ఈ కాంట్రవర్సీ షో లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. బిగ్ బాస్ అయితే ఎవరూ ఊహించని సెలబ్రిటీలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక త్వరలో స్టార్ట్ కాబోయే 6వ సీజన్లో కూడా మాజీ హీరోలు రాబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పట్లో మంచి గుర్తింపును అందుకున్న హ్యాండ్సమ్ హీరో కూడా రీ ఎంట్రీ ఇస్తాడు అని కథనాలు వెలువడుతున్నాయి. అతనికి మంచి రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

కాంట్రవర్సీ షో అయినప్పటికీ..

కాంట్రవర్సీ షో అయినప్పటికీ..

బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకోవచ్చు అని కొంతమంది తక్కువ స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు కంటెస్టెంట్ గా పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు. బిగ్ బాస్ షోలో కాంట్రవర్సీ షో అయినా కూడా ఏదో ఒక విధంగా గొడవలు పడిన కూడా జనాల ఫోకస్ అయితే వారిపై పడుతుంది అందుకే తప్పయినా ఒప్పయినా కూడా బిగ్ బాస్ లోకి రావడానికి కొంతమంది ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈసారి కూడా కొంతమంది సినీ ప్రముఖులు బిగ్ బాస్ ఆరో సీజన్ లోకి అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

 కంటెస్టెంట్స్ గా ఎంతమంది అంటే?

కంటెస్టెంట్స్ గా ఎంతమంది అంటే?

బిగ్ బాస్ నాన్ స్టాప్ అనంతరం ఈ సారి ఆరో సీజన్ తో మాత్రం ఎలాగైనా మంచి రేటింగ్స్ అందుకోవాలని ఆలోచిస్తున్నట్లు ప్లాన్ సమాచారం. డైరెక్ట్ గా టెలివిజన్లో ఎప్పటిలానే మొదలయ్యే ఈ రియాలిటీ షో కోసం ఇప్పటికే పూర్తి ప్లాన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్స్ విషయంలో కూడా దాదాపు 30 మందికి పైగా పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. అందులో 18 మంది కంటెస్టెంట్స్ గా ఆరో సీజన్లో మొదలుపెట్టే ఛాన్స్ ఉందట.

సెలబ్రెటీలు మాత్రమే కాకుండా..

సెలబ్రెటీలు మాత్రమే కాకుండా..

బిగ్ బాస్ షో సీజన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలనే విభిన్నమైన సెలబ్రిటీలను తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. కేవలం యూట్యూబ్ స్టార్స్ టెలివిజన్ స్టార్స్, సినీ సెలబ్రెటీలు మాత్రమే కాకుండా ఆరో సీజన్లో కామన్ మ్యాన్ కేటగిరిలో సాదారణ జనాల నుంచి ఇద్దరినీ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి.

ఒకప్పటి హీరో రీ ఎంట్రీ?

ఒకప్పటి హీరో రీ ఎంట్రీ?

ఇక త్వరలోనే మొదలు కాబోయే ఆరో సీజన్ కోసం ఒక ప్రముఖ మాజీ హీరో ని కూడా సంప్రదించినట్లు సమాచారం. అతను మరెవరో కాదు వడ్డే నవీన్ అని తెలుస్తోంది. తెలుగులో పెళ్లి అనే సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో అప్పట్లో అమ్మాయిలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకున్నాడు. మనసిచ్చి చూడు, స్నేహితులు, ప్రేమించే మనసు, బాగున్నారా, నా హృదయంలో నిదురించే చెలి.. అనే సినిమాలతో వడ్డే నవీన్ మంచి క్రేజ్ అందుకున్నాడు.

 అడిగినంత రెమ్యునరేషన్?

అడిగినంత రెమ్యునరేషన్?


వడ్డే నవీన్ గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగానే ఉంటున్నారు నిర్మాతగా కూడా ఆయన తండ్రి వడ్డే రమేష్ కొన్ని సినిమాలు నిర్మించాడు. అయితే సొంతంగానే వ్యాపారులతో కొనసాగుతున్న వడ్డే నవీన్ ఆ మధ్య రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఎటాక్ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించి మళ్లీ హఠాత్తుగా మాయమయ్యారు. ఇక బిగ్ బాస్ ద్వారా మళ్లీ సరికొత్తగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఆయనకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X